![Lok Sabha Election 2024: Constitution should be saved says Kejriwal](/styles/webp/s3/article_images/2024/05/16/kejri.jpg.webp?itok=KuHe2Vnz)
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్‌నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా.
దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment