ఓటరన్నా.. జర భద్రం! | Voter Awareness Activities, Wanaparthy | Sakshi
Sakshi News home page

ఓటరన్నా.. జర భద్రం!

Published Tue, Nov 13 2018 10:59 AM | Last Updated on Wed, Mar 6 2019 6:19 PM

Voter Awareness Activities, Wanaparthy - Sakshi


సాక్షి, వనపర్తి టౌన్‌ : మంచి నేతను ప్రతినిధిగా ఎన్నుకోవాలన్నా... సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఓటర్లు  తీర్పే కీలకం. నేతల తలరాతలను మార్చేది, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసేది ఓటే. అయితే, ఆ ఓటును బాధ్యతగా గుర్తిచేలా, ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేలా వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

 ప్రలోభాలకు లొంగొద్దని కోరుతూ ఓటు హక్కును తప్పక వినియోగించుకునేలా అవగాహన కల్పించే చిత్రాలతో పాటు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లతో పోస్టర్లు ముద్రించారు. ఈ పోస్టర్లను కలెక్టర్‌ ఆదేశాలతో వనపర్తి డీఎం దేవదానం ఆధ్వర్యాన సోమవారం బస్సులకు అంటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement