
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) అరెస్ట్ చేసింది. రూ.2,000 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన కేసులో ఆయన నిందితుడు. సంస్థ నిధుల అవకతవకలకు సంబంధించి ఎస్‌ఎఫ్‌ఐఓ అరెస్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి సింఘాల్ అని ఉన్నతాధికారులు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ వరకూ ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
భూషణ్ స్టీల్‌కు అనుబంధంగా ఉన్న వివిధ కంపెనీల్లో వినియోగానికి గాను పొందిన రూ.2,000 కోట్ల విషయంలో సింఘాల్ అవకతవకలకు పాల్పడ్డారని ఆర్థికశాఖ పేర్కొంటోంది. బ్యాంకులు దివాలా ప్రక్రియను ప్రారంభించిన 12 బడా కేసుల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఎన్‌సీఎల్‌టీ ముందు చేరిన ఈ కంపెనీని ఇటీవలే టాటా స్టీల్ బిడ్ వేసి దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment