సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్‌ థాంక్స్ | Sonam thanks Chhattisgarh CM for making Neeraj tax free | Sakshi
Sakshi News home page

సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్‌ థాంక్స్

Published Sun, Feb 28 2016 1:46 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్‌ థాంక్స్ - Sakshi

సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్‌ థాంక్స్

ముంబై: తన తాజా చిత్రం 'నీర్జా' సూపర్‌ హిట్‌ కావడంతో ఫుల్‌ హ్యాపీగా ఉంది సోనం కపూర్‌. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ బాలీవుడ్ అమ్మడు. తొలిసారి తన కెరీర్‌లో బెస్ట్ యాక్టింగ్‌ చూపించడమే కాదు.. తన ఫస్ట్‌ బిగ్గెస్ట్ హిట్‌ను కూడా ఈ భామ సొంతం చేసుకుంది.

1986లో కరాచీలో హైజాక్‌ అయిన పాన్ ఆమ్ విమానంలో ఎయిర్‌ హోస్టెస్‌ నీర్జా బానోత్‌ చూపిన తెగువ, చేసిన త్యాగం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించింది. దీంతో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు హీరోయిన్ సోనం కపూర్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపింది. 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ సర్‌కు కృతజ్ఞతలు. ఎంతో ఆనందంగా ఉంది' అని సోనం ట్వీట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement