
చికిత్స పొందుతున్న మహమ్మద్ హనీఫ్, యూసఫ్
సాక్షి, పెండ్లిమర్రి, కడప: మొయిళ్లకాల్వ గ్రామం మసీదు మత గురువు మహమ్మద్ హనీఫ్, ఆయన కుమారుడు యూసఫ్‌పై అదే గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కత్తితో దాడి చేశాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మహమ్మద్ హనీఫ్‌కి, మహబుబ్ బాషాకు గతంలో గొడవ అయ్యింది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని గురువారం తెల్లవారుజామను తండ్రీకొడుకుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరినీ కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.