ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించి.. | Karnataka: Police Arrested Honey-Trapping Gang In Bengaluru | Sakshi

ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించి..

Dec 28 2024 1:07 AM | Updated on Dec 28 2024 1:06 PM

-

ముఠా అరెస్టు, పరారీలో యువతి

కృష్ణరాజపురం: సిలికాన్‌ సిటీ, కోలారులో శ్వేతా గౌడ అలియాస్‌ గులాబ్‌జామూన్‌ అనే కిలాడీ హనీట్రాప్‌ దందా మరుగున పడక ముందే మరో వలపు వల వెలుగుచూసింది. 21 ఏళ్ల యువతితో కలిసి మోసగాళ్లు ఓ కాంట్రాక్టరు (55)ను హనీ ట్రాప్‌ చేశారు. బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించి..
వివరాలు.. దోపిడీ గ్యాంగ్‌కు చెందిన సంతోష్‌, అజయ్‌, జయరాజ్‌ అనే ముగ్గురు ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ను లక్ష్యం చేసుకున్నారు. నయన అనే యువతిని అతనికి పరిచయం చేశారు. ఆమె నిత్యం ఫోన్లో చనువుగా మాట్లాడేది. తర్వాత ఒక రోజు టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది. దీంతో ఈ నెల 9వ తేదీన కాంట్రాక్టరు ఆమె ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికే నిందితులు పోలీసుల దుస్తుల్లో వచ్చారు. ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారా? మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు. అతనిని కొట్టి ఫోటోలు తీసుకున్నారు. 

మేడంతో సెటిల్‌మెంట్‌ చేసుకో అని బెదిరించారు. అతని జేబులో ఉన్న రూ.29 వేల నగదు, ఫోన్‌పే నుంచి మరో రూ.26 వేలు, ఒంటిపై ఉన్న సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని లాక్కుని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని బాధితుడు యువతికి సూచించగా, అలా చేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. చివరకు ఒక్కడే బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన సంతోష్‌, అజయ్‌, జయరాజ్‌లను పోలీసులు బంధించారు. పరారీలో ఉన్న యువతి నయన కోసం గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement