రౌడీపై మహిళ ఫిర్యాదు
బనశంకరి: వివాహితను లోబర్చుకుని ప్రైవేటు ఫోటోలు, వీడియోలను పెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్న రౌడీషీటర్ దారుణమిది. బాధిత మహిళ (37) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని బ్యాడరహళ్లి ఠాణాలో రౌడీషీటర్ సురేశ్ అలియాస్ కుణిగల్‌పై కేసు నమోదైంది. వివరాలు..
బాధితురాలి ఇంటిలో రౌడీషీటర్ కొన్నేళ్లుగా బాడుగకు ఉంటున్నాడు. క్యాబ్‌డ్రైవరు అని చెప్పి ఆమెతో పరిచయం చేసుకున్నాడు, అది కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో మొబైల్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. అతని మొబైల్‌లో పలువురు మహిళలు వీడియోలు ఉండడం చూసి ఆమె గొడవచేసి దూరం పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రౌడీషీటర్ మహిళను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు వసూలు చేశాడు.
వీడియోలను ఆమె భర్త, కుటుంబసభ్యులకు పంపించి పరువు తీశాడు. నవంబరు 30 తేదీన వాల్మీకి సర్కిల్ వద్ద మహిళను అడ్డుకుని ఎందుకు ఫోన్ చేస్తే మాట్లాడడం లేదని బెదిరించి, మొబైల్‌ఫోన్, కారు, 18 గ్రాములు బంగారునగలు దోచుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఇదివరకే అతడు మరో నేరంలో పరప్పన జైలులో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment