
అర్జున్ హలాకుర్కి
Asia Senior Wrestling Championship- ఉలాన్‌బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత రెజ్లర్లు మూడు కాంస్య పతకాలు సాధించారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ హలాకుర్కి (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలను దక్కించుకున్నారు.
కాంస్య పతక బౌట్‌లలో కర్ణాటకకు చెందిన అర్జున్ 10–7తో దవాబంది ముంఖ్‌ఎర్డెన్ (మంగోలియా)పై... నీరజ్ 7–4తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్)పై... సునీల్ 9–1తో బత్బెయర్ లుత్బాయర్ (మంగోలియా)పై నెగ్గారు. 77 కేజీల విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సజన్ 1–11తో సకురాబా (జపాన్) చేతిలో ఓడిపోయాడు.
చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు!