Neeraj
-
శ్రీ సిమెంట్ ఉత్పత్తి షురూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రభుత్వ సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 6 నెలల ముందుగానే ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా శ్రీ సిమెంట్ రికార్డు సృష్టించింది. గతేడాది విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న శ్రీ సిమెంట్ రికార్డు సమయంలోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద రూ.2,500 కోట్లతో ఏర్పాటు చేసిన సిమెంట్ పరిశ్రమ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించినట్టు శ్రీ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అకోరే ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రారం¿ోత్సవ కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉత్పత్తిని ప్రారంభించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఏటా 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన దాచేపల్లి యూనిట్‌తో శ్రీ సిమెంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 56.4 మిలియన్ టన్నులకు చేరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అవసరాలను తీర్చేవిధంగా దాచేపల్లిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు శ్రీ సిమెంట్ ప్రకటించింది. ఈ యూనిట్ రాకతో మొత్తం 2,000 మందికి ఉపాధి లభించిందని, ఇందులో అత్యధికంగా స్థానిక యువతకే ప్రాధాన్యతను కల్పించామని పేర్కొంది. దేశంలోనే తొలి పర్యావరణహిత యూనిట్ పూర్తిగా పర్యావరణహితంగా అత్యంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దాచేపల్లి యూనిట్ నిర్మించినట్టు నీరజ్ తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమయ్యే ఇంధన వినియోగంలో 30 శాతం మునిసిపల్ వ్యర్థాలు, బయోమాస్‌తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించి 30 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్న తొలి సిమెంట్ యూనిట్‌గా దాచేపల్లి రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా సున్నపురాయి తవ్వకాన్ని కూడా ప్రయోగాత్మకంగా చేపట్టడం ద్వారా ఇంధన పొదుపు చేస్తున్నట్టు తెలిపారు. భూ మట్టానికి 40 అడుగుల దిగువన సున్నపురాయి క్రషింగ్‌ను చేపట్టడం ద్వారా డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించగలిగినట్టు వివరించారు. భారీగా విస్తరణ భంగర్బ్రాండ్ పేరుతో శ్రీ సిమెంట్ భారీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మరో 13 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఏడాదికి 56.4 మిలియన్ టన్నులుగా ఉన్న సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 2028 నాటికి 80 మిలియన్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2025 నాటికి మరో 5 యూనిట్లను వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రజతం నెగ్గిన భారత రెజ్లర్ రూపిన్.. తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు
కజకిస్తాన్‌లో జరుగుతున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రూపిన్ (55 కేజీలు) రజతం... నీరజ్ (63 కేజీలు), సునీల్ (87 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్లో రూపిన్ 1–3తో సౌలత్ (ఇరాన్) చేతిలో ఓడిపోగా... నీరజ్ 5–2తో జిన్‌సెయుబ్ సాంగ్ (దక్షిణ కొరియా)పై, సునీల్ 4–1తో మసాటో సుమి (జపాన్)పై గెలిచారు. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. ఎవరికీ సాధ్యం కాలేదు! వీడియో వైరల్ -
బేగంబజార్ పరువు హత్య: సంజన తల్లి ముందుగానే హెచ్చరించినా..
హైదరాబాద్: నగరంలోని బేగం బజార్లో.. పరువు హత్యకు గురైన నీరజ్ పర్వాన్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు అంశాలు వెలుగు చూశాయి. సంజన తల్లి నీరజ్-సంజనలను ముందుగానే హెచ్చరించినా.. వాళ్లు వినకపోవడం, తదనంతర పరిణామాలు సంజన బంధువుల్లో నీరజ్ పట్ల మరింత విద్వేషాన్ని రగిల్చిందని తెలుస్తోంది. కులాంతర వివాహం కావడంతో పరువు పోయి ఆ అవమానభారంతోనే నీరజ్‌ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పెళ్లి, ఆ తర్వాత బాబు పుట్టినతర్వాత యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిందితులు తెలిపారు. ఈ ఘటన తర్వాత యాదవ్ సమాజ్‌లోని కార్యక్రమాలకు సైతం సంజన కుటుంబీకులను పిలవకపోవడంతో ఆ కుటుంబం రగిలిపోయిందట. పైగా తమ కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో.. ఎక్కడికి వెళ్లినా అవమానపడ్డ సంజన కుటుంబ సభ్యులు. వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌లో సంజనకు, మరో అబ్బాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే అంతుకు ముందే ఇంట్లోంచి వెళ్లిపోయిన సంజన, నీరజ్‌ను షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో.. బాబు పుట్టాక తన తల్లితో సంజన మాట్లాడింది. ఆ సమయంలో.. ఎట్టిపరిస్థితుల్లో బేగం బజార్‌కు రావొద్దని సంజన తల్లి ఆ జంటను హెచ్చరించినట్లు రిపోర్ట్‌లో ఉంది. అయితే ఆమె హెచ్చరికలను లెక్క చేయని ఆ జంట.. బేగం బజార్లోనే ఉంది. దీంతో ఎలాగైనా నీరజ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు నిందితులు. గురువారం జుమేరాత్ బజార్లో కత్తులు, రాడ్లు కొన్నారు. ఘటనకు ముందు పీకలదాకా మద్యం సేవించారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఓ బాలుడితో రెక్కీ చేశారు. ఆ సమయంలో తాతతో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్ కంట్లో కారం చల్లి.. కత్తులతో దాడి చేసి హతమార్చారు. చదవండి: నా అత్తమామలకు కూడా ప్రాణహాని ఉంది-నీరజ్ భార్య -
నీరజ్‌ను చంపినవాళ్లను అరెస్ట్ చేశాం: డీసీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్: సరూర్ నగర్ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు నగర వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు. తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్ బంటీపై హత్యకు స్కెచ్ గీశారు. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్. నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. -
పెళ్లైనప్పటి నుంచి మాటలు లేవు.. నా భర్తను చంపింది వాళ్లే: నీరజ్ భార్య
సాక్షి, హైదరాబాద్: తన భార్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. కాగా బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్ పన్వార్ (21) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో నలుగురు దుండగులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాతతో కలిసి నీరజ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చేపల మార్కెట్ సమీపంలో మాటేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేసి.. కత్తులతో పొడిచి చంపారు. వేరే కులానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నందుకే యువతి కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్యను మరువక ముందే చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది ఈ ఘటనపై నీరజ్ భార్య స్పందిస్తూ.. వివాహం అయినప్పటి నుంచీ వారి నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని చెప్పారు. తన కజిన్ విజయ్, సంజులే ఈ హత్య చేశారని, మరో ముగ్గురుతో కలిసి ఈ దారుణానికి తెగబడ్డారని తెలిపింది. వారి నుంచి తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నీరజ్‌తో పెళ్లి అయినప్పటి నుంచి వారితో సంబంధాలు లేవని తెలిపింది. ‘నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయింది అని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది’ అంటూ సంజన వాపోయింది. ఇక వ్యాపారి నీరజ్ పన్వార్ హత్యను నిరసిస్తూ బేగంబజార్ వ్యాపారులు మార్కెట్ బంద్ పాటిస్తున్నారు. నీరజ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారవేత్తలందరూ ఈ హత్యను ఖండిస్తున్నామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు వేగంగా స్పందించిన నిందితులను అరెస్ట్ చేయడంపై కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారులు వారికి త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెబుతున్నారు. తన కుమారుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడు నీరజ్ పన్వార్ తండ్రి జగదీష్ ప్రసాద్ పన్వార్ డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం , కమిషనర్ ఆఫ్ పోలీస్ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చదవండి: పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే.. -
తొలిరోజు భారత్‌కు మూడు కాంస్యాలు
Asia Senior Wrestling Championship- ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కాంస్య పతక బౌట్లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
యూపీలో ఆర్ఎల్డీ, కాంగ్రెస్ అభ్యర్థులపై దేశద్రోహం కేసులు
బిజ్నోర్, వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అభ్యర్థి నీరజ్ చౌదరిపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆయన బిజ్నోర్ స్థానం నుంచి బరిలోకి దిగారు. కొన్ని రోజుల క్రితం నీరజ్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఆయన వెంట ఉన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని పోలీసులు శనివారం చెప్పారు. శత్రుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసినందుకు గాను నీరజ్ చౌదరితోపాటు మరో 20–25 మందిపై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 295ఏతో పాటు పలు సెక్షన్ల కింద గురువారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంటువ్యాధుల చట్టం కింద కూడా కేసు పెట్టామన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. సంబంధిత ఆడియో, వీడియో క్లిప్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తామని అన్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం పట్ల ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకీఫ్ భాయ్ జిందాబాద్ అని నినదించినా కొందరికి పాకిస్తాన్ జిందాబాద్ అన్నట్లుగా వినిపిస్తోందని శనివారం ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. తప్పుడు వీడియోలు సృష్టించి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యుడు, పెద్దమనిషి అయిన నీరజ్ చౌదరిని ద్రోహిగా చిత్రీకరిస్తుండడం దారుణమని జయంత్ చౌదరి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై...: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ప్రసంగించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్‌పై పోలీసులు శనివారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన జనవరి 31న రాజేతరా గ్రామంలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు అజయ్ రాయ్‌పై ఐపీసీ సెక్షన్లు 124ఏ, 269, 153, 153ఏ, 188 కింద కేసు పెట్టారు. -
సరైన పనే చేశా: బిష్ణోయ్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి బుల్లి బాయ్ యాప్‌లో వేలానికి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ తన పనిని సమర్థించుకున్నాడు. ముస్లిం మహిళల్ని వేధించడం కరెక్టేనని విచారణలో చెబుతున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. బుల్లి బాయ్ యాప్‌ను రూపొందించడానికి వినియోగించిన పరికరాలన్నీ నీరజ్ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యాప్‌ని నీరజ్ నవంబర్‌లో రూపొందించాడని డిసెంబర్ 31న ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక నీరజ్ ముస్లిం మహిళలనే కాకుండా ముంబై పోలీసుల్ని హేళన చేయడానికి ట్విట్టర్లో పలు ఖాతాలను సృష్టించాడు. ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వాటిని అమ్మలేదని, నీరజ్ అసలు ఉద్దేశ్యం వారిని కించపరచి వేధించడమేనని పోలీసులు చెబుతున్నారు. భోపాల్‌లో వెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతనిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా యాజమాన్యం తెలిపింది. -
‘బుల్లి బాయ్’ సృష్టికర్త అరెస్ట్
న్యూఢిల్లీ: ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ యాప్ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయ్ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం అస్సాంలోని నీరజ్ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి. పోలీసులు జరిపిన విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోబీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గిట్‌హబ్ ప్లాట్‌ఫారమ్‌లో బుల్లి బాయ్ యాప్ తయారు చేసి దానికి సంబంధించిన ప్రధాన ట్విట్టర్ అకౌంట్ అతనే నడుపుతున్నాడని ఐఎఫ్‌ఎస్‌ఒ డిప్యూటీ కమిషనర్ కేపీఎస్ మల్హోత్రా మీడియాకి చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్స్ (ఐపీడీఆర్), ఇతర గేట్ వేల సహాయంతో అతని జాడని కనిపెట్టామని చెప్పారు. నీరజ్ ల్యాప్‌టాప్‌లో కూడా ఈ యాప్‌ని తయారు చేసినట్టుగా ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయని తెలిపారు. -
నీరజ్ అనంతాని అరుదైన రికార్డు
వాషింగ్టన్: సెనేట్‌లోనూ హోరాహోరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అనంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మార్క్ ఫోగెల్‌పై విజయం సాధించారు. విజేతగా నిలిచిన తరువాత నీరజ్ మాట్లాడుతూ కేవలం 70 ఏళ్ల క్రితం మాత్రమే స్వాతంత్య్రం సాధించిన భారత్‌లో తన పూర్వీకులు బ్రిటిష్ ఏలుబడిలో జీవించారని, అటువంటి కుటుంబానికి చెందిన తాను సెనేటర్‌గా ఎన్నిక కావడం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనమని వ్యాఖ్యానించారు. భారతీయ సంతతి సమూహం తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ( సెనేట్‌లోనూ హోరాహోరీ ) సెనేటర్‌గా గెలిపించిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలిపిన నీరజ్ వారి తరఫున స్టేట్‌హౌస్‌లో గళం వినిపిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్ హౌస్‌కు ఎన్నికైఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. ‘‘స్టేట్ సెనేటర్‌గా ఓహాయో వాసులందరూ తమ అమెరికన్ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తా’’అని నీరజ్ హామీ ఇచ్చారు. నీరజ్ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు. -
పిల్లలు చేసే విచిత్రం
సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్ ముఖ్య తారలుగా జై రామ్‌కుమార్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మించిన ‘అంతా విచిత్రమ్’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జి.శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు భోలే షావలి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అస్లాం మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథాంశంతో రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎం. అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫ్యాన్స్ అయిన కొందరు చిన్నారుల కథాంశమే ఈ చిత్రం’’ అన్నారు రామ్ కుమార్. చిన్నపిల్లలతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులుగా పాల్గొన్న రామ సత్యనారాయణ, సాయి వెంకట్, అనంతరాముడు ఆకాంక్షించారు. -
మైండ్ గేమ్
‘సర్! మా నాన్నగారిది సహజ మరణం కాదు. హత్యేనని నేను కచ్చితంగా చెప్పగలను’ ఇన్స్పెక్టర్ కుమార్‌కు చేతులు జోడించి చెప్పాడు ప్రణీత్. ‘ఏమిటి ప్రణీత్ బాబూ మీరనేది? నీరజ్‌గారు గుండెపోటుతో పోయారని డాక్టర్లు చెబుతుంటే’ ముసలి జావేద్ తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. సీఐ కుమార్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్న పనివాడు యాభయ్యేళ్ల కోటయ్య వంక చూశాడు. ‘కోటయ్యా! నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు కదా... ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. కోటయ్య గొంతు సవరించుకున్నాడు. చెస్ చాంపియన్ల ఖిల్లాగా ఆ పట్టణానికి పేరుంది. ఐదారేళ్ల నుంచి వరుసగా ఆ పట్టణవాసులే రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్ గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుత చాంపియన్ నీరజ్, మాజీ చాంపియన్ సరోజ్ ఆ పట్టణవాసులే. ప్రస్తుత చాంపియన్ నీరజ్ తండ్రి కూడా చదరంగ ప్రవీణుడే. తాతలనాటి పురాతన భవంతిలోనే నీరజ్ నివసిస్తూ ఉంటాడు. చదరంగమే లోకంగా ఉంటూ ఉద్యోగమేమీ చేయకపోవడంతో అతనికి పెద్దగా ఆదాయం లేదు. నీరజ్‌కు, మరికొందరికీ చిన్ననాటి నుంచి చదరంగం తర్ఫీదు ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దిన జావేద్ ముసలివాడయ్యాడు. కంటిచూపు మందగించినా, ఆటపై మక్కువ చంపుకోలేక రోజూ చదరంగం ఆడటానికి తన శిష్యుడు నీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మాజీ చాంపియన్ సరోజ్, మరికొందరు కూడా నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వస్తూ ఉంటారు. నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వచ్చేవారిలో మదన్, మోహిని ముఖ్యులు. మదన్‌ది జమీందార్ల వంశం. డబ్బుకు, అతిశయానికీ లోటు తక్కువేం లేదు. రాష్ట్రస్థాయిలో అతను చదరంగంలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ పోటీలోనూ విజేతగా నిలవలేదు. మోహిని రాష్ట్రస్థాయి మహిళా చదరంగ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఆ పోటీలో గెలవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నీరజ్ చదరంగం ఆడటం తగ్గించాడు. రాత్రి ఎనిమిదిన్నరకు పాములు, తేళ్ల భయంతో ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసి నిద్రిస్తాడు. నీరజ్ భార్య గత ఏడాది మరణించింది. కొడుకు ప్రణీత్ ఆ ఊళ్లోనే బీ టెక్ చదువుతున్నాడు. పనివాడు కోటయ్య వంటచేసి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లిపోతుంటాడు. ‘నిన్న సాయంత్రం ఐదు గంటలకు సరోజ్గారు ఇంటికి వచ్చారు. ప్రణీత్ ఇంట్లో లేడు. నీరజ్‌గారి గదిలోకి వెళ్లి సరోజ్ గారు చదరంగం ఆడారు. అప్పుడు అయ్యగారు ఉల్లాసంగానే కనిపించారు’ అన్నాడు కోటయ్య. ‘నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. ఏడు నిమిషాల్లోనే నీరజ్‌పై గెలిచాను. ఆ శుభవార్త బయటనే వెయిట్ చేస్తూ ఉన్న మోహినికి చెప్పి ఆనందంగా వెళ్లిపోయాను’ అన్నాడు సరోజ్. ఇన్స్పెక్టర్ కుమార్ మోహిని వంక చూశాడు. ‘ఔను! సరోజ్ ముఖం గెలుపు ఆనందంతో మతాబాలాగా వెలుగుతోందప్పుడు. నా కాన్ఫిడెన్స్ కొద్దీ బ్లైండ్ఫోల్డ్గా ఆడతానని నిన్ననే నీరజ్గారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకున్నా. కళ్లకు గంతలు కట్టుకుని ఆయనతో చదరంగం ఆడాను’ చెప్పింది మోహిని. ‘మరి గెలిచారా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ గెలిచినంత పని చేశా. నన్ను నిలువరించడానికి నీరజ్‌గారు ఇరవై నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. చివరికెలాగో నన్ను ఓడించారు’ చెప్పింది మోహిని. ‘సాయంత్రం ఐదు నలభైకి నీరజ్‌గారు ఎందుకో గట్టిగా కేక పెట్టారు. బయట తోటలో ఉన్న నేను పరుగున ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు సార్ మదన్గారితో గేమ్ ఆడుతున్నారు. ఏదో వస్తువు కిందపడ్డట్లు అనిపించింది’ అన్నాడు కోటయ్య. ‘టేబుల్ మీద ఉన్న నా లెదర్ బ్యాగ్ కింద పడిందంతే. కోటయ్యను కాఫీ తీసుకు రమ్మని చెప్పారు నీరజ్ గారు. ఎందుకో ఆయన భయపడినట్లు అనిపించింది’ చెప్పాడు మదన్. ‘మరి ఆట ముగిశాక మీరు వెళ్లిపోయారా?’ ‘లేదు. ఎందుకో నీరజ్‌గారు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయన పక్కనే ఉన్న చెయిర్లో కూర్చున్నాను. ఇంతలో జావేద్‌గారు లోనికి వచ్చారు’ అన్నాడు మదన్. ‘నేను గదిలోకి వచ్చేసరికి బెడ్‌లైట్ వెలుగుతోంది. ఆట మొదలెడదామా అని నేను అడిగే సరికి సరేనన్నాడు నీరజ్. మదన్‌గారు పక్కనే కుర్చీలో ఉన్నారు. కోటయ్య వచ్చి మా ముగ్గురికీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఐదు నిమిషాల్లోనే నేను గెలిచాను. ఆ ఆనందంతో నీరజ్‌తో కరచాలనం చేసి వెళ్లిపోయాను’ చెప్పాడు జావేద్. ‘ఆ తర్వాత మదన్‌గారు వెళ్లిపోయారు. నేను గదిలోకి వెళ్లి చూసే సరికి మూడు కప్పుల్లో కాఫీ అలాగే ఉంది. కప్పులు తీసుకుని వెళ్లిపోయాను. పది నిమిషాల తర్వాత ఏదో అనుమానం వచ్చి నీరజ్‌గారి గదిలోకి వెళ్లి పిలిస్తే పలకలేదు. శరీరంలో చలనం లేదు. భయంతో డాక్టర్గారికి, ప్రణీత్‌కు ఫోన్ చేశాను’ అన్నాడు కోటయ్య. ఇన్స్పెక్టర్ కుమార్‌కు మరుసటి రోజు ఏదో అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ప్రణీత్. చదరంగంలో రాష్ట్ర చాంపియన్‌గా నీరజ్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్‌తో వచ్చి దర్యాప్తు చేశాడు కుమార్. డాక్టర్తోను, ముందురోజు నీరజ్‌తో చదరంగం ఆడిన నలుగురితోనూ మాట్లాడాడు. ‘నాకు అర్జెంట్‌గా విజయవాడలో పని ఉంది. నేను వెళ్లి సాయంత్రం నాలుగింటికి తిరిగొస్తాను’ అన్నాడు మదన్. మిగిలిన ముగ్గురూ కూడా తమకేదో పని ఉందంటూ చెప్పారు. ఇన్స్పెక్టర్ కుమార్ ప్రణీత్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. సరే, మీరందరూ మీ మీ పనులు చూసుకొని రండి. సాయంత్రం ఐదింటికి మళ్లీ మనం ఇక్కడే కలుద్దాం. నీరజ్‌ది సహజ మరణమే అనిపిస్తోంది’ అన్నాడు. నలుగురూ బయటకు వెళ్లిపోయారు. కుమార్ తనతో వచ్చిన కానిస్టేబుల్స్‌కు పనులు పురమాయించాడు. ‘మిస్టర్ మదన్! మీరు నీరజ్ మరణానికి కారకులయ్యారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అన్నాడు కుమార్. మదన్ ముఖం కళ తప్పింది. ‘సార్! ఇది అన్యాయం. నీరజ్‌గారు గుండెపోటుతో మరణించారని డాక్టర్లే చెప్పారు’అన్నాడు ఆవేశంగా. ‘కావచ్చు. కానీ గుండెపోటు వచ్చేలా చేసింది నువ్వే’ అన్నాడు కుమార్. ‘ఇది చాలా అన్యాయం సార్’ దీనంగా అన్నాడు మదన్. ‘నిన్ను అరెస్టు చేయడానికి ఈ రుజువు చాలు’ అని కుమార్ ఒక చిన్న టేప్‌రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అందులో మదన్, నీరజ్‌ల సంభాషణ ఉంది. ‘ఆ రోజు సాయంత్రం నీరజ్ ఎప్పటిలాగానే చదరంగం ఆడటానికి తన గదిలో కూర్చున్నాడు. ముందు వచ్చిన సరోజ్ బాగా ఆడి గెలిచి సంతోషంగా వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన మోహిని కళ్లకు రిబ్బన్ కట్టుకుని బ్లైండ్‌ఫోల్డ్ గేమ్ ఆడింది. ఆమెకు తెలియడం కోసం నీరజ్ ఆమె, తాను వేసే ప్రతి ఎత్తునూ గట్టిగా బయటకు చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆట తర్వాత వివాదాలు రాకుండా రికార్డు ఆన్ చేయడం ఆయనకు అలవాటు. మోహినితో ఆట పూర్తయ్యాక టేప్ రికార్డర్ ఆఫ్ చేయడం మరచి, అలాగే ఉంచేశాడు నీరజ్.తర్వాత వచ్చిన మదన్‌కు రాష్ట్ర చాంపియన్ కావాలని తగని కోరిక ఉంది. ఎలాగైనా నీరజ్‌ను అంతమొందిస్తే సరోజ్‌ను డబ్బుతో కొనవచ్చని, అలా ఇద్దరు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవచ్చని పథకం వేశాడు. నీరజ్ గుండెజబ్బు మనిషని మదన్‌కు తెలుసు. అందుకే సరోజ్‌తో ఘోరంగా ఓడావని, మోహిని బ్లైండ్‌ఫోల్డ్ ఆడినా ఓడినంత పనైందని నీరజ్‌ను రెచ్చగొట్టాడు. తర్వాత తనతో తెచ్చిన బొమ్మ పామును జేబులోంచి తీసి నీరజ్ కాలిపై వేసి ‘పాము... పాము’ అని చిన్నగా అరిచాడు. దాంతో షాక్ తిన్న నీరజ్ గుండెపోటుకు గురై మరణించాడు. అదంతా టేప్రికార్డర్లో రికార్డయింది. మదన్ ఇల్లు శోధిస్తే ఆ బొమ్మ పాము దొరికింది. పథకం ప్రకారం మదన్ నీరజ్ శవాన్ని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను నీరజ్ కుర్చీలో కూర్చున్నాడు. మదన్‌కు మిమిక్రీ వచ్చు. ట్యూబ్‌లైట్ ఆఫ్ చేసి, గదిలో బెడ్‌లైట్ వేశాడు. గదిలోకి వచ్చిన కోటయ్యకు కాఫీ తెమ్మని నీరజ్ గొంతుతో చెప్పాడు. తర్వాత జావేద్ వచ్చాడు. కంటిచూపు బాగులేని జావేద్ బెడ్‌లైట్ వెలుతురులో మదన్నే నీరజ్ అనుకున్నాడు. జావేద్‌తో ఆట ఓడిపోయి, నీరజ్ గొంతుతో అతన్ని అభినందించాడు. జావేద్ వెళ్లగానే నీరజ్‌ను అతని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు మదన్.’ అని ముగించాడు కుమార్. మదన్ తలదించుకుని పోలీసులకు లొంగిపోయాడు. -
జీఎస్టీ ఎగవేతలపై ఇక ముమ్మర చర్యలు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్‌లు తదితర అంశాలను చూసేందుకు జీఎస్టీ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్‌గా నీరజ్ ప్రసాద్ నియమితులయ్యారు. వ్యాపారులు కొత్త పన్ను చట్టానికి మళ్లేందుకు, అలవాటు పడేందుకు కొంత కాలం చూసీ, చూడనట్టు వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది దాటిపోవడం, పన్ను వసూళ్లల్లో ఏమంత వృద్ధి లేకపోవడంతో... ఎగవేతలను గుర్తించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జీఎస్టీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటయిందని... విధాన, న్యాయపరమైన అంశాలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్ట్‌లు, విచారణ, ఎక్సైజ్ చట్టం, సేవా పన్నుకు సంబంధించిన అంశాలను కమిషనర్ చూస్తారని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది. -
భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ సింఘాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఎస్ఎఫ్ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) అరెస్ట్ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. భూషణ్ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి గాను పొందిన రూ.2,000 కోట్ల విషయంలో సింఘాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఆర్థికశాఖ పేర్కొంటోంది. బ్యాంకులు దివాలా ప్రక్రియను ప్రారంభించిన 12 బడా కేసుల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఎన్సీఎల్టీ ముందు చేరిన ఈ కంపెనీని ఇటీవలే టాటా స్టీల్ బిడ్ వేసి దక్కించుకుంది. -
చిట్టీలుంటే.. రుణాలిస్తాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యక్తిగత అవసరం కావొచ్చు.. సంస్థ కోసం కావచ్చు.. ప్రతి నెలా చిట్టీలు వేయటం మనకు తెలిసిందే. అవసరానికి డబ్బులొస్తాయనో లేక పొదుపు చేస్తే వడ్డీ కలిసొస్తుందనో చిట్ఫండ్లలో సభ్యులుగా చేరతాం. మరి, నెలనెలా మీరు వేసే చిట్టీలే మీకు రుణాన్నిస్తే? చిట్టీ కాలం ముగిసే లోపు నెల వాయిదాతో పాటూ అసలూ తీరిపోతే? ఇదే వ్యాపారసూత్రంగా ఎంచుకుంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ క్రెడ్‌రైట్. దేశంలోని చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సభ్యులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.35 లక్షల వరకూ రుణాన్నిస్తోంది. మరిన్ని వివరాలను క్రెడ్‌రైట్ కో–ఫౌండర్ నీరజ్ భన్సాల్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్‌ఫండ్స్ జనరల్ సెక్రటరీ టీఎస్ శివరామకృష్ణన్‌తో కలిసి 2014లో రూ.1.5 కోట్ల పెట్టుబడితో క్రెడ్‌రైట్‌ను ప్రారంభించాం. అమెరికాలోని రొటేటింగ్ సేవింగ్స్ అండ్ క్రెడిట్ అసోసియేషన్ (రోస్కా) తరహాలోనే చిట్‌ఫండ్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), కిరాణా షాపులు, ఇతరత్రా వ్యాపారస్తులకు డేటా ఆధారిత రుణాన్నివ్వటమే మా ప్రత్యేకత. చిట్ విలువలో 80% రుణం.. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన బలుస్సెరీ, చెన్నైకి చెందిన మాయావరం, బెంగళూరుకు చెందిన ఇందిరానగర్, హైదరాబాద్‌కు చెందిన సప్తవందన చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. వీటికి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రోల్లో వందల బ్రాంచీలున్నాయి. లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణాలిస్తాం. చిట్ విలువలో 80 శాతం వరకూ రుణం వస్తుంది. ప్రతి నెలా కేవలం వడ్డీ మాత్రమే ఉంటుంది. చిట్ పాడుకున్నపుడు అసలును కట్టాల్సి ఉంటుంది. ఏడాదికి 18% వడ్డీ ఉంటుంది. రూ.10 కోట్ల రుణాల మంజూరు.. పేరు, చిరునామా, చిట్‌ఫండ్ వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యాక.. 24 గంటల్లో రుణం మంజూరు చేస్తాం. ఇప్పటివరకు 150 మంది చిట్‌ఫండ్ దారులకు రూ.10 కోట్ల రుణా లిచ్చాం. రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నవాళ్లు 35% ఉంటారు. ఈ ఏడాది ముగిసేలోగా రూ.100 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యించాం. రుణగ్రహీత నుంచి రుణంలో 1–2% ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 2 నెలల్లో కేరళ, ఏపీలకు విస్తరణ.. ప్రస్తుతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో సేవలందిస్తున్నాం. మా మొత్తం ఆదాయంలో తెలంగాణ వాటా 15 శాతం. కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 శాతం. రెండు నెలల్లో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవలను ప్రారంభిస్తున్నాం. ఆయా రాష్ట్రాల్లో 5 చిట్‌ఫండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నాం. మార్గదర్శి, కపిల్ చిట్ఫండ్లతో చర్చిస్తున్నాం. ఈ ఏడాది ముగింపులోగా ఒప్పందం పూర్తవుతుంది. రూ.9 కోట్ల నిధుల సమీకరణ..: 2017–18లో రూ. కోటి ఆదాయాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.10 కోట్లకు చేరాన్నది లక్ష్యం. ‘‘ప్రస్తుతం కంపెనీలో ఏడుగురు ఉద్యోగులున్నారు. త్వరలోనే దీన్ని 30కి చేర్చనున్నాం. ఇటీవలే యువర్నెస్ట్, ఆసియాన్ వెంచర్‌ల్యాబ్స్ ద్వారా రూ.9 కోట్లు సమీకరించాం’’ అని నీరజ్ వివరించారు. -
నలుగురి నేరగాళ్ల కథ
‘‘రెగ్యులర్ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్ వైపు చూడటం లేదు. తెలుగు ప్రేక్షకుల్లో చాలా మార్పొచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘ఐతే 2.0’ మంచి సినిమా అవుతుంది’’ అని డైరెక్టర్ నందినీరెడ్డి అన్నారు. ఇంద్రనీల్ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి ముఖ్య తారలుగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్ 9 పతాకంపై కె.విజయరామరాజు, హేమంత్ వల్లపురెడ్డి నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, నందినీరెడ్డి విడుదల చేశారు. రాజ్ మాదిరాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి నిరుద్యోగంతో ఉన్న నలుగురు యువకులు ఆకలి, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు? అన్నదే కథ. నేటి టెక్నాలజీ, సోషల్ మీడియా, హ్యాకింగ్ వంటి అంశాలను కీలకంగా చూపించాం’’ అన్నారు. ‘‘త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేస్తాం. మార్చి 16న తెలుగు, హిందీలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయరామరాజు, హేమంత్. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్ అభిమన్యు, సంగీతం: అరుణ్ చిలువేరు. -
2 నిమిషాల్లో బైక్ సర్వీసింగ్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేటి యువత తిండి, నిద్ర లేకపోయినా ఉండగలరేమో గానీ, చేతిలో మొబైల్, తిరగడానికి బైక్ లేనిదే ఉండలేరు. లాంగ్ రైడ్ అనో, ఫ్రెండ్స్‌తో షికారనో, వీకెండ్స్ రైడ్ అనో బైక్‌ను రయ్మనిపించేందుకు బోలెడన్ని సందర్భాలు. కానీ, అదే బైక్ సర్వీసింగ్ అంటే!! టైమ్ వేస్ట్ అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. పైగా పర్సుకు భారం కూడానూ! కానీ, రెండంటే రెండు నిమిషాల్లో బైక్ సర్వీసింగ్, అది కూడా జస్ట్ రూ.40కే అంటోంది ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్(ఈబీడబ్ల్యూ)! వాషింగే కాదు.. మైనర్ రిపేర్లు, ఆన్ రోడ్ అసిస్టెన్స్ సేవలనూ అందిస్తామంటోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫండ్ మేనేజర్, టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్ నుంచి నిధులను పొందిన ఈబీడబ్ల్యూ ప్రణాళికలను సంస్థ కో–ఫౌండర్ నీరజ్ టక్సండే ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్నతనం నుంచే బైకులంటే ఇష్టం వల్ల కావొచ్చు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసినా బైక్ రైడింగే నన్ను భూషణ్ కర్న్, జీగర్ వోరాలతో కలిపింది. లాంగ్ రైడింగ్ వెళ్లినప్పుడల్లా మాకెదురయ్యే ప్రధాన సమస్య సర్వీసింగ్. దీనికి పరిష్కారం వెతికే పనిలోనే ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్ కంపెనీకి బీజం పడింది. రూ.9 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా 2013 జూన్‌లో ఎక్స్‌ప్రెస్ బైక్ వర్క్స్‌ను ప్రారంభించాం. 2 నిమిషాల్లో, రూ.40కి, అది కూడా జస్ట్ 10 లీటర్ల నీటితో బైక్ సర్వీసింగ్ మా ప్రత్యేకత. ప్రతి పెట్రోల్ బంకులో ఈబీడబ్ల్యూ లక్ష్యం.. మన దేశంతో పాటూ ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, రువాండ, కొలంబియా దేశాల్లోనూ ఈబీడబ్ల్యూ కేంద్రాలున్నాయి. దేశంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, నాసిక్, బెంగళూరు, ధన్‌బాద్, కోయంబత్తూర్, హుబ్లీ నగరాల్లో 32 ఈబీడబ్ల్యూ స్టోర్లున్నాయి. త్వరలోనే కొచ్చిన్, వెస్ట్ ముంబై, భువనేశ్వర్, నాగ్‌పూర్, సూరత్, విజయవాడ, మైసూర్‌లలో ఫ్రాంచైజీ స్టోర్లను ఏర్పాటు చేయనున్నాం. ఏడాది ముగింపు నాటికి 100 ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. పెట్రోల్ బంకుల్లో ఈబీడబ్ల్యూ కేంద్రాల ఏర్పాటు కోసం ఇండియన్ ఆయిల్(ఐఓసీ), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)తో ఒప్పందం చేసుకున్నాం. ముంబైలోని పలు బంకుల్లో స్టోర్లను ఏర్పాటు చేశాం. దేశంలో ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌కు ఉన్న 52 వేల పెట్రోల్ బంకుల్లోనూ ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. వాషింగ్‌కు 10 లీటర్ల నీళ్లు..: సాధారణంగా బైక్ వాషింగ్‌కు 50–60 లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. ఈబీడబ్ల్యూలో కేవలం 10 లీటర్లే. అందులోనూ 90% నీటిని పునఃవినియోగానికి వీలుగా శుద్ధి చేస్తాం. ఇదే మా ప్రత్యేకత. ఇప్పటివరకు 2.50 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను సర్వీసింగ్ చేశాం. ప్రస్తుతం రోజుకు ఒక్కో స్టోర్ నుంచి 1,500–1,800 బైకులను సర్వీసింగ్ చేస్తున్నాం. రూ.12 లక్షలకు ఫ్రాంచైజీ..: ముంబైలో 2,500 చ.అ.ల్లో ఈబీడబ్ల్యూ తయారీ ప్లాంట్ ఉంది. నెలకు 13 ఆటోమెటిక్ బైక్ వాషింగ్ మిషన్లను తయారు చేస్తుంటాం. ధర రూ.8.5 లక్షలు. ఈబీడబ్ల్యూ మిషన్లను హీరో మోటో కార్ప్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చర్ (ఓఈఎం) పరీక్షలు నిర్వహించి అనుమతినిచ్చాకే మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఫ్రాంచైజీ రూపంలో ఈబీడబ్ల్యూ సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు రూ.12 లక్షల పెట్టుబడి అవసరం. మిషన్, నిర్వహన, శిక్షణ, మార్కెటింగ్ వంటి వాటికి ఏడాదికి 5% రాయల్టీని తీసుకుంటాం. 6 నెలల్లో 4–5 మిలియన్ డాలర్లు.. ప్రస్తుతం మా సంస్థలో 45 మంది ఉద్యోగులున్నారు. నెలకు 150% వృద్ధి రేటును నమోదు చేస్తున్నాం. 6 నెలల్లో 4–5 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయించాం. ‘‘2015లో ప్రముఖ అంతర్జాతీయ ఫండ్ మేనేజర్, టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్, మదర్సన్ సుమీ గ్రూప్ వామన్ సెహగల్, హీరో ఫిన్‌కార్ప్ అభిమన్యు ముంజల్, కార్నేషన్ ఆటో ఇండియా కనల్ కట్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను సమీకరించాం. ప్రస్తుతం వీళ్లు లాభాలను స్వీకరించి కంపెనీ నుంచి తప్పుకున్నారు’’ అని నీరజ్ వివరించారు. -
భారత్ ఆశాకిరణం నీరజ్
నేటి నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లండన్: అంతర్జాతీయస్థాయిలో మరో క్రీడా పండగకు రంగం సిద్ధమైంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈనెల 13 వరకు జరిగే ఈ పోటీలకు ఒలింపిక్ స్టేడియం వేదికగా నిలువనుంది. భారత్ తరఫున 25 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 34 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో భారత్‌కు ఒక్కటంటే ఒక్కటే పతకం వచ్చింది. అదీ కాంస్యమే. 2003 పారిస్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల లాంగ్‌జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జ్ మూడో స్థానంలో నిలిచి భారత్‌కు ఏకైక కాంస్య పతకాన్ని అందించింది. ఆ తర్వాత పలుమార్లు భారత అథ్లెట్లు రిక్తహస్తాలతో తిరిగొచ్చారు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రాపై భారత్‌కు ఆశలున్నాయి. గతేడాది ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ 86.48 మీటర్లతో ఈ విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ పసిడి పతకాన్ని సాధించాడు. దాంతో నీరజ్ చోప్రాపై అంచనాలు పెరిగాయి. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో ఆగస్టు 10న క్వాలిఫయింగ్... 12న ఫైనల్ జరుగుతాయి. మొత్తం 33 మంది బరిలో ఉండగా... 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచం దృష్టి బోల్ట్‌పైనే.. లండన్‌లోని ఒలింపిక్ స్టేడియంలో శుక్రవారం మొదలయ్యే ఈ పోటీల్లోనే బోల్ట్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈసారి బోల్ట్ రెండు ఈవెంట్స్‌లలో (100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల రిలే) బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 5న 100 మీటర్ల ఫైనల్... ఆగస్టు 12న 4్ఠ100 మీటర్ల రిలే ఫైనల్ జరగనున్నాయి. రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించి కెరీర్‌కు అద్భుతమైన ముగింపు ఇవ్వాలని బోల్ట్ పట్టుదలతో ఉన్నాడు. -
సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్ థాంక్స్
ముంబై: తన తాజా చిత్రం 'నీర్జా' సూపర్ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది సోనం కపూర్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ బాలీవుడ్ అమ్మడు. తొలిసారి తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ చూపించడమే కాదు.. తన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌ను కూడా ఈ భామ సొంతం చేసుకుంది. 1986లో కరాచీలో హైజాక్ అయిన పాన్ ఆమ్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ చూపిన తెగువ, చేసిన త్యాగం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించింది. దీంతో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు హీరోయిన్ సోనం కపూర్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సర్‌కు కృతజ్ఞతలు. ఎంతో ఆనందంగా ఉంది' అని సోనం ట్వీట్ చేసింది. -
కుటుంబాన్ని చంపి తాను ఉరేసుకుని..
పాంచ్కుల: రాఖీ పౌర్ణమి మరొక్క రోజులో ఉందనగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంటి యజమాని తన భార్యను, ముగ్గురు కూతుళ్లను హత్య చేసి.. ఆపై తానూ ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ చుట్టుపక్కల విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీలోని ఉన్నావో జిల్లాలో నీరజ్ అనే 30 ఏళ్ల వ్యక్తి ముందుగా తన భార్య రాజ్ కుమారిని (27) గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం తన ముగ్గురు కూతుళ్లు నవిత(5), శివాని(2), అనన్య(7 నెలలు)లను కూడా గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కుటుంబంలో మనస్ఫర్ధలే ఈ ఘటనకు దారి తీసి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. -
కుతుబ్‌మినార్ కాల్పుల ఘటనలో మరో ఇద్దరు అరెస్టు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని కుతుబ్‌మినార్ సమీపంలో ఓ 24 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన కేసులో మరో ఇద్దరిని ఉత్తరప్రదేశ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మార్చి 9న తన స్నేహితుడు సందీప్‌తో కలిసి కియోస్క్ వద్ద టీ తాగుతుండగా కొందరు దొండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించగా, సందీప్ గాయాలపాలయ్యాడు. వివరాలు.. సోను సెజ్వాల్(24) సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో పనిచేసేవాడు. సోను స్నేహితుడు నరేందర్‌తో నీరజ్ అనే వ్యక్తికి డబ్బు విషయమై ఉన్న వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనతో నీరజ్ తన స్నేహితులు ముగ్గురితో లడో సరాయ్ టీ పాయింట్‌కి చేరుకున్నాడు. అక్కడికి నరేందర్‌తో పాటు అశోక్, సందీప్, సోను కూడా అదే టీ స్టాల్‌కి వెళ్లారు. రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో నీరజ్ మరికొంత మంది స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వారు ఆయుధాలు కూడా తీసుకురావడంతో వాటితో తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి నీరజ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సోను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో రాజీవ్ చౌహాన్, సంజీవ్ శర్మ పాల్గొన్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం నాలెడ్జి పార్కు వద్ద వారిద్దరినీ అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరింది. అంతకు ముందు నీరజ్, అరవింద్ కుమార్, కరణ్‌జిత్, రవీందర్ పవార్, కమల్, జగ్‌మోహల్ సాగర్, ద్రుప్, కార్తీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.