మెదక్ జోన్: డబ్బు కోసం కొందరు కల్యాణలక్ష్మి పథకాన్ని అభాసుపాలు చేస్తున్నారు. పెళ్లి ఫొటోలను మార్ఫింగ్ చేయించి దరఖాస్తు చేసుకొని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వేరే దంపతుల ఫొటోలకు తలలను మార్చి దర ఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల మెదక్ రెవెన్యూ కార్యాలయంలో మార్ఫింగ్ చేసిన పెళ్లి ఫొటోను అధికారులు గుర్తించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వ హించే లక్ష్మణ్ అనే ఉద్యోగి అన్న కూతురు సౌజన్య పెళ్లిని 2017లో జోగిపేట మండలం చిన్నచింతకుంట గ్రామంలో వివాహం జరిపించారు.
ఆ దంపతుల ఫొటోలోని తలలను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోతో ఇటీవల మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడే విధులు నిర్వహించే లక్ష్మణ్ ఆ ఫొటోలో దంపతుల వెనకాల ఉన్న తన ఫొటోను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫొటోలోని బంధువులు, ఆ దంపతులు తన అన్న కూతురు, అల్లుడిగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బొమ్మర్ది బాలయ్య తన కూతురు లక్ష్మిని దుబ్బాక గ్రామానికి చెందిన రాజుకి ఇచ్చి చర్చిలో వివాహం జరిపించినట్లు సమాచారం.
క్రిస్టియన్లకు కల్యాణలక్ష్మి పథకం వర్తించదనే ఆలోచనతో మెదక్‌లోని ఓ ఫొటో స్టూడియోలో సౌజన్య దంపతుల పెళ్లి ఫొటోకు లక్ష్మి, రాజుల తలలను మార్ఫింగ్ చేయించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాడు. మెదక్‌లోని పలు ఫొటో స్టూడియోల్లో ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. అలాంటివారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఫ్లెక్సీలను నిషేధించినా మెదక్‌లో మాత్రం య«థావిధిగా తయారు చేస్తున్నారు.
విచారణ జరుపుతున్నాం...
ఈ విషయంపై విచారణ జరుపుతున్నాం. పెళ్లి ఫొటోలను ఎందుకు మార్ఫింగ్ చేయాల్సి వచ్చిందో విచారించి చర్యలు తీసుకుంటాం. – యాదగిరి, తహసీల్దార్, మెదక్
Comments
Please login to add a commentAdd a comment