Voters Awareness
-
ఛత్తీస్‌గఢ్‌లో మారిన సమీకరణలు? కాంగ్రెస్‌కు అనుకూలం?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మొదటి మూడు దశల్లో 11 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్‌సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్‌ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.2019లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 9 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్‌కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్‌కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్‌నంద్‌గావ్‌లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది. -
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 428 లోక్‌సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్‌లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్‌ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్‌లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్‌సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్‌కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్‌లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు. -
Lok sabha elections 2024: మేం మారమంతే!
ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, హోటళ్లు మొదలుకుని బార్ల దాకా ఎందరు ఎన్ని ఆకర్షణీయమైన ఆఫర్లిచి్చనా బెంగళూరు ఓటర్లు మాత్రం మారలేదు. నగరంలో ఎప్పుడూ పోలింగ్ తక్కువగా నమోదవుతుండటంతో ఈసారి ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించేందుకు ఎన్నో వ్యాపార సంస్థలు యథాశక్తి ప్రయత్నించాయి. ఓటేస్తే భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఒక హోటల్ ఉచిత దోసెలు, మరో సంస్థ ఉచిత బీర్, ఇంకొన్ని మిల్‌్కõÙక్ తదితరాలపై 30 శాతం డిస్కౌంట్, వండర్లా వంటి రిసార్టులు ఎంట్రీ ఫీజుపై 15 శాతం తగ్గింపు వంటివి ఇచ్చాయి. కానీ ఇవేమీ బెంగళూరువాసులను కదిలించలేకపోయాయి. ఏప్రిల్ 26న కర్నాటకవ్యాప్తంగా 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగడం తెలిసిందే. మొత్తమ్మీద 69.23 శాతం మంది ఓటేస్తే బెంగళూరులో మాత్రం 54 శాతం మించలేదు. బెంగళూరు సెంట్రల్లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 52.15 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్‌లో 67.29 శాతం ఓటు హక్కు నమోదవడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్పు..తీర్పు మీ చేతుల్లోనే
సాక్షి, అమరావతి : ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను, ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉంది. ఈసారి కూడా జాబితాలో పేరుంటుందిలే అని ఉదాసీనంగా ఉన్నారా.. అయితే ఒక్కసారి మేల్కొండి.. తక్షణం ఓటు ఉందో లేదో సరిచూసుకోండి.. చివరి నిముషంలో ఓటు కనిపించకపోతే విలువైన అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు. ఒక్క సంక్షిప్త సందేశం, ఫోన్ కాల్ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలు తమ ఓటు పరిస్థితి తెలుసుకోవటానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యాప్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.. టోల్‌ఫ్రీ నంబరు 1950: ఎన్నికల సంఘం 1950 కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ నంబరుకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) పంపించటం లేదా ఫోన్ కాల్ చేయటం ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవచ్చు. సంక్షిప్త సందేశం ఎలా పంపాలంటే: ఆంగ్లంలో ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్ చేసి 1950 నంబరుకు పంపించాలి. వెంటనే జాబితాలో పేరుందా? లేదా అనేది ఓటరు ఫోన్ నంబరకు సందేశం వస్తుంది. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉందో తెలుసుకునేందుకు ఆంగ్లంలో ఈసీఐపీఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు సంక్షిప్త సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది. వెబ్సైట్లలో ఎలా సరిచూసుకోవాలి? 1. www. ceoandhra. nic. in వెబ్సైట్లోకి వెళ్లిపై భాగంలో ఉన్న ‘సెర్చ్ యువర్ నేమ్’ దగ్గర క్లిక్ చేయాలి. అందులో అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళితే నేరుగా నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో పేరుందో లేదో సులభంగా తెలుస్తుంది. 2. www. nvsp. in వెబ్సైట్లోకి వెళితే పేజీకి ఓ పక్కన ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ పేరు, ఊరు వివరాలు నమోదు చేస్తే వివరాలు వస్తాయి. యాప్ ద్వారా.. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌లో పేరు, నియోజకవర్గ వివరాలు టైప్‌చేయగానే ఓటు వివరాలు తెలుస్తాయి. ఓటు నమోదుతోపాటు తప్పులు సరిదిద్దుకోవడం ఓటు బదిలీ లాంటివి కూడా ఇంటివద్దనే చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈ ఎన్నికల్లో ఈవీఎంతోపాటు వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో కూడా యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఓటు వేసి తిరిగి వచ్చే వరకు ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించిన లఘుచిత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చేసే ప్రకటనలు, ప్రజలకు అందించే సందేశాలు కూడా యాప్‌ద్వారా తెలుసుకునే వీలుంది. ఎన్నికల్లో పోటీచేసే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలతోపాటు అన్ని అంశాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. వాటి షెడ్యూల్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకునేందుకు వీలుంది. మీసేవా కేంద్రాల్లో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు పోయిందా.. అయితే టెండర్ ఓటు వేయండి కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చే సరికి ఓటును ఇంకెవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రిసైడింగ్ అధికారి పరిశీలిస్తారు. అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతనికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాలెట్‌ను తీసుకుని ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేసి ఆ పత్రాలను కవర్లో పెట్టి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని రాస్తారు. చాలెంజ్ ఓటు.. ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రిసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
వజ్రాయుధాన్ని వదలొద్దు
సాక్షి, అమరావతి : ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాను, ఓటరు గుర్తింపు కార్డు కూడా ఉంది. ఈసారి కూడా జాబితాలో పేరుంటుందిలే అని ఉదాసీనంగా ఉన్నారా.. అయితే ఒక్కసారి మేల్కొండి.. తక్షణం ఓటు ఉందో లేదో సరిచూసుకోండి.. చివరి నిముషంలో ఓటు కనిపించకపోతే విలువైన అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు. ఒక్క సంక్షిప్త సందేశం, ఫోన్ కాల్ ద్వారా ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుసుకోవచ్చు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలు తమ ఓటు పరిస్థితి తెలుసుకోవటానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యాప్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి తెలుసుకుందాం.. టోల్‌ఫ్రీ నంబరు 1950: ఎన్నికల సంఘం 1950 కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ నంబరుకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) పంపించటం లేదా ఫోన్ కాల్ చేయటం ద్వారా ఓటరు జాబితాలో పేరుందో? లేదో తెలుసుకోవచ్చు. సంక్షిప్త సందేశం ఎలా పంపాలంటే: ఆంగ్లంలో ఈసీఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను టైప్ చేసి 1950 నంబరుకు పంపించాలి. వెంటనే జాబితాలో పేరుందా? లేదా అనేది ఓటరు ఫోన్ నంబరకు సందేశం వస్తుంది. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు ఉందో తెలుసుకునేందుకు ఆంగ్లంలో ఈసీఐపీఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి 1950కు సంక్షిప్త సందేశం పంపిస్తే సమాధానం వస్తుంది. ఫోన్‌కాల్ ద్వారా: 1950 నంబరుకు ఫోన్ చేసి, ఓటరు తన వివరాలు చెబితే జాబితాలో పేరుందా? లేదా చెబుతారు. వెబ్సైట్లలో ఎలా సరిచూసుకోవాలి? 1. www. ceoandhra. nic. in వెబ్సైట్లోకి వెళ్లిపై భాగంలో ఉన్న ‘సెర్చ్ యువర్ నేమ్’ దగ్గరకు వెళ్లండి. అందులో అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళితే నేరుగా నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో పేరుందో లేదో తెలుస్తుంది. 2. www. nvsp. in వెబ్సైట్లోకి వెళితే పేజీకి ఓ పక్కన ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ పేరు, ఊరు వివరాలు నమోదు చేస్తే వివరాలు వస్తాయి.యాప్ ద్వారా..గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌లో పేరు, నియోజకవర్గ వివరాలు టైప్‌చేయగానే ఓటు పరిస్థితి తెలుస్తుంది. ఓటు నమోదుతోపాటు తప్పులు సరిదిద్దుకోవడం ఓటు బదిలీ లాంటివి కూడా ఇంటివద్దనే చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈ ఎన్నికల్లో ఈవీఎంతోపాటు వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా వినియోగించుకోవాలో కూడా యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఓటు వేసి తిరిగి వచ్చే వరకు ఎలా వ్యవహరించాలన్న దానికి సంబంధించిన లఘుచిత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చేసే ప్రకటనలు, ప్రజలకు అందించే సందేశాలు కూడా యాప్‌ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీచేసే ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల వివరాలతోపాటు అన్ని అంశాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.. వాటి షెడ్యూల్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలను కూడా ఈ యాప్‌ద్వారా తెలుసుకునేందుకు వీలుంది. మీసేవా కేంద్రాల్లో ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మీ ఓటు పోయిందా.. అయితే టెండర్ ఓటు వేయండి కొన్ని సమయాల్లో ఓటరు ఓటు వేయడానికి వచ్చే సరికి ఓటును ఇంకెవరో వేసి వెళ్లడం చూస్తాం. అలాంటి సందర్భంలో సదరు ఓటరు వివరాలను ప్రీసైడింగ్ అధికారి పరిశీలిస్తారు. అతడు వాస్తవంగా ఓటు వేయలేదని నిర్ధారణకు వస్తే అతనికి ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దీన్నే టెండర్ ఓటు అంటారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 20 చొప్పున బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాలెట్‌ను తీసుకుని ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఓటు వేసి ఆ పత్రాలను కవర్లో పెట్టి ప్రీసైడింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. పత్రం వెనుక ఇంకుతో టెండర్ బ్యాలెట్ అని అధికారులు రాస్తారు. చాలెంజ్ ఓటు.. ఓటరు గుర్తింపు విషయంలో అధికారులకు సందేహం కలిగినా, ఏజెంట్లు అభ్యంతరం చెప్పినా సదరు ఓటర్ తన గుర్తింపును చాలెంజ్ చేసి రుజువు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని పేరు తప్పు చెబుతున్నాడని ఏజెంట్ అభ్యంతరం చెబితే ఓటర్ను.. ఏజెంట్‌ను ప్రీసైడింగ్ అధికారి వద్దకు పంపుతారు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్ నుంచి రూ. 2 చాలెంజ్ ఫీజుగా తీసుకుంటారు. అప్పుడు ఓటర్ వద్ద ఉన్న ఇతర గుర్తింపు వివరాలు అధికారులు పరిశీలిస్తారు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే బీఎల్ఓను పిలిచి అతడు స్థానిక ఓటరా కాదా అనే విషయం.. పేరు, తండ్రి పేరు లాంటి వివరాలు తెలుసుకుంటారు. అతడు స్థానిక ఓటరై, జాబితాలో ఉన్న పేరు వాస్తవం అయితే వయన్సు, తండ్రి పేరు, చిరునామా లాంటి విషయాల్లో తేడా ఉన్నా పెద్దగా పట్టించుకోరు. అప్పుడు ఏజెంట్, ఓటరు ఇద్దరిలో ఎవరి వాదన సరైందని తేలితే వారిని వదిలి మిగతా వారికి ప్రీసైడింగ్ అధికారి మొదటిసారి హెచ్చరిక జారీ చేస్తారు. లేదా ఏజెంట్‌ను, ఓటరును పోలీసులకు అప్పగించవచ్చు. -
ఎన్నికల అక్రమాలపై సీ-విజిలెన్స్
సాక్షి, తాడికొండ : ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ నాయకులు పలు ఎత్తుగడలు వేస్తారు. ప్రచారం ఊపందుకొన్న నాటి నుంచి ఓటింగ్ జరిగేంత వరకు డబ్బు, మద్యం ఎరజూపి ఓటర్లను మభ్య పెడుతుంటారు. అంతటితో ఆగకుండా ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ఎంతటి చర్యలకైనా వెనుకాడకుండా వారిని తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తారు. ఇలాంటి వారి ఆగడాలను అరికట్టి వాళ్లు చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీ–విజిల్ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా జరుగుతున్న అక్రమాలను సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో చిత్రీకరించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే ఎన్నికల కమిషన్ అధికారులు చర్యలకు ఉపక్రమిస్తుంది. అక్రమాలకు పాల్పడిన వారు తప్పించుకొనే వీలుండదు సీ–విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన వారు తప్పించు కోవటానికి వీలుండదు. ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో కూడా ఇట్టే తెలిసి పోతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను ఎన్నికల కమిషన్ గోప్యంగా ఉంచుతుంది. గత ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో ఈ యాప్‌ను ఉపయోగించి అధికారులు సత్ఫలితాలు సాధించారు. తెలంగాణ ఎన్నికల్లో దీనిని అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టారు. ఫిర్యాదు చేయడం ఇలా.. ఆండ్రాయిడ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లో గూగూల్ ప్లేస్టోర్ నుంచి సీ–విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేయగానే వీడియో, ఫొటోలు అనే రెండు ఆప్షన్లు వస్తాయి. ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అక్కడ సెల్ఫోన్లో నుంచి వీడియోల లేదా ఫొటోలు తీసి యాప్ ద్వారా పంపించవచ్చు. మద్యం, డబ్బుతో పాటు అనుమతి లేకుండా ర్యాలీలు, గోడల మీద రాతలు, జెండాలు పెట్టటం వంటివి ఏవైనా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ జీపీఎస్‌తో అనుసంధానమై ఉంటుంది. ఫిర్యాదు ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకొని జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత ఎన్నికల అధికారి లేక ఫ్లయింగ్ స్కాడ్స్కు సమాచారం అందిస్తారు. కేవలం 25 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకొని అక్కడ విచారణ చేపడతారు. విచారణ అనంతరం ఫిర్యాదుదారునికి వారు పూర్తి చేసిన కార్యచరణను మెసేజ్ రూపంలో అందిస్తారు. ఈ తతంగం అంతా 100నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసివారి పేర్లు ఎక్కడా బహిర్గతం కావు. పౌరులుగా స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటానికి ఓటరుకు బ్రహ్మాస్త్రం సీ–విజిల్. -
ఎన్నికల యాప్‌లు వచ్చేశాయ్
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటోంది. ఈ నేపథ్యంలోనే యాప్‌లు, సాఫ్ట్వేర్ వినియోగం అందుబాటులోకి తీసుకొచ్చింది. నా ఓటు, సమాధాన్, మ్యాట్ డాటా, సీ విజిల్, సుగం, మాట్‌దాన్, సువిధ యాప్‌లతో ఎన్నికల్లో లోటుపాట్లపై ఇంటర్నెట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వెలువడనున్న క్రమంలో ఆయా యాప్‌లపై ఓటర్లు పరిజ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో వాటి గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి, సిటీబ్యూరో నా ఓటు యాప్ ఓటర్ సెర్చ్ ఆప్షన్లో డిటెయిల్ ఎంటర్ చేస్తే తొలుత మనకు సంబంధించిన ఓటర్ ఐడీ వస్తుంది. నియోజకవర్గం, పేరు, పోలింగ్‌స్టేషన్ వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది. వలంటీర్ల వివరాలు, పోలింగ్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలి తదితర వివరాలు వస్తాయి. సెర్చ్‌లోకి వెళ్లి ఎపిక్ నంబర్ కొడితే దారి చూపుతుంది. వికలాంగులకు వాహనాలు రావాలన్నా కోరవచ్చు. ఓటరు సర్వీసు పోర్టల్ .. ఓటు నమోదు కోసం నేషనల్ ఓటరు సర్వీసు పోర్టల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. మన ఇంట్లోనే ఉండి ఓటును నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్, యాప్‌లో మన ఓటు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించిన తర్వాత గుర్తింపు కార్డుని సర్వీసు పోర్టల్ నుంచి పొందే వెసులుబాటు ఉంది. దీని ద్వారా ఓటు నమోదు చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయి. సమాధాన్... ఎన్నికల సమయంలో ఓటర్ల సందేహాల నివృత్తికి అధికారులు ఆర్డీఓ, కలెక్టర్ల కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నంబర్ 1950, ఈ మెయిల్, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, తపాలా ద్వారా ఫిర్యాదు చేసే మార్గాలున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారానే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో సమాధాన్ యాప్‌ను దిగుమతి చేసుకుని ఆ యాప్ ద్వారా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించి సమాధానమిస్తుంది. సీ విజిల్ .. ఓటర్లను ప్రలోభానికి గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలంటే అధికారులను నేరుగా కలవాల్సిందే. విచారణ జరిపినా ఆధారాలు లభించకపోవచ్చు. ఇప్పుడు ఉల్లంఘన జరిగిన చోటు నుంచి విజిల్ ఊదే సదుపాయం ఎన్నికల సంఘం ఈ యాప్ ద్వారా అందించింది. సీ విజిల్ యాప్‌లో ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలను తీసి పంపవచ్చు. నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించాలి. లేదంటే వారే బాధ్యులవుతారు. డబుల్ ఓటుంటే అంతే.. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ సందర్భంగా అధికారులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ యాప్‌లో నమోదవుతాయి. వినియోగించే వాహనాలు, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు ఉంటాయి. ఓటర్ల జాబితాను చూసుకొనే యాప్‌లు కూడా ఉన్నాయి. ఏదైని ఒక ప్రాంతంలో ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈఆర్వో నెట్.20 వర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం. అధికారులు ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను బస్తీ ప్రాంతాల్లో ఓటరు జాబితాలో ఉపయోస్తారు. ఆ తర్వాత నగరంలోని ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు. ఓటరు వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్.. ఎన్నికల్లో పారదర్శకత కోసం అందుబాటులోకి తీసుకొచ్చిందే ఓటరు వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్. దీన్నే వీవీ ప్యాట్ అంటారు. ఈ సాఫ్ట్వేర్ ఉన్న యంత్రం ఒకటి ఈవీఎంతో పాటు పక్కన ఉంటుంది. ఓటు వేశాక వీవీ ప్యాట్ తెరపై మనం ఏ గుర్తుకు ఎంపిక చేసుకున్నామో కనిపిస్తుంది. ఇది కేవలం 7 సెకన్లు అందుబాటులో ఉంటుంది. ఇది ట్యాంపరింగ్ జరగలేదని ఓటరు నిర్ధరణ చేసుకోవచ్చు. -
ఓటర్లలో రికార్డు చైతన్యం..!
సాక్షి, వనపర్తి : వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు.. వనపర్తిలో మరో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్వేతామహంతి సారథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడామైదానంలో శనివారం ఓటరు చైతన్యం కోసం ఏకకాలంలో 6,300 మంది విద్యార్థులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, స్థానికులతో పాటు కలెక్టర్ శ్వేతామహంతి, ఎస్పీ కె.అపూర్వారావు, అధికారులు ఓటర్లను చైతన్యం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు హాజరై రికార్డు ధవీకరణ పత్రంతో పాటు బంగారు పతకం అందజేశారు. ఓటింగ్ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అ«ధికారి సూచన మేరకు నెల రోజులుగా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ఇప్పుడు జిల్లా విద్యాశాఖ సహకారంతో డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు పేరున ప్రకటించారు. ఈవీఎంలపనితీరు ఇలా... కల్వకుర్తి టౌన్ : సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఈవీఎంలను వినియోగిస్తోంది. ఈవీఎంకు రెండు యంత్రాలు అనుసంధానంగా ఉంటాయి. ఇవే సీయూ(కంట్రోల్ యూనిట్), బీయూ (బ్యాలెట్ యూనిట్). పోలింగ్ స్టేషన్‌లోని అధికారుల వద్ద సీయూ ఉంటుంది. ఓటర్లు బీయూలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి వెళ్లినప్పుడు అధికారి సీయూలోని బ్యాలెట్ బటన్‌ను నొక్కితేనే ఓటు వేసేందుకు అనుమతి లభిస్తుంది. బీయూలో 16 గుర్తుల వరకు ఉంటాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు ఉండి గుర్తులు కేటాయించాల్సి వస్తే మరో యంత్రాన్ని వినియోగిస్తారు. అభ్యర్ధులు పది మంది కంటే తక్కువగా ఉంటే ఎందరు అభ్యర్ధులు పోటీలో ఉంటే అన్ని గుర్తులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. ఎన్నికల అధికారి సీయూలో బ్యాలెట్ బటన్ నొక్కగానే ఓటు వేసేందుకు వెళ్లిన ఓటరు వద్ద ఉన్న బీయూలోని బల్బు వెలుగుతుంది. అప్పడు బీయూలోని అభ్యర్ధుల గుర్తుల్లో తమకు నచ్చిన అభ్యర్ధి గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్‌ను నొక్కితే ఓటింగ్ పూర్తయినట్లు, ఈ ప్రక్రియ పూర్తికాగానే బల్బు ఆగిపోతుంది. అప్పుడు మరో ఓటరును పంపిస్తారు. బీయూలో అభ్యర్ధులందరీ గుర్తుల తర్వాత నోటా గుర్తు ఉంటుంది. అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో నోటాను ఎంచుకోవచ్చు. -
అవేర్నెస్ గ్రూప్స్ విధులు ఏంటి..?
సాక్షి, కాజీపేట: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బూత్‌లెవల్ అవేర్నెస్ గ్రూప్స్(బ్లాగ్)ను ప్రతి పోలింగ్ కేంద్రానికి ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, స్థానిక ఓటర్లతో పరిచయం ఉండి, ఆ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న స్థానిక వ్యక్తులను, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న వారిని అధికారులు బ్లాగ్స్లో సభ్యులుగా నియమిస్తా రు. ప్రతి బ్లాగ్స్లో బీ ఎల్వో బృంద నాయకునిగా ఉండగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఆశావర్కర్, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్, మహిళా సంఘాల బుక్‌కీపర్లను సభ్యులుగా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు వారందరికీ నియామకపు ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా విధి నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. బ్లాగ్ బాధ్యతలు ఇలా... ఓటర్లకు అవగాహన కల్పించి చైతన్యపర్చడం, ఓటింగ్‌లో పాల్గొనేలా చేయడం. ఓటు హక్కును కలిగి ఉన్నవారంతా వినియోగించుకునేలా ప్రోత్సహించడం. మద్యం, ధన ప్రలోభాలకు లొంగకుండా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను పంపిణీచేసి ఓటు ప్రాధాన్యతను వివరించడం. ఎన్నికల్లో ఓటు ఆవశ్యకతపై పోలింగ్‌బూత్ స్థాయిలోని పాఠశాలలో విద్యార్థులకు ఆటలు, క్విజ్‌పోటీలు నిర్వహించాలి. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. గర్భిణులు, బాలింతలు, వికలాంగులు, వృద్ధులకు ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలి. వికలాంగులకు ర్యాంపు, ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించడం. వయోవృద్ధులు, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు ఓటింగ్ ఆవశ్యకతను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఉంటాయి. -
ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు
సాక్షి,వనపర్తి క్రైం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్ గ్రామంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌లో జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. డబ్బు, మద్యానికి ఓటును అమ్మకోకుండా నిజాయితీగా వేయాలని చెప్పారు. ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి గ్రామాభివృద్ధికి, తద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడేవారికి ఓటు వేయాలని అన్నారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వారిని తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం, పోలింగ్ కేంద్రాల వద్ద మూడు చక్రాల సైకిల్, సహాయకులు ఉంటారని, తాగునీరు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు, బాలింతలు తదితరుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం తమ ప్రదర్శన ద్వారా ఓటు విలువ తెలుసుకో..ఓటు హక్కు వినియోగించుకో అనే నృత్య రూపాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అప్జల్, డిప్యూటీ తహసీల్దార్ కొండన్న తదితరులు ఉన్నారు. -
ఓటరన్నా.. జర భద్రం!
సాక్షి, వనపర్తి టౌన్ : మంచి నేతను ప్రతినిధిగా ఎన్నుకోవాలన్నా... సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఓటర్లు తీర్పే కీలకం. నేతల తలరాతలను మార్చేది, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేది ఓటే. అయితే, ఆ ఓటును బాధ్యతగా గుర్తిచేలా, ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేలా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రలోభాలకు లొంగొద్దని కోరుతూ ఓటు హక్కును తప్పక వినియోగించుకునేలా అవగాహన కల్పించే చిత్రాలతో పాటు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లతో పోస్టర్లు ముద్రించారు. ఈ పోస్టర్లను కలెక్టర్ ఆదేశాలతో వనపర్తి డీఎం దేవదానం ఆధ్వర్యాన సోమవారం బస్సులకు అంటించారు. -
ఓటర్లను ఓ ఆట ఆడిస్తున్నారు!
సాక్షి, జైపూర్ : రాజస్తాన్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోవటానికి, ఓట హక్కు లేని వారు కొత్తగా ఓటు హక్కు పొందటానికి ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం అవగాహన సద్సులు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అయితే బర్మార్ జిల్లాలోని ప్రభుత్వ అధికారులు ఓ అడుగు ముందకు వేశారు. ఓటర్లను ఉత్సాహరుస్తూ వారికి అవగాహన కల్పించటానికి ‘‘ వైకుంఠపాళి’’ ఆటను ఆడిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 1600 అడుగుల చదరపు అడుగుల ఆటకు సంబంధించిన బోర్డును ఏర్పాటుచేశారు. ఆట వైకుంఠపాళిని పోలి ఉన్నా నియమాలు కొద్దిగా వేరు. అక్కడ పాము కరవటం శిక్ష అయితే.. ఇక్కడ మాత్రం ఓటరుగా నమోదు చేసుకోకపోవటం, డబ్బుకు ఓటును అమ్ముకోవటం, మద్యం కోసం అమ్ముకోవటం వంటివి ఇక్కడ పాము కాట్లు. ఇక నిచ్చెన ఎక్కటమంటే ఓటు హక్కు ప్రజాస్వామ్య పద్ధతిలో వినియోగించుకోవటం తోటి వారికి సైతం ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించటం వంటివి. ఈ అవగాహన కల్పించే ఆట ‘‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్’’లో సైతం చోటు సంపాదించుకుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆట ద్వారా అవగాహన కల్పించటానికి ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
2009 పోల్ రివ్యూ
ఓటర్ల చైతన్యం పెరిగింది. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014 నాటికి ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడమే దీనికి నిదర్శనం. గడిచిన పోలింగ్ సమయానికి జిల్లాలో 23,42,812 ఓటర్లు నమోదు కాగా 2014 ఎన్నికల తుది జాబితా ప్రకారం ఆ సంఖ్య 24,84,109 గా నమోదైంది. కేవలం ఐదేళ్లలోనే ఏకంగా 1,41,297 మంది ఓటర్లు పెరిగారంటే ప్రజలు ఓటు విలువ ఎంతలా తెలుసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక గత సార్వత్రిక ఎన్నికలు పరిశీలిస్తే జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన పోటీదారులుగా నిలువగా పీఆర్పీ కూడా గణనీయమైన ఓటు బ్యాంకు సొంతం చేసుకుంది. కానీ నేటి సార్వత్రిక ఎన్నికల సమయానికి రాజయకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. పీఆర్పీ తుస్సుమంటూ కాంగ్రెస్‌లో విలీనం కావడం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లాలో కనుమరుగవడం చకచకా జరిగిపోయింది. ప్రజల మనసు గెలుచుకున్న పార్టీగా అవతరించిన వైఎస్సార్ సీపీ మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన ఖాతాలో వేసుకోనుంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. టీడీపీ చారిత్రక తప్పిదం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో చాలామంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో 2009లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు నమోదయ్యాయో సాక్షి పాఠకులకు అందిస్తున్నాం.