
కర్ణాటక: నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి అర్చకుడు మృతి చెందిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా కమలశీలలో జరిగింది. శేషాద్రి ఐతాళ్ (75) బుధవారం ఉదయం కమలశీల గుడికి వెళ్లాడు. పక్కనే ఉన్న కుబ్బా నదిలో నీరు తేవడానికి వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నూరు మీటర్ల దూరంలో శవం బయట పడింది.
వర్షంలోనే లైన్‌మ్యాన్ మరమ్మతులు
దక్షిణ కన్నడ జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వానలు పడుతున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మంగళూరు సమీపంలోని దేరళకట్టలో కరెంట్ వైర్లు తెగిపోయి 40 శాతం ఇళ్లకు కరెంట్ కట్ అయ్యింది. వర్షంలోనే లైన్‌మ్యాన్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.