ఎన్నికల బరిలో లెక్కలేనంత ఖర్చుపెట్టినా.. డిపాజిట్లు దక్కని పరిస్థితులున్న వేళ కేవలం రూ.1,200 ఆస్తి మాత్రమే ఉన్న ఓ ధీరవనిత ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్ల బరిలో దిగింది. అది కూడా ఏకంగా సీఎం రమణ్ సింగ్‌పైనే. రమణ్ సింగ్ (బీజేపీ), వాజ్‌పేయి కోడలు కరుణా శుక్లా (కాంగ్రెస్) మధ్య హోరాహోరా పోటీ నెలకొన్న రాజ్‌నందన్‌గావ్ నియోజకవర్గంలో.. ఇప్పుడు ప్రతిమా వాస్నిక్ అనే 37 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి అందరి దృష్టినీ ఆకర్శిస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వెల్లడించిన డేటాప్రకారం.. ఆమె ఆస్తి కేవలం 12వందలు కాగా.. తన వద్ద రూ.20వేల ఎన్నికల ఫండ్‌కు మించి ఒక్క రూపాయి కూడా లేదు. ఆమె భర్త స్థానికంగా ఓ హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడున్నాడు. నామినేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రమణ్ సింగ్ ఆస్తి రూ. 10.72 కోట్లు కాగా, కరుణా శుక్లా ఆస్తి రూ.3 కోట్లు.
ఎస్సీ ఉద్యమాల అడ్డాలో..
ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమాలకు బలమైన పునాదులున్నాయి. ఎస్సీల్లోని సత్నామీ వర్గానికి ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఓట్లున్నాయి. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఛత్తీస్‌గఢ్ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
స్పష్టమైన లక్ష్యంతో..
‘సమాజంలో మార్పు’ లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రతిమ.. నిధుల కొరత కారణంగా ఆర్భాటాలకు పోకుండా ∙ నెలరోజుల క్రితమే ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు దక్కడం, ఉద్యోగావకాశాలు మెరుగుపడటం, ఈ వర్గాలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించడం, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచే హామీలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు ఏం ఒరుగుతుందో మనకందరికీ తెలుసు. సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు మన తొలి అడుగును వేసేందుకు ఇదే మంచి తరుణం. ఎక్కడా అంబేడ్కర్ ఆలోచనలు కనిపించడం లేదు’
Comments
Please login to add a commentAdd a comment