హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు.
ప్రణీత్ తన కెరీర్‌లో సింగపూర్ ఓపెన్, కెనడా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
ప్రణీత్ తన కెరీర్ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం ప్రణీత్ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్ కరోలినా క్లబ్‌లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment