photo marfing
-
'లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం'
సాక్షి, హైదరాబాద్: ‘వనిత’ (పేరు మార్చాం) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిని. వ్యక్తిగత అవసరాల కోసం ఫాస్ట్ కాయిన్ అనే లోన్ యాప్‌లో రూ.18 వేలు రుణం తీసుకుంది. నెల రోజుల తర్వాత చక్రవడ్డీ కలుపుకొని రూ.25 వేలు చెల్లించింది. కానీ, యాప్‌లో మాత్రం పేమెంట్ జరిగినట్లు చూపించలేదు. తెల్లారి ఆమెకు యాప్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వచ్చింది ‘మీరింకా లోన్ కట్టలేదని, త్వరగా చెల్లించకపోతే మీ న్యూడ్ ఫొటోలను మీ కుటుంబీకులకు పంపిస్తామని’ బెదిరించారు. తెల్లారి అన్నంత పనీ చేసేశారు. దీంతో బాధితురాలు వెంటనే యాప్‌లో రూ.25 వేలు చెల్లించింది. ఇలా పలుమార్లు నిర్వాహకుల బెదిరింపులతో రూ. 2 లక్షలపైనే చెల్లించినా.. వదలకపోవటంతో బాధితురాలు నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోన్ యాప్ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. వరుస అరెస్ట్‌లు, యాప్ బ్యాన్లతో ఏడాది పాటు కార్యకలాపాలకు దూరంగా ఉన్న లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 60కి పైగా లోన్ యాప్ వేధింపుల కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. చదవండి: (ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..) ఢిల్లీ, బెంగళూర్ల నుంచి నిర్వహణ లోన్ యాప్ యజమానులు చైనాలో ఉంటారు. కానీ బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆపరేట్ చేయిస్తుంటారని సైబర్ క్రైమ్స్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెలకు రూ.10 వేలు, రూ.15 వేలు వేతనం ఇస్తూ.. వారితో బాధితులు, వారి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటారని వివరించారు. కాల్ సెంటర్ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేస్తున్నామని, ఇటీవలే చంఢీఘడ్‌లోని అక్రమ కాల్ సెంటర్ నిర్వాహకులను అరెస్ట్ చేసి. జైలుకు పంపించామన్నారు. లోన్ యాప్ బాధితుల్లో 10 శాతం వరకు మహిళలు ఉన్నట్లు తెలిపారు. రుణ గ్రహీతలు పురుషులైతే వాళ్ల కాంటాక్ట్ లిస్ట్‌లోని ఆడవాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరిస్తుంటారన్నారు. 600 పైగా చట్టవిరుద్ధ లోన్ యాప్స్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 1,100లకు పైగా ఆన్లైన్ లోన్ యాప్‌లు ఉన్నాయి. వీటిలో 600 యాప్స్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను సాగిస్తున్నాయని వెల్లడించింది. ఫాస్ట్ కాయిన్, రిచ్క్యాష్, క్విక్ క్యాష్, సూపర్ వాలెట్, లక్కీ వాలెట్, స్పీడ్ లోన్, హ్యాపీ వాలెట్, క్యాష్ ఫిష్, రూపియా బస్, లైవ్ క్యాష్, బెస్ట్ పైసా, రూపియా స్మార్ట్, రూపీ బాక్స్, లోన్ క్యూబ్, క్రెడిట్ బాక్స్ వంటివి ప్రముఖమైనవి. ఆయా యాప్స్‌ను బ్యాన్ చేయాలని గూగుల్‌కు లేఖ రాసింది. -
సరైన పనే చేశా: బిష్ణోయ్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్చి బుల్లి బాయ్ యాప్‌లో వేలానికి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ తన పనిని సమర్థించుకున్నాడు. ముస్లిం మహిళల్ని వేధించడం కరెక్టేనని విచారణలో చెబుతున్నట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. బుల్లి బాయ్ యాప్‌ను రూపొందించడానికి వినియోగించిన పరికరాలన్నీ నీరజ్ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యాప్‌ని నీరజ్ నవంబర్‌లో రూపొందించాడని డిసెంబర్ 31న ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక నీరజ్ ముస్లిం మహిళలనే కాకుండా ముంబై పోలీసుల్ని హేళన చేయడానికి ట్విట్టర్లో పలు ఖాతాలను సృష్టించాడు. ముస్లిం మహిళల ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వాటిని అమ్మలేదని, నీరజ్ అసలు ఉద్దేశ్యం వారిని కించపరచి వేధించడమేనని పోలీసులు చెబుతున్నారు. భోపాల్‌లో వెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న నీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతనిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా యాజమాన్యం తెలిపింది. -
ఇన్‌స్టాగ్రామ్‌తో ఏడిపించాడు
సాక్షి, సిటీబ్యూరో: ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...మూసాపేటకు చెందిన వొరిసా సాయికుమార్ ఏడో తరగతితో చదువుకు స్వస్థి చెప్పి కూలీగా పని చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను ఇన్‌స్ట్రాగామ్‌లో పలువురు అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరించాడు. అదే తరహాలో ఓ బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు అప్లోడ్ చేసి ఉన్న ప్రొఫైల్ పిక్చర్‌ను డౌన్లోడ్ చేసుకున్న అతను ఆమె పేరును సరిపోలేలా నకిలీ ఖాతా క్రియేట్ చేసి ఆమె ప్రొఫైల్ పిక్చర్‌ను అప్లోడ్ చేశాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా నగ్న వీడియోలు పోస్టు చేశాడు. ఆ తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ స్నేహితుల ద్వారా ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను సేకరించి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పంపాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆతర్వాత బాధితురాలి తల్లి ఫొటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకొని మరో ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫొటోలు, వీడియోలు పంపాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నిందితుడు సాయికుమార్‌ను అరెస్టు చేశారు. -
ఫొటోలతో వైద్యుడి వికృత చేష్టలు
సాక్షి, సిటీబ్యూరో: వృత్తిరీత్యా వైద్యుడైన అతను విపరీత ధోరణి ప్రదర్శించాడు... మెడిసిన్‌లో తనకు క్లాస్మేట్ అయిన వివాహిత ఫొటోలను మార్ఫింగ్ చేశాడు... వాటిని ఆమె తరఫు వారికే పంపి కాపురంలో చిచ్చుపెట్టాడు... బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఎల్బీనగర్కు చెందిన సదరు వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్కు చెందిన సోహెబ్ అలీతో పాటు నగరానికి చెందిన మరికొందరు కొన్నేళ్ల క్రితం చైనాలో ఎంబీబీఎస్ చదివారు. అప్పట్లో ఇతడికి క్లాస్మేట్స్ అయిన యువతీ,యువకుడు ఆపై వివాహం చేసుకుని భార్యభర్తలుగా మారారు. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఎంబీబీఎస్‌లో తన క్లాస్‌మేట్స్‌తో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని భావించిన సోహెబ్ దీనికోసం కొత్తగా ఓ సెల్‌ఫోన్ నంబర్ తీసుకుని గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఇందులో బాధితురాలు, ఆమె భర్త సైతం సభ్యులుగా ఉన్నారు. కాలేజీ రోజుల్లో సదరు యువతితో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి వాటిని సదరు‘ఎంబీబీఎస్ గ్రూప్’లో పోస్ట్ చేశాడు. గ్రూప్ అడ్మిన్ ఎవరనేది సభ్యులు తెలియకుండా ఉండేందుకు కొత్త నంబర్‌తో దీనిని క్రియేట్ చేసిన అతను తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు క్లాస్‌మేట్స్‌కు తెలిసిన తన పాత నెంబర్‌తో తనకు తననూ ఓ సభ్యుడిగా యాడ్ చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడమే కాకుండా అందులో అభ్యంతరకరమైన తన భార్య ఫొటోలు, వీడియో లో పోస్ట్ చేయడంతో ఆమె భర్త అవాక్కయ్యాడు. దీనిపై భార్యను నిలదీయడంతో ఇద్దరి మధ్య స్ఫర్ధలు తలెత్తాయి. ఈ విషయం తనకు ఏమీ తెలియదని, ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో కూడా తనకు తెలియదని భర్తకు చెప్పడంతో ఆయన దీనిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని పసిగట్టిన నిందితుడు ఇందుకు విని యోగించిన సిమ్‌కార్డును ధ్వంసం చేసి ఆధారాలు చిక్కకుండా చేయాలని భావించాడు. అయితే సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోహెబ్ అలీ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. -
వేధింపుల కేసులో ‘ఫేస్బుక్’ ఫ్రెండ్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్లో ఫ్రెండ్స్‌గా పెరిగిన సన్నిహిత్యంతో దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సోమవారం వివరాలు వెల్లడించారు. 2017లో జీలన్ నోయల్ పేరుతో ఫేస్బుక్ ఖాతాను గమనించిన బాధితురాలు మెసేజ్ చేసింది. అయితే తాను గాయకుడు నోయల్ కాదని, అనంతపురం జిల్లాకు చెందిన జీలన్ అని ప్రతి సమాధానం పంపిన నిందితుడు జీలన్ బాషా ఫేస్బుక్ ఫ్రెండ్స్‌గా ఉందామని కోరాడు. ఆ తర్వాత ఇద్దరు ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా చాట్ చేసుకున్నారు. ఫోన్లో మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో బాధితురాలితో సాన్నిహిత్యం పెంచుకున్న నిందితుడు ఆమె వ్యక్తిగత ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల గత వారం రోజులుగా నిందితుడి ఫోన్‌కాల్స్, మెసేజ్‌లకు బాధితురాలు స్పందించలేదు. దీంతో కోపం పెంచుకున్న జీలన్ అభ్యంతరకర సందేశాలు, నగ్నచిత్రాలు ఆమెకు వాట్సాప్ చేశాడు. ఫేస్బుక్లో కూడా అభ్యంతర మెసేజ్‌లు పంపాడు.తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోతే ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్నచిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బాధితురాలితో పాటు ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేశారు. సాంకేతిక ఆధారాలతో ఇన్స్పెక్టర్ జలేందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడు జీలన్ బాషాను అనంతపురం జిల్లా, యెల్లనూర్‌లో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువచ్చారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. -
పోర్న్సైట్లో అప్లోడ్ చేస్తానని.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ పేరుతో మూడేళ్లుగా నమ్మించి యువతిని మోసం చేయడమే కాకుండా.. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తానని బెరించిన యువకుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలు.. హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురుని వినీష్ ప్రేమించానని నమ్మించాడు. మూడేళ్లుగా ప్రేమపేరుతో సన్నిహితంగా ఉన్నట్టు నటించాడు. అదే సమయంలో ఆమె తనతో ఉన్న కొన్ని ఫోటోలను తన వద్దే భద్రపరుచుకున్నాడు. యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో ఫోటోలు పెడతానని ఆమెను బెదిరించాడు. అంతటితో ఆగకుండా ప్రియురాలి తండ్రి పెద్ద వ్యాపారవేత్తకావడంతో అతడికి ఫోన్ చేసి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే నీ కూతురు ఫోటోలను పోర్న్సైట్లలో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై వీనీష్‌తో ప్రియురాలి తండ్రి రూ. కోటి ఒప్పందం కుదుర్చుకొన్నాడు. కోటి రూపాయాలను ప్రియురాలి తండ్రి నుండి వసూలు చేసుకోవాలని వీనీష్ ప్లాన్ చేసుకొన్నాడు. అయితే ఈ విషయాన్ని ప్రియురాలి తండ్రి పోలీసులకు చెప్పడంతో, పోలీసులు సినిమా సన్నివేశాలను తలపించేలా పక్కా ప్లాన్‌తో నిందితుల కోసం స్కెచ్ గీశారు. దీనిలో భాగంగానే ప్రియురాలి తండ్రి ఒప్పందంలో భాగంగా కోటి రూపాయాల్లో తొలుత రూ.25 లక్షలు చెల్లిస్తానని వీనీష్‌ను నమ్మించారు. ఈ రూ.25 లక్షలను తీసుకొనేందుకు వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వచ్చారు. అయితే వీనీష్ అతని ఇద్దరు స్నేహితులు వ్యాపారవేత్త నుండి రూ. 25 లక్షలు తీసుకొన్న తర్వాత సీసీఎస్ పోలీసులు వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన వారు వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ హైవే వరకు వెంటాడి వారిని పట్టుకుని, రూ. 25 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతామని బెదిరింపుల వస్తున్నాయని, తమకు ఆత్మహత్యే శరణ్యమని యువతి తండ్రి ఆగష్టు 9న తమకు ఫిర్యాదు చేశారని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ముందుగా టవర్ లొకేషన్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేస్తే వారు ఒక్కో ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిందన్నారు. దీంతో ఓ పథకం ప్రకారం యువతి తండ్రి సహకారంతో నిందితులను పట్టుకోగలిగామని తెలిపారు. 3 సెల్ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పర్సనల్ ఫోటోలు, డేటా విషయంలో జాగ్రత్త వహించాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి..ఐదు కోట్లు డిమాండ్
-
ఎంపీ బాల్కసుమన్‌పై లైంగిక ఆరోపణలు అవాస్తవం
-
బాల్క సుమన్ భార్య ఫొటో మార్ఫింగ్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఫేస్బుక్లో ఉన్న ఎంపీ బాల్కసుమన్ భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత అక్కాచెల్లెళ్లు. వీరు కొంతకాలంగా ఎంపీ సుమన్‌కు ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఇబ్బంది పెడుతున్నారు. ఇవి కాస్త శృతిమించడంతో జనవరి 27న ఎంపీ మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఫిబ్రవరి 6న అక్కాచెల్లెళ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు. పైగా సుమన్ తనను పెళ్లి చేసుకున్నారని సంధ్య అసత్య ప్రచారం ప్రారంభించింది. ఈ క్రమంలో మే 31న హైదరాబాద్ నందీనగర్ లోని ఎంపీ ఇంటికి తన ఇద్దరు సోదరులు, సోదరితో కలసి వెళ్లి దౌర్జన్యం చేశారు. ఎంపీ సహాయకుడు సునీల్ ఫిర్యాదు మేరకు జూన్ 7న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురిపై కేసు నమోదు చేశారు. అయినా పద్ధతి మార్చుకోని సంధ్య.. ఫేస్బుక్లో సుమన్ తన భార్యాపిల్లలతో దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆయన భార్య స్థానంలో తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ‘బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రధానికి ఇద్దరు జర్నలిస్టుల ఫిర్యాదు, బాధితులపై తప్పుడు కేసు నమోదు’ అంటూ ప్రచారం జరిగింది. ఎంపీపై అసత్య ప్రచారం: సీఐ ఎంపీ సుమన్ మహిళలను లైంగికంగా వేధించారని వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సీఐ మహేశ్ తెలిపారు. జనవరి 18న కేసు నమోదు చేసుకొని విచారించగా ఎంపీ సుమన్ తన ఫేస్బుక్లో పెట్టిన ఫొటోలను సంధ్య, విజేత కాపీ చేశారని, ఆయన భార్య స్థానంలో సంధ్య ఫొటోలతో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని తెలిపారు. ఈ మేరకు వారిద్దరిపై 420, 292ఎ, 419, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కాచెల్లెళ్లు మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్, చంద్రాపూర్‌కు చెందిన పలువురు వ్యాపారులు, వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్లు తేలిందని సీఐ వివరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాల్లో పెట్టి ప్రచారం చేసే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
మార్ఫింగ్ ఫొటోలతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు
మెదక్ జోన్: డబ్బు కోసం కొందరు కల్యాణలక్ష్మి పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు. పెళ్లి ఫొటోలను మార్ఫింగ్ చేయించి దరఖాస్తు చేసుకొని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వేరే దంపతుల ఫొటోలకు తలలను మార్చి దర ఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల మెదక్ రెవెన్యూ కార్యాలయంలో మార్ఫింగ్ చేసిన పెళ్లి ఫొటోను అధికారులు గుర్తించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వ హించే లక్ష్మణ్ అనే ఉద్యోగి అన్న కూతురు సౌజన్య పెళ్లిని 2017లో జోగిపేట మండలం చిన్నచింతకుంట గ్రామంలో వివాహం జరిపించారు. ఆ దంపతుల ఫొటోలోని తలలను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోతో ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడే విధులు నిర్వహించే లక్ష్మణ్ ఆ ఫొటోలో దంపతుల వెనకాల ఉన్న తన ఫొటోను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫొటోలోని బంధువులు, ఆ దంపతులు తన అన్న కూతురు, అల్లుడిగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బొమ్మర్ది బాలయ్య తన కూతురు లక్ష్మిని దుబ్బాక గ్రామానికి చెందిన రాజుకి ఇచ్చి చర్చిలో వివాహం జరిపించినట్లు సమాచారం. క్రిస్టియన్లకు కల్యాణలక్ష్మి పథకం వర్తించదనే ఆలోచనతో మెదక్‌లోని ఓ ఫొటో స్టూడియోలో సౌజన్య దంపతుల పెళ్లి ఫొటోకు లక్ష్మి, రాజుల తలలను మార్ఫింగ్ చేయించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాడు. మెదక్‌లోని పలు ఫొటో స్టూడియోల్లో ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించినా మెదక్‌లో మాత్రం య«థావిధిగా తయారు చేస్తున్నారు. విచారణ జరుపుతున్నాం... ఈ విషయంపై విచారణ జరుపుతున్నాం. పెళ్లి ఫొటోలను ఎందుకు మార్ఫింగ్ చేయాల్సి వచ్చిందో విచారించి చర్యలు తీసుకుంటాం. – యాదగిరి, తహసీల్దార్, మెదక్ -
మిస్డ్‌కాల్‌తో పరిచయం..ఆపై వేధింపులు
చెన్నై: ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతానని ఇంజినీరింగ్ విద్యార్థినిని బెదిరించిన బీబీఏ పట్టభద్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరు జిల్లా అవినాశీ సమీపం పెరియ పాళయంకు చెందిన బీబీఏ పట్టభద్రుడైన భరత్‌కుమార్ నిరుద్యోగి. నామక్కల్ జిల్లా పుదుసత్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న కీర్తన (22)తో మిస్డ్‌కాల్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో తమ ఫొటోలను ఇచ్చిపుచ్చుకునేవారు. విషయం కీర్తన తల్లికి తెలియడంతో ఇద్దర్నీ మందలించింది. దీంతో కీర్తన సెల్ నంబర్ మార్చి భరత్‌కుమార్‌తో స్నేహాన్ని తెంచుకుంది. కీర్తన సెల్‌ఫోన్ నంబరు ఇవ్వాల్సిందిగా ఆమె సమీప బంధువు, తల్లిని భరత్ ఒత్తిడి చేశాడు. సెల్‌ఫోన్ నంబరు ఇవ్వకుంటే తన వద్దనున్న కీర్తన ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, వాట్సాప్‌లలో పెడతానని బెదిరించాడు. కీర్తన తల్లి సంగీత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా భరత్‌కుమార్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కీర్తనతో స్నేహం చేశాను, ఆమె ద్వారా తల్లి సంగీత, బంధువు దేవీ ఫోన్ నంబర్లను సేకరించి వారితో కూడా మాట్లాడటం ప్రారంభించానని భరత్ తెలిపాడు. కీర్తన సెల్‌ఫోన్ నంబర్ మార్చడంతో సంగీత, దేవీలను బెదిరించినట్లు భరత్ అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు నామక్కల్ కోర్టులో హాజరుపరిచి సేలం జైలుకు తరలించారు.