CM Raman Singh
-
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు : ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
సాక్షి, నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర, బోనస్ ప్రకటించకపోవడం వల్ల తెలంగాణరాష్ట్రం ఏర్పడిన నాలుగేళల్లో రాష్ట్రంలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి తరఫున ‘మార్పు కోసం–బీజేపీ’ పేరిట శనివారం నిర్వహించిన ప్రచారసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేసి వంచించారని విమర్శించారు. గిరిజన రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ను తాను దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో చేర్చానన్నారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలకు అనేక వాగ్ధానాలు చేసి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవ్చేలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రవేశపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాల్లో ఎంతో అవినీతి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఎంతోమంది యువకులు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం వారి ఆశలన్నీ నిరాశ చేశాడని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో క్వింటాల్ ధాన్యానికి రూ. 2,080 చొప్పున చెల్లిస్తున్నామని, గడిచిన రెండు నెలల్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇందుకుగాను రైతుల ఖాతాల్లో రూ. 14 వేల కోట్లు జమ చేశామన్నారు. తమ పార్టీఅభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డికి ఓటువేసి గెలిపిస్తే రైతుల కష్టాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది దళితులుండగా ఇప్పటివరకు 5 వేల మందికి మాత్రమే 3 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేశారన్నారు. పేదప్రజలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు సింగిల్‌బెడ్ రూం ఇళ్లు కూడా కట్టించలేకపోయారని విమర్శించారు. ఒకవైపు నుంచి కేసీఆర్.. మరోవైపు నుంచి మహాకూటమి వస్తుందని, ప్రజలు బీజేపీకి ఓటువేసి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మహాకూటమి తరపున రాహుల్‌గాంధీ ఎక్కడ ప్రచారంచేసినా అక్కడ వారి అభ్యర్థి ఓడిపోతారన్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం మహాకూటమి శాపంగా మారుతుందన్నారు. దేశంలో 75శాతం రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఉజ్వల యోజన ద్వారా బీజేపీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందజేస్తుందని వివరించారు. 2022 నాటికి దేశంలో అందరికీ పక్కా ఇళ్లు ఉండేలా మోడీ నాయకత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో తమపార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయూష్మాన్ భారత్ ద్వారా ప్రతిఒక్కరికి రూ. 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. దీంతోపాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతామన్నారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటువేయాలని ఆయన కోరారు. -
ఆమె ఆస్తి 1200.. సీఎంపై పోటీ!
ఎన్నికల బరిలో లెక్కలేనంత ఖర్చుపెట్టినా.. డిపాజిట్లు దక్కని పరిస్థితులున్న వేళ కేవలం రూ.1,200 ఆస్తి మాత్రమే ఉన్న ఓ ధీరవనిత ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ల బరిలో దిగింది. అది కూడా ఏకంగా సీఎం రమణ్ సింగ్‌పైనే. రమణ్ సింగ్ (బీజేపీ), వాజ్‌పేయి కోడలు కరుణా శుక్లా (కాంగ్రెస్) మధ్య హోరాహోరా పోటీ నెలకొన్న రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గంలో.. ఇప్పుడు ప్రతిమా వాస్నిక్ అనే 37 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి అందరి దృష్టినీ ఆకర్శిస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వెల్లడించిన డేటాప్రకారం.. ఆమె ఆస్తి కేవలం 12వందలు కాగా.. తన వద్ద రూ.20వేల ఎన్నికల ఫండ్‌కు మించి ఒక్క రూపాయి కూడా లేదు. ఆమె భర్త స్థానికంగా ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడున్నాడు. నామినేషన్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రమణ్ సింగ్ ఆస్తి రూ. 10.72 కోట్లు కాగా, కరుణా శుక్లా ఆస్తి రూ.3 కోట్లు. ఎస్సీ ఉద్యమాల అడ్డాలో.. ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమాలకు బలమైన పునాదులున్నాయి. ఎస్సీల్లోని సత్నామీ వర్గానికి ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఓట్లున్నాయి. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఛత్తీస్‌గఢ్ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్పష్టమైన లక్ష్యంతో.. ‘సమాజంలో మార్పు’ లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రతిమ.. నిధుల కొరత కారణంగా ఆర్భాటాలకు పోకుండా ∙ నెలరోజుల క్రితమే ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు దక్కడం, ఉద్యోగావకాశాలు మెరుగుపడటం, ఈ వర్గాలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించడం, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచే హామీలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు ఏం ఒరుగుతుందో మనకందరికీ తెలుసు. సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు మన తొలి అడుగును వేసేందుకు ఇదే మంచి తరుణం. ఎక్కడా అంబేడ్కర్ ఆలోచనలు కనిపించడం లేదు’ -
మళ్లీ నేనే!
దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. ఏకబిగిన మూడుసార్లు ఇక్కడ సీఎం రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ అడ్డా అయిన ఛత్తీస్‌గఢ్‌పై బీజేపీ పట్టు వెనక రమణ్ పాత్ర కీలకం. ఆ ధీమాతోనే ఆయన కూడా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. జోగి రాక బీజేపీకన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టమంటున్నారు. నక్సల్స్, కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై రమణ్ సింగ్ లెక్కలేంటి? మావోయిస్టులను అణచేస్తాం ‘మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం.. చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటి. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పుడు బస్తర్ ప్రాంతానికే వారు పరిమితమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తాం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013)మాకు తీవ్రమైన పోటీ ఉంది. అప్పుడే కాంగ్రెస్ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారు. అంతటి సానుభూతిలోనూ మేం విజయం సాధించాం. ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదు’ జోగి రావడం మంచిదే! ‘అజిత్ జోగి పోటీలో రావడం మంచిదే. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం.. బీజేపీ, కాంగ్రెస్‌లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది.. కాంగ్రెస్‌కే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్ నేతగానే ప్రజలు భావిస్తున్నారు’ గిరిజనులెప్పుడూ మావెంటే.. ‘ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలినవి జనరల్ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ మేమే గెలిచాం. గిరిజనులెప్పుడూ బీజేపీతోనే ఉంటారు. ఛత్తీస్‌గఢ్‌లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదు. నేను తటస్థ వాదిని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ నన్ను ఆదరిస్తాయి. అయినా.. అభివృద్ధి అంశంపైనే మేం ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నాం. ఛత్తీస్‌గఢ్‌లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదు’ -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్!
బిలాస్పూర్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రామ్‌దయాళ్ ఉయికె బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అణచివేతను భరించలేకే తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధరమ్‌లాల్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఉయికె బిలాస్పూర్లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ తీవ్ర అణచివేతకు గురయ్యా. సిద్ధాంతాలు, ఆశయాలను ఆ పార్టీ విస్మరించింది. అశ్లీల సీడీ రాజకీయాలతో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, పేద ప్రజలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో ఎస్టీ వర్గానికి చెందిన వాడిగా ఎంతో ఆవేదనకు గురయ్యా’ అని తెలిపారు. ఓ మహిళతో రాష్ట్ర మంత్రి రాజేశ్ మునత్ రాసలీలలు నెరుపుతున్న సీడీ బహిర్గతం కావడం వెనుక సూత్రధారిగా సీబీఐ పేర్కొంటున్న వారిలో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ కూడా ఒకరు. 2000వ సంవత్సరంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉయికె.. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైన పాలి–తనఖార్ లేదా మర్వాహిల నుంచి ఉయికెను బీజేపీ పోటీలోకి దించే చాన్సుంది. -
ముఖ్యమంత్రికి ‘ఇచ్ఛా మరణ’ వరముంది!
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను మహాభారతంలోని భీష్మ పితామహుడితో పోలుస్తూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజయ్ చంద్రకర్ వ్యాఖ్యలు చేశారు. భీష్ముడి తరహాలోనే రమణ్‌సింగ్‌కు ‘ఇచ్ఛా మరణ’ (కోరుకున్నప్పుడే చనిపోయే) వరముందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ముఖ్యమంత్రికి ఇచ్ఛామరణ వరముంది. భీష్మ పితామహుడి తరహాలో ఎప్పుడు ఓడిపోవాలి.. ఎప్పుడు గెలువాలన్నది ఆయనకు తెలుసు. ఛత్తీస్‌గఢ్ పురోగతి సాధించి.. సుసంపన్నమయ్యేవరకు తాను ఎప్పుడు ఓడిపోయేది ఆయన చెప్పబోరు’ అంటూ ఆయన శుక్రవారం ఓ సభలో పేర్కొన్నారు. ఓ పెద్ద పార్టీ నాయకుడు రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని, ఆ పార్టీ పాలనలో రాష్ట్రం వలసలు, నిరక్షరాస్యత మాత్రమే చవిచూసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. రమణ్‌సింగ్‌ను భీష్మపితామహుడితో పోలుస్తూ మంత్రి అజయ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'మావోయిస్టులతో సీఎంకు సంబంధాలున్నాయి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రమణ్ సింగ్ విజయానికి నక్సల్స్ సహకరించారని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మావోయిస్టుల విషయంలో బీజేపీ కూడా కాంప్రమైజ్ అయిందని ఆయన విమర్శలు గుప్పించారు. జవాన్ల మృతదేహాలతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని దిగ్విజయ్ అన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి జరిపిన ఘటనలో 26మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. -
మీకంటే మేం గొప్ప అనే వైఖరి వీడాలి
ఉగ్రవాదం, భూతాపోన్నతి అతిపెద్ద సవాళ్లు: మోదీ ఉజ్జయిని: ఉగ్రవాదం, భూతాపోన్నతి ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద సవాలుగా మారాయని, ‘మీకంటే మేం గొప్ప’ అనే వైఖరే వీటి వెనుక ప్రధాన కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఈ సమస్యలను అధిగమించడానికి.. వివాదాల పరిష్కారానికి ‘మీ కంటే మేం గొప్ప’ అనే వైఖరిని విడనాడటమే ఏకైక మార్గమని సూచించారు. సింహస్థ కుంభమేళా సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘సరైన మార్గంలో జీవించటం’పై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును శనివారం మోదీ ప్రారంభించారు. ‘భూతాపోన్నతి, ఉగ్రవాదాలకు పరిష్కారం ఏమిటి? వీటి పుట్టుకకు కారణం ఏమిటీ? మీ కంటే మేం పవిత్రులం అనే వైఖరే(ఆలోచన) దీనికి ప్రధాన కారణం. మీ దారి కన్నా నా దారే సరైనది అనుకోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే మనల్ని వివాదాలవైపు నడిపిస్తోంది’ అని అన్నారు. వివాదాలను ఎలా పరిష్కరించాలో భారతీయులకు బాగా తెలుసని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 51 పాయింట్ల సింహస్థ డిక్లరేషన్‌ను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లతో కలసి మోదీ విడుదల చేశారు. భారత్‌లో బౌద్ధ విస్తరణకు కృషి చేసిన అంగారిక ధర్మపాల విగ్రహాన్ని సిరిసేన సాంచిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. -
సీఎం రమణ్‌సింగ్‌కు సోనం కపూర్ థాంక్స్
ముంబై: తన తాజా చిత్రం 'నీర్జా' సూపర్ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది సోనం కపూర్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నీరాజనాలే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ బాలీవుడ్ అమ్మడు. తొలిసారి తన కెరీర్లో బెస్ట్ యాక్టింగ్ చూపించడమే కాదు.. తన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌ను కూడా ఈ భామ సొంతం చేసుకుంది. 1986లో కరాచీలో హైజాక్ అయిన పాన్ ఆమ్ విమానంలో ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ చూపిన తెగువ, చేసిన త్యాగం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించింది. దీంతో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు హీరోయిన్ సోనం కపూర్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. 'నీర్హా'కు పన్ను మినహాయింపు కల్పించారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సర్‌కు కృతజ్ఞతలు. ఎంతో ఆనందంగా ఉంది' అని సోనం ట్వీట్ చేసింది. -
ఆ ఎన్నిక ‘ఫిక్స’యింది!
♦ ఛత్తీస్‌గఢ్‌లో టేపుల దుమారం ♦ అంతాగఢ్ ఉప ఎన్నికలో సీఎం అల్లుడు, అజిత్‌లపై ఆరోపణలు రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది అంతాగఢ్ (ఎస్టీ) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫిక్స్ అయిందని.. అందులో రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అల్లుడు పునీత్‌గుప్తా, కాంగ్రెస్ నేత అజిత్‌జోగి, ఆయన కుమారుడు అమిత్‌ల పాత్ర ఉందని తాజాగా బయటపడిన ఆడియో టేపుతో వివాదం రాజుకుంది. అందులో పునీత్, అజిత్, అమిత్‌ల టెలిఫోన్ సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతాగఢ్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ సీఎం అజిత్‌జోగి వర్గానికి చెందిన మంతురామ్ పవార్ ఆఖరి క్షణాల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ఆయన్ను అప్పుడే పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే.. పవార్ పోటీ నుంచి తప్పుకోవటంలో ఫిక్సింగ్ జరిగిందని, డబ్బులూ చేతులు మారాయని, దానికి సంబంధించి ఆయనతో పునీత్, అజిత్, అమిత్‌లతో పాటు అజిత్ అనుకూలురు పలువురు జరిపిన సంభాషణలు ఈ టేపులో ఉన్నాయని వివాదం చెలరేగింది. పీసీసీ చీఫ్ భూపేష్ బెఘేల్ అమిత్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వారంలో జవాబు ఇవ్వాలన్నారు. రమణ్‌సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆరోపణలు నిరాధారమని, రమణ్‌సింగ్, అజిత్ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత పోరుకు ఇది నిదర్శనమని బీజేపీ పేర్కొంది. టేపుల వ్యవహారంపై పార్టీ రాష్ట్ర విభాగం నుంచి నివేదిక వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ అన్నారు. -
హీరోయిన్‌తో సీఎం సెల్ఫీపై దుమారం
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌తో సెల్పీ తీసుకోవడం దుమారం రేపింది. రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్‌లు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరీనాతో సెల్ఫీ తీసుకుంటా రమణ్ సింగ్ కెమెరా చేతికి చిక్కారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
మా రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మించండి
టీటీడీని కోరిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సాక్షి, తిరుమల: ఛత్తీస్‌గఢ్‌లాంటి వెనుకబడిన రాష్ట్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాల్సిన అవసరం ఉందని, టీటీడీ ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాన్ని మంజూరు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. -
తిరుమలలో చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్
తిరుమలః చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ శ్రీవారి దర్శనార్ధం శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాత్రి 10.50 గంటలకు ఆయన స్థానిక అదిత్యబిర్లా అతిథి గృహానికి చేరుకున్నారు. తిరుమల చేరుకున్న రమణ్ సింగ్‌కు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, బోర్డు సభ్యుడు భానుప్రకాష్, రిసెప్షన్ డెప్యూటీఈవో ఆర్1 రామారావు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం బస, దర్శనం ఏర్పాట్లు చేశారు. రమణ్‌సింగ్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.