'గోవా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా'
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్...గోవా ప్రజలకు క్షమాపణ చెప్పారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. అధికారం, డబ్బుతో ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ప్రజా తీర్పు కంటే మనీ పవరే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు దిగ్విజయ్ ట్విట్ చేశారు. మరోవైపు గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం కూడా తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రెండో స్థానం కట్టబెట్టిన బీజేపీకి గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లేదని అన్నారు.
Money Power has won over People's Power. I apologise to the People of Goa as we couldn't muster the support to form the Govt.
— digvijaya singh (@digvijaya_28) 13 March 2017
But our struggle against Communal Forces and Money Power Politics in Goa shall continue.
— digvijaya singh (@digvijaya_28) 13 March 2017
కాగా గోవాలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం లేదు. వాస్తవానికి ఇక్కడ బీజేపీ కన్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే చిన్నపార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతును బీజేపీ సంపాదించగలిగింది. దీంతో గోవాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దమయ్యింది. ముఖ్యమంత్రి గా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ను బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది.
పరీకర్ ఆదివారం సాయంత్రం గవర్నర్ మృదులా సిన్హాను కలసి తన నాయకత్వంలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశమి వ్వాల్సిందిగా కోరారు. దీంతో పరీకర్ను ముఖ్యమంత్రిగా నియమించిన గవర్నర్.. మెజారిటీ నిరూపించుకునేందుకు 15 రోజుల గడువిచ్చారు.