మరో బాలింత మృత్యువాత
బనశంకరి: ఓ కసాయి తల్లి రెండునెలల పసికందును చెరువులో పడేసి హత్య చేయడానికి ప్రయత్నించింది. తల్లి అనే పదానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. ఈ ఘటన బెళగావి నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆడపాపకు పుట్టుకతోనే మూర్ఛ వస్తుండేవి. చికిత్స చేయిస్తున్నా నయం కాలేదని, ఇటువంటి పాపను ఎలా పోషించాలని విసుక్కుంది.
వెనుకా ముందు ఆలోచించకుండా తల్లి శాంతా కరవినకుప్పి (35).. ఆ పసిబిడ్డను సమీప చెరువులోకి పడేసింది. అక్కడే పశువులను కడుగుతున్న కొందరు గమనించి పాపను బయటకు తీసి బెళగావిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మహిళను మాళమారుతి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment