హీరోయిన్తో సీఎం సెల్ఫీపై దుమారం | Chhattisgarh CM Raman Singh draws Congress' flak for selfie with Kareena Kapoor | Sakshi
Sakshi News home page

హీరోయిన్తో సీఎం సెల్ఫీపై దుమారం

Published Sat, Nov 21 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

హీరోయిన్తో సీఎం సెల్ఫీపై దుమారం

హీరోయిన్తో సీఎం సెల్ఫీపై దుమారం

రాయ్పూర్ : చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్తో సెల్పీ తీసుకోవడం దుమారం రేపింది. రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు.

చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్లు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరీనాతో సెల్ఫీ తీసుకుంటా రమణ్ సింగ్ కెమెరా చేతికి చిక్కారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement