దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మొదటి మూడు దశల్లో 11 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్‌ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
2019లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్‌కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్‌లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment