
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. శ్రావ్య వర్మ అనే అమ్మాయిని శ్రీకాంత్ త్వరలో మనువాడనున్నాడు. శ్రావ్య.. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు ఆర్జీవీ బంధువని తెలుస్తుంది. శ్రీకాంత్ ఇటీవలే కాబోయే భార్యతో కలిసి పెళ్లి షాపింగ్ చేశాడు.
నగరంలోని ప్రముఖ వెడ్డింగ్ కలెక్షన్ మాల్ అయిన గౌరీ సిగ్నేచర్స్‌లో శ్రీకాంత్, శ్రావ్య జోడీ సందడి చేశాడు. వీరిద్దరి షాపింగ్‌కు సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ మాజీ నంబర్ వన్ ర్యాంకర్ అయిన శ్రీకాంత్.. ప్రస్తుత వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment