సాక్షి, కాజీపేట: ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బూత్‌లెవల్ అవేర్‌నెస్ గ్రూప్స్(బ్లాగ్)ను ప్రతి పోలింగ్ కేంద్రానికి ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి, స్థానిక ఓటర్లతో పరిచయం ఉండి, ఆ ప్రాంతంలో ఓటు హక్కు కలిగి ఉన్న స్థానిక వ్యక్తులను, ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఉన్న వారిని అధికారులు బ్లాగ్స్‌లో సభ్యులుగా నియమిస్తా రు. ప్రతి బ్లాగ్స్‌లో బీ ఎల్వో బృంద నాయకునిగా ఉండగా ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, ఆశావర్కర్, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్, మహిళా సంఘాల బుక్‌కీపర్లను సభ్యులుగా నియమిస్తూ ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు వారందరికీ నియామకపు ఉత్తర్వులు జారీచేయడమే కాకుండా విధి నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు.
బ్లాగ్ బాధ్యతలు ఇలా...
- ఓటర్లకు అవగాహన కల్పించి చైతన్యపర్చడం, ఓటింగ్‌లో పాల్గొనేలా చేయడం.
- ఓటు హక్కును కలిగి ఉన్నవారంతా వినియోగించుకునేలా ప్రోత్సహించడం.
- మద్యం, ధన ప్రలోభాలకు లొంగకుండా వాల్‌పోస్టర్లు, కరపత్రాలను పంపిణీచేసి ఓటు ప్రాధాన్యతను వివరించడం.
- ఎన్నికల్లో ఓటు ఆవశ్యకతపై పోలింగ్‌బూత్ స్థాయిలోని పాఠశాలలో విద్యార్థులకు ఆటలు, క్విజ్‌పోటీలు నిర్వహించాలి. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.
- గర్భిణులు, బాలింతలు, వికలాంగులు, వృద్ధులకు ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాలి.
- వికలాంగులకు ర్యాంపు, ఉచిత రవాణా సౌకర్యాలను కల్పించడం.
- వయోవృద్ధులు, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు ఓటింగ్ ఆవశ్యకతను తెలిపే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment