వీడియోలు చూపి బాలికపై దురాగతం | - | Sakshi
Sakshi News home page

వీడియోలు చూపి బాలికపై దురాగతం

Published Wed, Feb 5 2025 1:34 AM | Last Updated on Wed, Feb 5 2025 7:48 AM

వీడియోలు చూపి బాలికపై దురాగతం

వీడియోలు చూపి బాలికపై దురాగతం

యశవంతపుర: బాలిక (15)పై అత్యాచారం చేసి వీడియోలను తీసి వాటి ద్వారా తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు కామాంధులను గదగ్‌ జిల్లా గజేంద్రగడ తాలూకా నరేగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సులేమాన్‌, అల్తాఫ్‌ అరెస్టయినవారు.

వివరాలు.. సులేమాన్‌ ఓ బాలికను ప్రేమపేరుతో లోబర్చుకున్నాడు. ఊరికి దూరంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడేవాడు. ఆ వీడియోలను తీసుకుని స్నేహితుడు అల్తాఫ్‌కు ఇచ్చాడు. అతడు కూడా వీడియోలను ద్వారా బాలికను భయపెట్టి అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికై నా చెబితే వీడియోలను వైరల్‌ చేస్తామని బాలికను బెదిరించారు. 

ఈ దారుణంపై బాలిక తల్లిదండ్రులతో మొరపెట్టుకోగా 2024 డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేరంలో 9 మంది నిందితులున్నట్లు తాలూకాలో ముమ్మరంగా ప్రచారం జరిగింది. విచారణ సాగిస్తున్నట్లు ఎస్పీ బీఎస్‌ నేమగౌడ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement