
బెంగళూరులో ఓటింగ్ అంతంతే
ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, హోటళ్లు మొదలుకుని బార్ల దాకా ఎందరు ఎన్ని ఆకర్షణీయమైన ఆఫర్లిచి్చనా బెంగళూరు ఓటర్లు మాత్రం మారలేదు. నగరంలో ఎప్పుడూ పోలింగ్ తక్కువగా నమోదవుతుండటంతో ఈసారి ఓటర్లను పోలింగ్ బూతులకు రప్పించేందుకు ఎన్నో వ్యాపార సంస్థలు యథాశక్తి ప్రయత్నించాయి. ఓటేస్తే భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.
ఒక హోటల్ ఉచిత దోసెలు, మరో సంస్థ ఉచిత బీర్, ఇంకొన్ని మిల్‌్కõÙక్ తదితరాలపై 30 శాతం డిస్కౌంట్, వండర్‌లా వంటి రిసార్టులు ఎంట్రీ ఫీజుపై 15 శాతం తగ్గింపు వంటివి ఇచ్చాయి. కానీ ఇవేమీ బెంగళూరువాసులను కదిలించలేకపోయాయి. ఏప్రిల్ 26న కర్నాటకవ్యాప్తంగా 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగడం తెలిసిందే. మొత్తమ్మీద 69.23 శాతం మంది ఓటేస్తే బెంగళూరులో మాత్రం 54 శాతం మించలేదు. బెంగళూరు సెంట్రల్‌లో 52.81 శాతం, బెంగళూరు నార్త్‌లో 54.42 శాతం, బెంగళూరు సౌత్‌లో 52.15 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు రూరల్‌లో 67.29 శాతం ఓటు హక్కు నమోదవడం విశేషం!
– సాక్షి, నేషనల్ డెస్క్