selfie issue
-
హీరోయిన్‌తో సీఎం సెల్ఫీపై దుమారం
రాయ్‌పూర్ : చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్‌తో సెల్పీ తీసుకోవడం దుమారం రేపింది. రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా, రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్‌లు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కరీనాతో సెల్ఫీ తీసుకుంటా రమణ్ సింగ్ కెమెరా చేతికి చిక్కారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. -
విమానం కూలితే.. సెల్ఫీ తీసుకున్న పోలీసులు
విమాన ప్రమాదం జరిగి 11 మంది మరణిస్తే.. అక్కడకు వెళ్లిన ఇద్దరు యువ పోలీసు ఆఫీసర్లు అక్కడ జరగాల్సింది చూడకుండా.. వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు! దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన లండన్‌లో జరిగింది. వీళ్లిద్దరూ బ్రిటిష్ పోలీసు విభాగంలో కొత్తగా చేరారు. విమానం కూలిన ప్రాంతానికి కొద్ది దూరంలో వాళ్లు కార్డన్ సెర్చ్ చేయాల్సి ఉంది. అయితే, ఆ పని చేయకుండా వెళ్లి కూలిన విమానం సమీపంలో సెల్ఫీలు తీసుకున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వాళ్ల బంధువులు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. వాస్తవానికి ప్రమాదంలో మరో 16 మంది గాయడపడ్డారు కూడా. దాంతో బాధితులందరికీ పోలీసు విభాగం క్షమాపణలు చెప్పింది. ఫొటోలు తీసుకున్నవాళ్లు వాటిని తమ సహోద్యోగులకు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.