సార్వత్రిక ఎన్నికల సమరం చివరాఖరి దశకు చేరుకుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా జరిగిన ఆరు విడతల్లో పెద్ద మార్పేమీ కనిపించలేదు. దాంతో చివరిదైన ఏడో విడతలోనైనా ఓటింగ్ శాతాన్ని వీలైనంత పెంచేందుకు ఈసీ పలు ప్రయత్నాలు చేస్తోంది. యువ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు వారికి బాగా కనెక్టయ్యే మీమ్స్‌ను ఎంచుకుంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఎంత హిట్టయిందో, అందులోని మున్నా భయ్యా పాత్ర కూడా అంతే ఫేమస్ అయింది! ఈసీ రిలీజ్ చేసిన కొత్త మీమ్‌లో మున్నా భయ్యా డైలాగ్‌ను ఓటింగ్‌కు అన్వయించింది.
మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యా క్లాస్ రూమ్‌లో చెప్పే ‘పడాయీ లిఖాయీ కరో, ఐఏఎస్ వయ్యేఎస్ బనో’ (చదువుసంధ్యలపై దృష్టి పెట్టు, కలెక్టరో మరోటో అవ్వు) అనే ఒరిజినల్ డైలాగ్ ఇప్పటికీ రీల్స్, షార్ట్ వీడియోల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఈసీ ఇప్పుడు దీనికి ఓటింగ్ ట్విస్ట్ ఇచి్చంది. ‘యే క్యా రీల్స్ మే టైమ్ బర్బాద్ కర్ రహే? జావో వోట్ దో, లోక్‌తంత్ర్ కో మజ్‌బూత్ కరో (రీల్స్ వెంటపడి ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటారు? వెళ్లి ఓటేయండి... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి) అని ఓటర్లకు మున్నా భయ్యా చెబుతున్నట్లుగా మీమ్ రూపొందించింది. ‘యువతను మున్నా భయ్యా ఓటేయాలని కోరుతున్నాడు’ అంటూ క్యాప్షన్‌ను కూడా జోడించింది!
ఏడు విడతల సుదీర్ఘ షెడ్యూల్‌లో ఇప్పటికి ఆరు విడతలు పూర్తయ్యాయి. 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఆఖరి దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో సహా బిహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్‌లో పోలింగ్ జరగనుంది. దాంతో అక్కడ ప్రచారం దుమ్మురేగిపోతోంది. చివరి దశలో ప్రధాని మోదీ సహా మొత్తం 904 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ మున్నా భాయ్ మీమ్ ప్రయోగం యూత్‌ను ఏ మేరకు పోలింగ్ బూత్‌లకు రప్పిస్తుందో చూడాలి!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment