Bully Boy App Case: Bully Boy App Author Neeraj Bishnoi Arrested - Sakshi
Sakshi News home page

‘బుల్లి బాయ్‌’ సృష్టికర్త అరెస్ట్‌

Published Fri, Jan 7 2022 5:59 AM | Last Updated on Fri, Jan 7 2022 9:02 AM

Bully Boy App author Neeraj Bishnoi arrested - Sakshi

నీరజ్‌ బిష్ణోయ్‌

న్యూఢిల్లీ: ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్‌’ యాప్‌ సృష్టికర్తని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అస్సాంకు చెందిన నీరజ్‌ బిష్ణోయ్‌ (21) ఈ యాప్‌ను తయారు చేశాడని, అతనే ఈ కేసుకి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు.  గురువారం ఉదయం అస్సాంలోని నీరజ్‌ సొంతూరు జోర్హత్‌లో ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్స్‌ (ఐఎఫ్‌ఎస్‌ఒ) బలగాలు అతనిని అదుపులోనికి తీసుకొని ఢిల్లీకి తీసుకువచ్చాయి.  పోలీసులు జరిపిన విచారణలో అతను నేరాన్ని అంగీకరించినట్టుగా ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటికే ముంబై పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారిలో ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ ప్రధాన నిందితురాలిగా ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరజ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో వెల్లూర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోబీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గిట్‌హబ్‌ ప్లాట్‌ఫారమ్‌లో బుల్లి బాయ్‌ యాప్‌ తయారు చేసి దానికి సంబంధించిన ప్రధాన ట్విట్టర్‌ అకౌంట్‌ అతనే నడుపుతున్నాడని ఐఎఫ్‌ఎస్‌ఒ డిప్యూటీ కమిషనర్‌ కేపీఎస్‌ మల్హోత్రా మీడియాకి  చెప్పారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ డిటైల్‌ రికార్డ్స్‌ (ఐపీడీఆర్‌), ఇతర గేట్‌ వేల సహాయంతో అతని జాడని కనిపెట్టామని చెప్పారు. నీరజ్‌ ల్యాప్‌టాప్‌లో కూడా ఈ యాప్‌ని తయారు చేసినట్టుగా ఫోరెన్సిక్‌ ఆధారాలు లభించాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement