'మావోయిస్టులతో సీఎంకు సంబంధాలున్నాయి'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో రమణ్ సింగ్ విజయానికి నక్సల్స్ సహకరించారని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మావోయిస్టుల విషయంలో బీజేపీ కూడా కాంప్రమైజ్ అయిందని ఆయన విమర్శలు గుప్పించారు.
జవాన్ల మృతదేహాలతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని దిగ్విజయ్ అన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడి జరిపిన ఘటనలో 26మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు.