పిల్లలు చేసే విచిత్రం | Anta vichitram songs release | Sakshi
Sakshi News home page

పిల్లలు చేసే విచిత్రం

Published Sun, Oct 21 2018 1:24 AM | Last Updated on Sun, Oct 21 2018 1:24 AM

Anta vichitram songs release - Sakshi

సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్‌ ముఖ్య తారలుగా జై రామ్‌కుమార్‌ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్‌ అస్లాం నిర్మించిన ‘అంతా విచిత్రమ్‌’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. జి.శ్రీను గౌడ్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు భోలే షావలి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత అస్లాం మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథాంశంతో రామ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసి ఇంప్రెస్‌ అయిన ఎం. అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు’’ అన్నారు. ‘‘పవన్‌కల్యాణ్, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్‌ హీరోల ఫ్యాన్స్‌ అయిన కొందరు చిన్నారుల కథాంశమే ఈ చిత్రం’’ అన్నారు రామ్‌ కుమార్‌. చిన్నపిల్లలతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులుగా పాల్గొన్న రామ సత్యనారాయణ, సాయి వెంకట్, అనంతరాముడు ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement