rowdy sheeter murder
-
రౌడీషీటర్‌తో వివాహేతర సంబంధం.. చివరికి ఇలా..!
బనశంకరి: వివాహితను లోబర్చుకుని ప్రైవేటు ఫోటోలు, వీడియోలను పెట్టుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్న రౌడీషీటర్ దారుణమిది. బాధిత మహిళ (37) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని బ్యాడరహళ్లి ఠాణాలో రౌడీషీటర్ సురేశ్ అలియాస్ కుణిగల్పై కేసు నమోదైంది. వివరాలు.. బాధితురాలి ఇంటిలో రౌడీషీటర్ కొన్నేళ్లుగా బాడుగకు ఉంటున్నాడు. క్యాబ్డ్రైవరు అని చెప్పి ఆమెతో పరిచయం చేసుకున్నాడు, అది కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో మొబైల్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. అతని మొబైల్లో పలువురు మహిళలు వీడియోలు ఉండడం చూసి ఆమె గొడవచేసి దూరం పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రౌడీషీటర్ మహిళను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేశాడు. వీడియోలను ఆమె భర్త, కుటుంబసభ్యులకు పంపించి పరువు తీశాడు. నవంబరు 30 తేదీన వాల్మీకి సర్కిల్ వద్ద మహిళను అడ్డుకుని ఎందుకు ఫోన్ చేస్తే మాట్లాడడం లేదని బెదిరించి, మొబైల్‌ఫోన్, కారు, 18 గ్రాములు బంగారునగలు దోచుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఇదివరకే అతడు మరో నేరంలో పరప్పన జైలులో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
పోలీసు కాల్పుల్లో రౌడీ షీటర్ మృతి
దొడ్డబళ్లాపురం: హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ పోలసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈఘటన దొడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు రౌడీషీటర్ నరసింహమూర్తి ఈనెల 10వ తేదీన హేమంత్ గౌడ అనే యువకుడిని చర్చలకు పిలిచాడు. అనంతరం అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం దొడ్డ పట్టణ శివారులో ఒక చోట నిందితుడు నరసింహమూర్తి దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే నిందితుడు పోలీసులపై దాడికి యతి్నంచాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నరసింహమమూర్తికి తగలడంతో మృతి చెందాడు. కేసు దర్యాపులో ఉంది. -
రౌడీల గ్యాంగ్‌వార్
అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని ఈదరపల్లి గ్రామానికి చెందిన రౌడీషీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ (24) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన అడపా సాయి లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈదరపల్లి శ్మశానంలో ఈ సంఘటన జరిగింది. అవివాహితుడైన హతుడు కిషోర్‌పై పట్టణ పోలీసు స్టేషన్లో పలు కేసులున్నాయి. ఇటీవల కొన్ని రౌడీ గ్యాంగ్‌లు తరచుగా ఆధిపత్య పోరుకు దిగుతున్నాయి. వీటిల్లో ఉన్న రౌడీలు పూటుగా తాగి, అప్పుడప్పుడు ఘర్షణలకు దిగుతున్నారు. ఇటువంటి ఘర్షణలోనే కిషోర్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారని పోలీసులు చెప్పారు. అమలాపురం డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ కథనం ప్రకారం.. రౌడీ గ్యాంగ్‌లకు చెందిన కొంత మంది యువకులు తాగిన మైకంలో ఈదరపల్లి రంగా విగ్రహం వద్ద గురువారం రాత్రి ఘర్షణకు దిగారు. ఆ గొడవలు రాత్రి సద్దుమణిగాయి. శుక్రవారం ఉదయం వారు మళ్లీ అదే చోట ఘర్షణకు దిగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి, రంగా విగ్రహం వద్ద ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ఈలోగా ఈదరపల్లి శ్మశానం వద్ద రౌడీషీటర్ కిషోర్, అతడి స్నేహితుడు అడపా సాయిలక్ష్మణ్పై ప్రత్యర్థులు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న కిషోర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తూండగా ప్రాణాలు వదిలాడు. గాయపడిన సాయి లక్ష్మణ్‌ను తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురి పేర్లు వెల్లడి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన సాయి లక్ష్మణ్‌ను డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, పట్టణ సీఐ డి.దుర్గాశేఖరరెడ్డి ఏరియా ఆస్పత్రిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేట్మెంట్ నమోదు చేశారు. ఈదరపల్లికి చెందిన సతీష్, ఇంద్ర, పట్టణంలోని కొంకాపల్లికి చెందిన రౌడీ షీటర్ ఇండిగుల ఆనంద్, అల్లవరం మండలం గూడాలకు చెందిన సుధీర్‌తో పాటు మరి కొంత మంది తమపై దాడి చేశారని లక్ష్మణ్ తెలిపాడు. వీరిలో ఇండిగుల ఆనంద్ టీడీపీ సానుభూతిపరుడు. టీడీపీ అమలాపురం నియోజకవర్గ నాయకుడు, మాజీ రౌడీ షీటర్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ హత్య తాగిన మైకంలో చెలరేగిన ఘర్షణల వల్లే జరిగిందని డీఎస్పీ అంబికా ప్రసాద్ చెప్పారు. సాయిలక్ష్మణ్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం పోలీసు అధికారులు ఈదరపల్లి శ్మశానం వద్దకు చేరుకున్నారు. ఈ సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారు. గాయపడిన సాయి లక్ష్మణ్ పరిస్థితిని జిల్లా ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా కూడా స్వయంగా పరిశీలించారు. రెండు పోలీసు బృందాలు సాయి లక్ష్మణ్ చెప్పిన ప్రత్యర్థుల ఆచూకీ తెలుసుకునేందుకు ఇద్దరు ఎస్సైలతో కూడిన రెండు పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. ఎస్సై హరీష్‌కుమార్, ఎస్సై ప్రభాకర్‌ల ఆధ్వర్యాన రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టాయి. కాగా, ఈ సంఘటనలో హత్యకు గురైన రౌడీషీటర్ కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కిషోర్ అవాహితుడు. తరచూ వివాదాలకు దిగుతూంటాడని పోలీసులు చెప్పారు. హత్యకు నిరసనగా దుకాణం దహనం రౌడీ షీటర్ పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ హత్యను నిరసిస్తూ అతడి వర్గానికి చెందిన కొందరు స్థానిక ఎర్ర వంతెన వద్ద ఉన్న ఓ దుకాణాన్ని శుక్రవారం రాత్రి దహనం చేశారు. సప్తగిరి అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న టీడీపీ నాయకుడు, మాజీ రౌడీ షీటర్ గంధం పల్లంరాజుకు చెందిన ఈ దుకాణాన్ని కిషోర్ వర్గీయులు దహనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. దహనమవుతున్న దుకాణం వద్దకు డీఎస్పీ అంబికా ప్రసాద్ చేరుకుని స్థానికులను విచారించారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి దుకాణానికి నిప్పు పెట్టినట్టు స్థానికులు చెప్పారు. షాపు దహనానికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో పక్కనున్న దుకాణాలు కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. -
రౌడీషీటర్ దారుణ హత్య... కీలకపాత్ర పొషించిన మహిళ!
నరసరావుపేట రూరల్: చిలకలూరిపేట రోడ్డులోని ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ బాజీ (35) దారుణ హత్యకు గురయ్యాడు. 2021లో జరిగిన హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మహిళ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ షేక్ బాజీపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2021 సెప్టెంబర్ 13న ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన షేక్ సుభాని హత్య కేసులోనూ ప్రధాన నిందితుడు. ఈ కేసులో సయ్యద్ పీర్‌వలి ఉరఫ్ అల్లాకసమ్ మరో నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరూ అప్పట్లో అరైస్టె మూడు నెలలు సబ్‌జైలులో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో సుభాని తల్లి జాన్‌బీ, ఆమె రెండో కుమారుడు హుస్సేన్, మరికొందరు కలిసి చిత్రాలయ టాకీస్ సెంటర్ సమీపంలో అల్లాకసమ్ను అదే ఏడాది డిసెంబర్ 21న హత్యచేశారు. ఈ కేసులో జాన్బీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఐదు నెలలు సబ్‌జైలులో ఉన్న అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తన కుమారుడిని హతమార్చిన బాజీ కోసం జాన్‌బీ, ఆమె అనుచరులు నిఘాపెట్టారు. విషయం తెలుసుకొన్న బాజీ కొంతకాలంగా చిలకలూరిపేటలోని తన అత్త ఇంట్లో తలదాచుకుంటున్నాడు. శపథం చేసి వరుస హత్యలు! బాజీ అదే కాలనీకి చెందిన జాన్బీతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జాన్‌బీ కుమారుడు సుభానిని బాజీ, అతని స్నేహితుడు అల్లాకసమ్ కలిసి హత్యచేశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారిని వదిలేది లేదని జాన్‌బీ కుమారుడి మృతదేహం వద్ద పోలీసుల సమక్షంలోనే శపథం చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడి హత్యకేసులో ప్రధాన నిందితులు ఇద్దరిని ఒకరి తరువాత మరొకరిని హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు. పథకం ప్రకారం.. అల్లాకసమ్ హత్య అనంతరం నరసరావుపేట నుంచి తన మకాంను బాజీ చిలకలూరిపేటకు మార్చాడు. కోర్టు వాయిదాలకు రావాలన్నా అనుచరుల రక్షణతో వచ్చి వెళ్తున్నాడు. దీంతో అక్కడ బాజీని హతమార్చడం కష్టమని భావించి రాజీ మార్గం ద్వారా జాన్‌బీ పథకం అమలు చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా కొన్ని రోజులుగా తిరిగి బాజీతో సన్నిహితంగా ఉంటూ హత్యకు పథక రచన చేసినట్టు సమాచారం. మంగళవారం రాత్రి బాజీని ఎస్ఆర్కేటీ కాలనీకి పిలిపించి ఫూటుగా మద్యం తాగించి.. ఆ తరువాత అతడిపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడిచేసి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకువెళ్లి అక్కడ గోతిని తీసి మృతదేహాన్ని పెట్రోల్‌తో తగులబెట్టి పూడ్చివేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్ఐ బాలనాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు. పోలీసుల అదుపులో నిందితులు.. హత్య అనంతరం నిందితులు రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. జాన్బీతోపాటు మరో నలుగురు హత్యలో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
నిజామాబాద్: ఎడపల్లి మండల కేంద్ర శివారు నిజామాబాద్ రోడ్డులో రౌడీ షీటర్ ఆరిఫ్ డాన్‌ను ప్రత్యర్థులు పట్టపగలు హత్య చేశారు. ఆరిఫ్ డాన్ గురువారం ఓ దొంగతనం కేసులో బోధన్ కోర్టుకు పేషీపై వెళ్లాడు. కోర్టు వాయిదా పడటంతో తిరిగి నిజామాబాద్‌కు స్నేహితుడు బుల్లెట్ ఖాదర్, మరో ఇద్దరితో కలిసి రెండు బైక్‌లపై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరిఫ్ డాన్, బుల్లెట్ ఖాదర్ కలిసి వస్తున్న బుల్లెట్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడిపోయారు. లారీలోంచి ఎనిమిది మంది దిగి వీరిద్దరిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఆరిఫ్‌డాన్ రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే చనిపోయాడు. బుల్లెట్ ఖాదర్ కాలు విరిగింది. తలపై కత్తిపోట్టు పడ్డాయి. వీరివెంట మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు పారిపోయినట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని ఏసీపీ కిరణ్‌కుమార్, ఇద్దరు సీఐలు పరిశీలించారు. ఏసీపీ మాట్లాడుతూ ఆరిఫ్ ఓ దొంగతనం కేసులో బోధన్కోర్టుకు వెళ్లి వస్తుండగా ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 1న నగర శివారులోని సారంగపూర్ వద్ద జరిగిన ఒకరి పుట్టిన రోజు వేడుకలకు ఆరిఫ్, ఇబ్రహీంఛావూస్ అలియాస్ జంగిల్ ఇబ్బు హాజరయ్యారు. సాంగ్ వేసే విషయంలో గొడవ జరిగి ఇబ్రహీంఛావూస్ను ఆరిఫ్‌డాన్ అతని అనుచరులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ కేసులో మూడు నెలల క్రితమే ఆరీఫ్డాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆరిఫ్ హత్యలో సిద్దు, కరీంలాల, సమద్, ఇర్ఫాన్, సోహెల్, హద్దు, చోటసోహైల్ అనే వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇబ్రహీంఛావూస్, ఆరిఫ్‌డాన్ గతంలో కలిసి ఇల్లీగల్ దందా చేసేవారని తెలిసింది. పంపకాలలో వచ్చిన తేడాతోనే ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని ఇద్దరూ హతం అయ్యారు. దీని వెనుక పాత రౌడీషీటర్ల హస్తంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రౌడీషీటర్ హత్య: మానసికంగా వేధిస్తున్నాడని స్నేహితుడే
సాక్షి, బొమ్మలసత్రం: వారం రోజుల క్రితం నంద్యాల పట్టణంలో జరిగిన రౌడీషీటర్ మారెడ్డి రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగించడంతో పాటు మానసికంగా వేధిస్తున్నాడని స్నేహితుడే దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి విలేకరులకు వివరించారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన మారెడ్డి రాజశేఖర్ ఇదే మండలం అల్లినగరం గ్రామానికి చెందిన సంజీవ కుమార్ స్నేహితులు, సమీప బంధువులు కూడా. వీరిద్దరు మరికొంత మందితో కలిసి 2013లో కర్నూలులో మైనింగ్ వ్యాపారి దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ సమయంలో కొంత బంగారు నగలు దొంగలించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా అపహరించిన బంగారు ఆభరణాల పంపకంలో ఇద్దరి మధ్య కొంత కాలం క్రితం వివాదం మొదలైంది. అప్పటి నుంచి రాజశేఖర్, సంజీవకుమార్ మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలో 2019లో త్రీటౌన్ పరిధిలోని రైల్వేస్టేషన్ సమీపంలో సంజీవ కుమార్ రోడ్డుపై వెళ్తుండగా రాజశేఖర్ కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా సంజీవ కుమార్‌కు అప్పు ఇచ్చిన వారితో చెక్‌బౌన్స్ కేసులు వేయించాడు. తనను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్న రాజశేఖర్‌ను అంతమొందించాలని సంజీవకుమార్ కుట్ర పన్నాడు. నంద్యాల పట్టణానికి చెందిన తన స్నేహితులు షేక్ మాలిక్‌బాషా, సుగర శెట్టి మదనగోపాల్, ఎడవల్లి కల్యాణ్, పల్లప శివరాజు, సుంకిశెట్టి రమేష్‌తో కలిసి హత్యకు పథకం వేశారు. ఈనెల 24వ తేదీ ఎన్జీఓస్ కాలనీలోని రామాలయం సమీపంలో ఉన్న రాజశేఖర్‌పై కత్తులు, ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సాయివాణి హాస్పిటల్ వద్ద ఆటోలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా రాజశేఖర్‌ను హత్య చేసినట్లు అంగీకరించారు. హత్యకు సంబంధం ఉన్న మరో యువకుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ కంబగిరిరాముడు, ఎస్ఐలు నజీర్ హుస్సేన్, పీరయ్యను డీఎస్పీ అభినందించారు. చదవండి: నేనేమీ చేశాను పాపం?! -
రౌడీషీటర్ దారుణహత్య
సాక్షి, కాగజ్‌నగర్‌టౌన్ : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన రౌడీషీటర్ గుర్రం సంతోష్ అలియాస్ సంతు (35) హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి గాంధీ చౌక్ మెయిన్ మార్కెట్ ఏరియాలో సంతోష్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టణ సీఐ డి.మోహన్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గోల్బజార్ ఏరియాకు చెందిన గుర్రం సత్యమ్మ, రమణమ్మ దంపతుల కుమారుడైన సంతోష్ ఇటీవల పీడీయాక్టు కేసులో జైలుశిక్ష అనుభవించి విడులైయ్యాడు. ప్రస్తుతం తల్లివద్దనే ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన సంతోష్‌పై 11 క్రిమినల్ కేసులు ఉన్నాయి. (పగబట్టిన ప్రేమ; సాఫ్ట్వేర్ యువతికి..! ) అందులో హత్య, హత్యాయత్నాలు, దాడులు వంటివి కూడా ఉన్నాయి. మే 7న జైలు నుంచి విడుదలైన సంతోష్ శనివారం రాత్రి తీరందాజ్‌రోడ్డు గల్లిలో మరికొంత మంది నేరస్తులతో కలిసి మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. వారి మధ్య ఉన్న పాత గొడవలపై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరు తమ ఇంటి నుంచి గొడ్డలి తీసుకువచ్చి సంతోష్‌పై దాడిచేశాడు. ఈ ఘటనలో సంతోష్‌కు తల, ఇతర భాగాల్లో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ వార్త పట్టణవ్యాప్తంగా విస్తరించడంతో ఈ హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలాన్ని కాగజ్‌నగర్ డీఎస్పీ బి.లక్ష్మీనర్సింహాస్వామి, సీఐ మోహన్, ఎస్సైలు రవికుమార్, తదితరులు పరిశీలించారు. సంఘటన స్థలంలో పడి ఉన్న పగిలిన మద్యం సీసాలు, ఇతర వివరాలను సేకరించారు. (కరోనా: రికార్డు స్థాయిలో కేసులు) ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. మరికొంత మంది అనుమానితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి తల్లి సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మోహన్ విలేకరులకు తెలిపారు. -
రౌడీషీటర్ కారసాని హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు!
సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సంచలనం రేకెత్తించిన కాంగ్రెస్ నేత, రౌడీషీటర్ కారసాని శ్రీనివాసరావు హత్య కేసులో ప్రధాన నిందితులైన నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలకు జీవిత ఖైదుతోపాటు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ గురువారం గుంటూరులోని ఆరో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎల్.శ్రీధర్ సంచలన తీర్పు ఇచ్చారు. మిగిలిన నిందితులను నిర్దోషులుగా వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రూరల్ మండలం పెదపలకలూరు గ్రామానికి చెందిన కారసాని శ్రీనివాసరావు తండ్రి వెంకటరత్నం నాయుడు గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన యేటిగడ్డ హనిమిరెడ్డి అనుచరుల చేతిలో 1990లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో హనిమిరెడ్డి అనుచరుడుగా ఉన్న నల్లపాటి అంకమ్మరావు ప్రధాన నిందితుడు. తన తండ్రిని హత మార్చారని పగపెంచుకున్న వెంకటరత్నం కుమారుడు కారసాని శ్రీనివాసరావు పథకం ప్రకారం గుంటూరులోని హరిహరమహల్ థియేటర్ సమీపంలో 1992లో హనిమిరెడ్డిని హత్య చేశాడు. మరో మూడేళ్ళ తరువాత నల్లపాటి అంకమ్మరావును కూడా కారసాని వర్గీయులు ఇమాంవలీతో పాటు మరో ఆరుగురు కలిసి హత్య చేశారు. దీంతో అంకమ్మరావు సోదరుడు నల్లపాటి శివయ్య కారసాని శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు. తన సోదరుడు అంకమ్మరావును దారుణంగా హతమార్చాడని, ఎలాగైనా కారసాని శ్రీనివాసరావును కూడా హతమార్చాలని పథకం రచించాడు. ముందుగా శ్రీనివాసరావుతో పాటు తన సోదరుడిని హతమార్చిన ఇద్దరు నిందితులను 2000 సంవత్సరంలో హతమార్చాడు. ఈ కేసులో శివయ్యకు జీవిత ఖైదు విధించగా, శిక్ష అనుభవించి 2007 అక్టోబరు 1న సెంట్రల్ జైలు నుంచి విడుదలై గుంటూరు చేరుకున్నాడు. అప్పటికే కారసాని కాంగ్రెస్ నేతగా పలు పదవులు నిర్వహిస్తున్నారు. పెదపలకలూరు, గుంటూరులోని కొరిటెపాడు కేంద్రాలుగా చేసుకుని తన అనుచరులతో కలిసి కార్యకలాపాలు సాగిస్తుండేవాడు. అతనిపై అప్పటికే 40 కేసులు నమోదు కావడంతోపాటు అరండల్‌పేట పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. పక్కా ప్రణాళికతో హత్య... తన సోదరుడు హత్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నల్లపాటి జైలు శిక్ష అనంతరం బయటకు వచ్చి వర్గాన్నికూడకట్టే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిస్థాయిలో హత్యకు రూపకల్పన చేసి పలుమార్లు కారసాని సంచరిస్తున్న ప్రాంతాలు, వెళ్తున్న ఊర్లు వివరాలును ఆరా తీశారు. గుంటూరు నుంచి ఆయా ప్రాంతాలకు వెళుతున్న క్రమంలో కూడా కారసానిని హతమార్చేందుకు రూరల్ ప్రాంతాలకు వెళిన సందర్భాలున్నాయి. అయితే కారసాని పక్కన అనుచరులు, ప్రజలు అధికంగా ఉండటంతో ప్లాన్ విఫలమైంది. ఎలాగైనా కారసానిని హతమార్చాలని శివయ్య గుంటూరు నగరంలోనే ప్లాన్ మార్చారు. అనుచరులతో పాటు బాంబులు, కత్తులు, వేట కొడవళ్లను సిద్ధం చేసుకుని శ్రీనివాసరావు కదలికలపై అనుచరులతో రెక్కీ ప్రారంభించాడు. సుమారు రెండు నెలల రెక్కీ అనంతరం 2008 మార్చి 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిసెంటర్‌లో ఉన్నాడని తెలియడంతో తోటి అనుచరులైన కత్తి బ్రహ్మారెడ్డి, కలుగూరి నాగరాజు, దోమల చిన యాకోబులతో కలిసి బయల్దేరాడు. శ్రీనివాసరావు లీలామహాల్ సెంటర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించేందుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉండగా, తన పక్కన ఉన్న వారితో కలిసి కారసాని టీ తాగేందుకు పక్కనే ఉన్న అమన్ టీస్టాల్ వద్దకు వెళ్లారు. శ్రీనివాసరావు కోసం కాపు కాచి ఉన్న ప్రత్యర్థులు బాంబులు విసిరి వెంటాడి వేట కొడవళ్లతో దారుణంగా నరకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. శివయ్య, బ్రహ్మారెడ్డిలతోపాటు, మరో 11 మందిని నిందితులుగా చూపుతూ అప్పటి కొత్తపేట సీఐ, ప్రస్తుతం సత్తెనపల్లి డీఎస్పీ ఆర్.విజయభాస్కర్‌రెడ్డి అప్పట్లో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ కొంత మేర జరిగిన తరువాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని మృతుడి బంధువులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడంతో కేసు విచారణ నిలిచిపోయింది. ఆరో అదనపు కోర్టు ఏపీపీగా నియమితులైన కట్టా కాళిదాసును నియమించడంతో మృతుడి బంధువులు స్పెషల్ పీపీ డిమాండ్‌ను విరమించుకున్నారు. ఏపీపీ ప్రాసిక్యూషన్ తరుపున సాక్షులను ప్రవేశపెట్టి ప్రాసిక్యూషన్ పూర్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నల్లపాటి శివయ్య, కత్తి బ్రహ్మారెడ్డిలను దోషులుగా తేలడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఉమాయాదవ్ హత్య కేసులో 12 మంది అరెస్టు
సాక్షి, మంగళగిరి: రౌడీషీటర్ తాడిబోయిన ఉమాయాదవ్ హత్యకేసులో 12 మంది నిందితులను సీఐ నరేష్కుమార్ అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. మృతుడు తాడిబోయిన ఉమాయాదవ్‌కు స్థానికంగా నివసించే తోట శ్రీనివాసరావు ఆధిపత్యపోరు నడుస్తుంది. ఇందులో భాగంగా తోట శ్రీనివాసరావు ప్రణాళికా ప్రకారం గత నెల 25వ తేదీన శ్రీనివాసరావు ఇంటి దగ్గర కాపు కాసి అదే దారిలో ఇంటికి వెళ్తున్న తాడిబోయిన ఉమాయాదవ్పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు. హత్యలో పాల్గొన్న వారికి టీడీపీ నాయకులు ఏనుగ కిషోర్, చావలి మురళీకృష్ణ, నల్లగోర్ల శ్రీనివాసరావులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో మొత్తం 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసులో అరెస్టై కోర్టు రిమాండ్ విధించిన వారిలో తోట శ్రీనివాసరావు, తోట పానకాలు, రుద్రు గోపి, తోట సాంబశివరావు, తోట శ్రీకాంత్, చింతా శివప్రసాద్, ఏనుగ కిషోర్, కుర్రా సాంబశివరావు, చావలి మురళీకృష్ణ, తోట సైదులు, షేక్ వజీర్‌సుల్తాన్, నల్లగొర్ల శ్రీనివాసరావులున్నారు. చంద్రబాబు పర్యటన వాయిదా.. ఉమాయాదవ్‌ను హత్య చేసిన వారందరూ టీడీపీకి చెందిన వారని తెలియడంతో 8వ తేదీన మంగళగిరి పర్యటనను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాయిదా వేశారు. టీడీపీ నేత తాడిబోయిన ఉమాయాదవ్ కుటుంబాన్ని పరామర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చూశారు. అయితే హత్యలో కీలక సూత్ర ధారులు అందరూ టీడీపీవారే కావడంతో ఊహించని రీతిలో చంద్రబాబు పర్యటన వాయిదా వేశారు. హత్య కేసులో కొంత మంది నిందితులను పోలీసులు ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే అదుపులోకి తీసుకుని సీసీఎస్‌లో విచారించారు. అయితే సీసీఎస్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నిందితులకు సెల్‌ఫోన్ ఇచ్చి వారు ప్రధాన నిందితులతో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ప్రధాన నిందితులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఏఎస్సై నిందితులకు సహకరించడం వల్లే హత్యకేసులోని కీలక సూత్రధారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టిందని తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో జరిగిన కేసులో ఏఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించి నిందితులకు సహకరించడాన్ని ఎస్పీ పీ.హెచ్.డీ.రామకృష్ణ సీరియస్‌గా తీసుకున్నట్లు పోలీసు వర్గాలు చర్చించకుంటున్నాయి. సీసీఎస్‌కు వచ్చే ప్రతి కేసులో ఇతను నిందితులకు ఏదో విధంగా సహకరించి లబ్ధి పొందుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసుకు సంబంధం లేనివారిని కూడా తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు దండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్న ఆరోపణలున్నాయి. -
మంగళగిరిలో రౌడీషీటర్ హత్య
సాక్షి, మంగళగిరి: కత్తి పట్టిన వాడు కత్తికే బలి అవుతాడని మంగళగిరి పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటన మరోసారి రుజువు చేసింది. వివరాలలోకి వెళితే.. పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమాయాదవ్ రాత్రి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు అటకాయించి కత్తులతో మెడపై ముఖంపై నరికి దారుణంగా హత్య చేశారు. రోజులాగే పట్టణంలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని బేతపూడి సర్పంచ్ సాయిప్రసాద్‌ను కురగల్లు గ్రామం వద్ద కారులో వస్తుండగా కత్తులతో దాడి చేసిన ఘటనలో ప్రథమ మద్దాయి ఉమా యాదవ్. అప్పట్లో పోలీసులు ఈయనపై రౌడీ షీట్ తెరిచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఉమాయాదవ్ టీడీపీ హయాంలో ఓ పోలీస్ అధికారి సాయంతో అనేక భూవివాదాల్లో తలదూర్చేవారు. ప్రస్తుతం ద్వారకానగర్‌లో ఇరువర్గాలుగా ఉన్న నాయకులు తమ ఆధిపత్యం కోసం ఉమాయాదవ్‌ను హత మార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి బదిలీ అయిన పోలీస్ అధికారితోనూ కొంత కాలంగా సెటిల్మెంట్లతోపాటు డబ్బులు విషయంలో తేడాలు వచ్చిన కారణంగానే ఉమాయాదవ్‌ను హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తమకు అనుమానం ఉన్న స్థానిక నాయకుడి ఇంటిపై దాడి చేయబోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బెంగళూరు రౌడీషీటర్ దారుణ హత్య
కెలమంగలం: బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ ఇస్మాయిల్ మంగళవారం ఉదయం క్రిష్ణగిరి జిల్లా డెంకణీకోటలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇస్మాయిల్‌పై బొమ్మనహళ్లి ప్రాంతంలో మూడు హత్య కేసులు ఉన్నట్లు, ఇతన్ని రౌడీïషీటర్‌గా కర్ణాటక పోలీసులు ప్రకటించినట్లు డెంకణీకోట డీఎస్పీ సంగీత తెలిపారు. ఇతడు డెంకణీకోటలోని ఏవిఎస్ లేఔట్లో ఉన్న స్నేహితుడు నజీర్‌ను కలిసేందుకు కారులో రాగా, మరోకారులో వెంటాడుతూ వచ్చిన ఏడుమంది దుండగులు ఇస్మాయిల్‌ను అడ్డుకుని కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఇస్మాయిల్ తన మిత్రుని ఇంట్లోనికి వెళ్లగానే ముఖానికి ముసుగులు ధరించిన దుండగులు లోపలికి చొరబడి అతన్ని హత్య చేసి, కారులో వెళ్లిపోయారని పలువురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. డీఎస్పీ సంగీత నేతృత్వంలో హంతకులను పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇస్మాయిల్ మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పాత కక్షలే హత్యకు కారణం కావచ్చని భావిస్తున్నారు. -
రౌడీషీటర్ని హత్య చేసి గుండెను తీసుకెళ్లారని..
కర్నూలు: జిల్లా కేంద్రంలోని సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్య (30) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు పట్టకుండా ఉండేందుకు కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచారు. ఇతను ఆర్టీసీ బస్టాండ్‌లో ఐదు నెలల నుంచి హమాలీగా పనిచేస్తున్నాడు. అంతకు ముందు పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తండ్రి చనిపోవడంతో తల్లి బుడ్డమ్మతో కలసి సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉంటున్నాడు. బుడ్డమ్మకు ఐదుగురు సంతానం కాగా, చెన్నయ్య నాలుగవ కుమారుడు. అర్ధరాత్రి వరకు ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలసి బాణా సంచా కాలుస్తూ గడిపాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి గురువారం ఉదయం శ్రీచైతన్య స్కూల్ సమీపంలో (ఎల్‌వీటీజీ ఫిజియోథెరపీ కళాశాల ఎదురుగా) తుంగభద్ర నదిలో శవమై తేలాడు. రాళ్లతో బాది, కత్తులతో పొడిచి హత్య చేసినట్లు ఆనవాళ్లున్నాయి. మెడ, వీపు భాగాల్లో కత్తి పోట్లు ఉండగా గుండె పైభాగంలో పెద్ద రంధ్రం ఏర్పడింది. హత్య చేసి గుండె తీసుకెళ్లినట్లు మొదట పుకార్లు షికార్లు చేశాయి. ఈ మేరకు ప్రసార మాధ్యమాల్లో స్క్రోలింగ్ రావడంతో కర్నూలు డీఎస్పీ యుగంధర్ బాబు, రెండో పట్టణ సీఐ యుగంధర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలం నుంచి సాయిబాబా సంజీవయ్య నగర్ మీదుగా బాలశివ డిగ్రీ కళాశాల వరకు వెళ్లి పోలీసు జాగిలం ఆగిపోయింది. ఎమ్మెల్యే అనుచరుడే హత్య చేయించాడు..! కర్నూలు ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు అదే కాలనీకి చెందిన బొల్లెద్దుల రామకృష్ణ హత్య చేయించాడని చెన్నయ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. రామకృష్ణ వడ్డీ వ్యాపారంతో పాటు కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. అతని వద్ద చెన్నయ్య 2014లో రూ.2 లక్షలు అప్పు చేశాడు. అప్పు తీర్చే విషయంలో రామకృష్ణ తన తమ్ముడు చెన్నయ్యపై దాడి చేశాడని, అతని సోదరి ఈ ఏడాది ఆగస్టు 26న రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కౌంటర్ కేసులు నమోదయ్యాయి. 2019 ఆగస్టు నాటికి పూర్తిగా అప్పు చెల్లించాలని అప్పట్లో వారి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే పాత కక్షలను మనసులో పెట్టుకుని చెన్నయ్యను తుంగభద్ర నదిలోకి తీసుకెళ్లి రామకృష్ణ హత్య చేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణకు ముఖ్య అనుచరుడిగా ఉన్న శివ అనే వ్యక్తి రాత్రి ఇంటికి వచ్చి బెదిరించి వెళ్లాడని, ఉదయమే ఈ ఘటన జరిగినందున వారే ఇందుకు బాధ్యులని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హతుడికి నేర చరిత్ర ఉన్నందున గిట్టని వారెవరైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అదే కాలనీకి చెందిన శివ అనే వ్యక్తి నుంచి రెండు రోజులుగా హతుని ఫోన్‌కి 20 కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. హత్య, అత్యాచారంతో పాటు ఐదు దౌర్జన్యం కేసులు చెన్నయ్యపై ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రంలో మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కత్తి పట్టాడు..కత్తికే బలయ్యాడు
గుంటూరు, రేపల్లె: విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. 22 సంవత్సరాల వయస్సులో కత్తి పట్టాడు. అడ్డదారిలో పయనించటంతో అదే కత్తికి బలై జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది.నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్ సోమవారం జిల్లాలోని మాచర్ల పట్టణంలో హత్యకు గురికావడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలను పరిశీలిస్తే.. తండ్రి విశ్రాంత ఎంఈవో ప్రేమ్‌కుమార్ తండ్రి జయరావ్ ఎంఈవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యి అనంతరం మృతి చెందారు. భార్య జోత్స్న వెల్దుర్తు మండలం సిరిగిరిపాడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. చెల్లెళ్లు విజయలక్ష్మి బాపట్లలో ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. జయలక్ష్మి ప్రస్తుతం విద్యనభ్యశిస్తున్నది. కుటుంబం మొత్తం విద్యావంతులు అయినప్పటికీ ప్రేమ్ అడ్డదారిలో పయనిస్తూ ముందుకు సాగాడు. ప్రేమ్‌కుమార్ నేర చరిత్ర ♦ 2008, ఏప్రిల్ 5వ తేదీన చెరుకుపల్లి గ్రామంలో నిజాంపట్నం గ్రామానికి చెందిన శీలం నాగేశ్వరరావు(నాగు) హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రేమ్‌కుమార్ పేరు నమోదైంది. ఆ కేసులో జిల్లా కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అనంతరం 2014లో హైకోర్టులో కేసు కొట్టివేశారు. ♦ 2009 మే 28న, 2009 జూన్ 24న రెండు కొట్లాట కేసులలో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు. ♦ 2009లో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ నమోదు ♦ నగరం పోలీస్ స్టేషన్లో ఆమ్స్ యాక్ట్‌లో షీట్ నమోదు ♦ 2014 జూలై 16న పట్టణంలో జరిగిన రాయల్ శివ హత్య కేసులో ముద్దాయి. కేసులో రాజీ పడటంతో కేసు కొట్టివేత. ప్రస్తుతం ఎక్కువగా మాచర్లలోనే రాయల్ శివ హత్య కేసు అనంతరం పట్టణంలో ఎక్కువగా ఉండని పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ప్రేమ్‌కుమార్ బాపట్లలోని చెల్లెళ్ల వద్ద, మాచర్ల భార్య వద్ద ఉంటున్నాడని బంధువులు చెబుతున్నారు. రౌడీ షీటర్ల మధ్య వివాదమే.. అసలు కారణమా..? నియోజకవర్గంలోని రౌడీ షీటర్ల మధ్య వివాదం నేపథ్యంలోనే ప్రేమ్‌కుమార్ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాచర్ల పట్టణంలో సీసీ పుటేజీలలో నమోదైన హత్య సంఘటనను రేపల్లె పట్టణ, రూరల్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని కొంత మంది రౌడీ షీటర్లతో ప్రేమ్‌కుమార్ వివాదాలకు దిగినట్లు వస్తున్న సమాచారంతో పోలీసులు ఆ దిశగా విచారణను గోప్యంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. -
భార్య కువైట్‌లో.. భర్త దారుణ హత్య
నాగోలు: ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భరత్‌నగర్‌కు చెందిన తంగడపల్లి రాములు(50)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య విజయలక్ష్మీ ప్రస్తుతం కువైట్‌లో ఉండగా, రెండో భార్య జ్యోతి రాజేంద్రనగర్‌లో నివాసముంటోంది. రాములుపై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 5 కేసులు నమోదు కావడంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. సాయినగర్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయమై జరిగిన గొడవలో జైలుకు వెళ్లిన రాములు ఏప్రిల్ 24న బయటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్ చేయడంతో బయటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఫతుల్లాగూడ, ఆప్కోకాలనీ సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, అతడిని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏసీపీ పృధ్వీదర్‌రావు, సీఐ కాశిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ ఆధారాలు సేకరించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీతో బెదిరించి.. కత్తులతో నరికారు
విశాఖ క్రైం/అల్లిపురం/ డాబాగార్డెన్స్: నగరంలో జరుగుతున్న రౌడీ షీటర్ల వరస హత్యలతో ప్రజలు నిర్ఘాంతమైపోతున్నారు. ఏ హత్యకు ఆ హత్య విభిన్న పంథాలో జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బైక్‌పై వస్తున్న ఖాసీంను ఆటోతో ఢీకొట్టడం, కింద పడ్డ అతన్ని తుపాకీతో గురిపెట్టి అచేతనంగా ఉంచి కత్తులతో దారుణంగా హత్య చేయడం.. అంతటా చర్చనీయాంశమైంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే ఇలాంటి నేర సంస్కృతి.. ప్రశాంత విశాఖలో పురి విప్పడంతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొంది. రౌడీషీటర్ మహ్మద్ ఖాసీంను గురువారం రాత్రి 10 గంటల సమయంలో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బైక్‌పై డైమండ్ పార్క్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ మీదుగా ఖాసీం ఇంటికి వెళ్తున్నాడు. వెనుక ఆటోలో కత్తులతో వస్తున్న ప్రత్యర్థులు ఎల్ఐసీ భవనం ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టారు. ఖాసీం బైక్‌పై నుంచి పడిపోయాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీ తీసి ఖాసీం తలపై గురిపెట్టాడని, ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఖాసీంను తుపాకీతో గురిపెట్టిన వ్యక్తి చిట్టిమాముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పిస్టల్ ఎవరిదనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కమిషనర్ లడ్డా ఆదేశాల మేరకు టూటౌన్, ఎంఆర్పేట పరిధిలో రౌడీ షీటర్లను తెల్లవారుజామున ఆరు గంటలకే స్టేషన్లకు తరలించారు. వారు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఖాసీం హత్య కేసులో అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా చిట్టిమాము, రుషికొండ మధు, రామాటాకీస్ మధు, టెక్కం లక్ష్మణ, షణ్ముఖ్, చలువతోట మధు, కల్యాణ్‌లతో పాటు మరికొంత మంది పేర్లు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఘటన అనంతరం చిట్టిమాముతో పాటు అతని భార్య కూడా కనిపించకపోవడంతో..ఈ కేసులో చిట్టిమాము పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఖాసీం పోస్టుమార్టం సమయంలో అతని అనుచరుడు మురళీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాతకక్షలే కారణమని అనుమానం ఖాసీం హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఖాసీం మేనల్లుడు తెలుగు అనిల్. అతని హత్య కేసులో ప్రధాన నిందితుడు పొడుగు కిరణ్ గ్యాంగ్‌కు, ఖాసీం గ్యాంగ్‌కు మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. పొడుగు కిరణ్‌పై రెండు సార్లు దాడులు జరగడం, కిరణ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడం తదితర ఘటనలు చేసుకున్నాయి. మరో వైపు చిట్టి మాము తమ్ముడు హత్య కేసులో ఖాసీం ఒకడు. వన్‌టౌన్‌లో 1992లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఖాసీం. కప్పరాడలో జరిగిన జంట హత్య కేసులో చిట్టిమాము తమ్ముడిని ఖాసీం హత్య చేశారు. జిల్లా పరిషత్‌లో లచ్చా అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో కూడా ఖాసీం నిందితుడు. ఈ నేపథ్యంలో పొడుగు కిరణ్ వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న చిట్టిమాము, అతని అనుచరులు ఖాసీం పట్ల గుర్రుగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు గురువారం రాత్రి ఒంటరిగా దొరికిన ఖాసీంపై దాడికి పాల్పడి మట్టుబెట్టారు. హత్య అనంతరం వారంతా పరారయ్యారు. నిందితుల కోసం మూడు బృందాలు.. ఖాసీం హత్య కేసులో దర్యాప్తు కోసం మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నాయి. ఖాసీం హత్య కేసును పోలీస్ కమిషనర్ లడ్డా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖాసీం మృతదేహానికి పోస్ట్‌మార్టం ఖాసీం మృతదేహానికి శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఖాసీం మద్దతుదారులు అధిక సంఖ్యలో మార్చురీకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా హడావుడిగా మారింది. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందుగానే మార్చురీ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ పరిసర ప్రాంతాల్లో గుంపుగా ఉన్న యువకులను చెల్లా చెదురు చేశారు. ప్రధాన గేట్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమతి లేనిదే ఎవర్నీ లోపలికి పంపలేదు. అనుమానం వచ్చిన వారిని గేట్ అవతలే ఉంచారు. గుర్తింపు కార్డు చూసి ఉద్యోగులను వదిలారు. అలాగే క్యాజువాల్టీ వద్ద పోలీసులు మొహరించారు. ఏవీఎన్ కాలేజ్ డౌన్రోడ్డులోని గేట్‌ను మూసివేశారు. అడుగడుగునా పోలీసులు ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళనకు గురయ్యారు. -
వివాహేతర సంబంధం..రౌడీషీటర్ హత్య
నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం నేపథ్యంలో రౌడీషీటర్ బస్టాండు సాయిని హత్యచేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. స్థానిక ఉడ్‌హౌస్‌సంఘంకు చెందిన కోడూరు సాయికుమార్ అలియాస్ బస్టాండు సాయి (22), వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన ఉడత గణేష్‌కుమార్ అలియాస్ గని, కామాటివీధి కృష్ణమందిరానికి చెందిన దువ్వూరు అమర్నాథ్ అలియాస్ అమర్‌లు స్నేహితులు. సాయి, గణేష్‌లు పలు కేసుల్లో నిందితులు. గణేష్ జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన పండు అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. గణేష్‌కు తెలియకుండా కొంతకాలంగా సాయి సైతం ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తర్వాత ఈ విషయం గనికి తెలియడంతో అప్పటినుంచి సాయిపై అతను కక్ష పెంచుకున్నాడు. సాయి పలుమార్లు తాను చెప్పినట్లు వినాలని లేకుంటే అంతు చూస్తామని గని, అమర్నాథ్లపై దాడిచేయడంతో వారి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా సాయిని అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకున్నారు. పరారవుతుండగా.. ఈనెల 16వ తేదీన సాయితో కలిసి గని, అమర్నాథ్, మరో వ్యక్తి రమేష్‌లు వెంకటేశ్వరపురంలోని సప్తగిరి బార్లో ఫూటుగా మద్యం సేవించారు. అనంతరం తమవెంట తెచ్చుకున్న కత్తులతో గణేష్, అమర్నాథ్లు విచక్షణారహితంగా సాయిని పొడిచారు. బీర్‌బాటిళ్లతో తలపై కొట్టడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతుడి తల్లి వేళాంగిణి ఫిర్యాదు మేరకు అప్పటి ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జి.సంగమేశ్వరరావు హత్యకేసు నమోదుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం గని, అమర్నాథ్లు జనార్ధన్‌రెడ్డికాలనీలో ఉన్నారనే సమాచారం ఇన్స్పెక్టర్ సంగమేశ్వరరావుకు అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుంటున్న తరుణంలో పోలీసులను చూసిన నిందితులు పరారవుతుండగా వెంబడించి వారిని పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో వారిని అరెస్ట్‌చేశారు. మరో నిందితుడు రమేష్ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ (రెండోనగర ఇన్చార్జి) జి.సంగమేశ్వరరావు, రెండోనగర ఎస్సైలు ప్రతాప్, పి.వి.రమణయ్య పాల్గొన్నారు. -
రౌడీషీటర్ దారుణహత్య
కర్నూలు నగర శివారులోని సుంకేసుల రోడ్డులో వైన్‌షాప్ వద్ద శుక్రవారం రౌడీషీటర్ చాకలి రాముడు(30)దారుణహత్యకు గురయ్యాడు. ఇతన్ని మరో రౌడీషీటర్ మతిన్బాషా బీరు బాటిల్‌తో పొడిచి చంపాడు. కర్నూలు : నగర శివారులోని సుంకేసుల రోడ్డులో వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు(30) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా పైపాడు గ్రామానికి చెందిన రాముడు కర్నూలులో పెళ్లి చేసుకుని టెలికాం నగర్లో నివాసముంటున్నాడు. కొంతకాలం కారు డ్రైవర్‌గా పనిచేసిన అతడు ఆపని కూడా మానేసి జులాయిగా తిరిగేవాడు. ఆదిత్య నగర్లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్బాషా శుక్రవారం మధ్యాహ్నం రాముడు ఇంటి దగ్గరికి వెళ్లి అతడిని బైక్‌పై ఎక్కించుకుని కొత్తబస్టాండ్ సమీపంలోని అమరావతి బార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలసి మద్యం సేవించి బైకులపై సుంకేసుల రోడ్డులోని వీకే వైన్స్‌కు చేరుకుని మరోసారి మద్యం సేవించారు. చాకలి రాముడు స్నేహితుడు ఇసాక్‌ను గతంలో మతిన్బాషా దూషించిన విషయం ప్రస్తావనకు వచ్చి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చాకలి రాముడు మద్యం బాటిల్‌తో మతిన్ బాషాపై దాడి చేశాడు. అతడు కూడా బీరు బాటిల్‌తో రాముడు కడుపులో పొడవడంతో కుప్పకూలి పడిపోయాడు. బండరాయితో తలపై బాది హత్య చేశాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషా, అడిషనల్ ఎస్పీ షేక్షావలి, అర్బన్ తాలూకా సీఐ షేక్ ఇస్మాయిల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మతిన్బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధ విషయంలో విభేదాలున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. -
పథకం ప్రకారం రౌడీషీటర్ హత్య
నరసరావుపేట టౌన్: కత్తిపట్టిన వాడు కత్తితోనే నశిస్తాడు అనే నానుడి రౌడీటర్ నాగరాజు హత్యతో నిజమైంది. ముస్లింల వేషధారణల్లో వచ్చిన ముగ్గురు యువకులు అతడ్ని కిరాతకంగా నరికారు. నాలుగు నిమిషాల్లో అంతా పని కానిచ్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ వారు చిక్కలేదు. ఉన్నతాధికారులు సత్పవర్తనతో జీవించాలని సూచించినప్పటికీ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో నేడు నాగరాజు కుటుంబం రోడ్డున పడిందని పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. వివరాల్లో కెళితే...ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్ చీదనబోయిన నాగరాజు వురఫ్ బొల్లు నాగరాజు ఆదివారం రాత్రి అరండల్‌పేట గోల్డెన్ బిర్యానీ పాయింట్ ఎదుట దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. హోటల్ దగ్గర ఒక్కడే ఉండటాన్ని గమనించి ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. హత్య ఉదంతంతో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ప్రజానీకం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. సమాచారం తెలుసుకున్న సీఐ శివప్రసాద్ నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలానికి చేరుకొన్నారు. రక్తపు మడుగులో పడిఉన్న నాగరాజును పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. నిందితుల కోసం గాలించనప్పటికీ ఫలితం దక్కలేదు. సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నాలుగు నిమిషాల్లో 27 కత్తి పోట్లు పక్కా పథకంతో రోడ్డుకు ఇరువైపులా నుంచి మారణాయుధాలతో వచ్చిన›పత్యర్థులు నాగరాజుపై అతి కిరాతకంగా దాడి చేశారు. మెడ, తల, శరీర భాగాల్లో బలంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రాణం విడిచాడని నిర్ధారించుకున్న తరువాతే సంఘటన స్థలం నుంచి కదిలారు. ముస్లింల దుస్తుల్లో ఉన్న ముగ్గురు, మరో మైనర్ బాలుడు సంఘటనలో పాలుపంచుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరించారు. సోమవారం మృత దేహాన్ని పోస్టుమార్టం చేసిన సమయంలో శరీరంపై ఉన్న 27కత్తిపోట్లు, వేళ్లు తెగిపడిఉంటాన్ని పోలీసులు గుర్తించారు. ఇటీవల జైలు నుంచి విడుదల మృతుడు నాగరాజు ఎస్ఆర్కేటీ కాలనీలో మూడు నెలల కిందట జరిగిన పాల వ్యాపారి మాతంగి కన్న హత్య కేసులో నిందితుడిగా ఉండి గత మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో పాటు నాగరాజుపై రెండు హత్య, మూడు హత్యాయత్నం, మరో ఐదు దాడి, బెదిరింపుల కేసులు ఉన్నాయి. అయితే, వాటన్నింటినీ కొట్టివేయగా ప్రస్తుతం పాల వ్యాపారి హత్య కేసు మాత్రమే పెండింగ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఆర్కేటీ కాలనీలో గతంలో జరిగిన రేషన్ డీలర్ హత్య కేసులో నాగరాజు ప్రధాన నిందితుడు. మృతుడి సోదరుడు నాగరాజును అంతమొందించేందుకు గతంలో రెండుసార్లు పథక రచన చేసి విఫలమయ్యాడు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు రాజీ పడటంతో కేసు గత ఆరునెలల కిందట కొట్టేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులు నాగరాజును కిరాయి మనుషులతో హత్య చేయించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
సాక్షి, విశాఖ : రౌడీ షీటర్ గేదెల రాజు హత్యకేసులో ప్రధాన నిందితుడు, ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున చోడవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అనంతరం ఆయనను విశాఖ తరలిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన జరిగిన గేదెల రాజు హత్య కేసులో ఏ1 నిందితుడు, డీఎస్పీ దాసరి రవిబాబు, ఏ2 నిందితుడు క్షత్రియభేరి దినపత్రిక ఎండీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఉన్నారు. అయితే గేదెల రాజు హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ప్రధాన నిందితులిద్దరూ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు కేసును పక్కదోవ పట్టించేందుకు రవిబాబు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అత్యున్నత స్థాయిలోనే పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. అందుకు కాకర పద్మలత తండ్రి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు, గేదెల రాజు భార్య కుమారి వివిధ పత్రికల్లో ఇచ్చిన స్టేట్మెంట్లు ఊతమిస్తున్నాయి. కాకర పద్మలత హత్యకు గురైందని, గేదెల రాజు సహకారంతో డీఎస్పీ రవిబాబు చేయించాడని పోలీసులు ప్రకటించిన సంగతి విదితమే. అందులో తనకు రావాల్సిన సుపారీ కోసం రవిబాబుపై గేదెల రాజు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, ఈ నేపథ్యంలో అతడిని అడ్డు తొలగించుకునేందుకు భూపతిరాజు శ్రీనివాసరాజు సహకారంతో రాజును హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు డీఎస్పీ రవిబాబు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తనకు తెలిసిన న్యాయవాదుల నుంచి సలహాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
తెనాలిలో నిషేధాజ్ఞలు
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్ కాళిదాసు సత్యనారాయణ అలియాస్ వేమూరి సత్యం(33) హత్య నేపథ్యంలో పోలీసులు పట్టణంలో నిషేధాజ్క్షలు విధించారు. వేమూరి సత్యం ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం విదితమే. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అదనంగా పోలీసు బలగాలను రప్పించారు. పట్టణంలో 144వ సెక్షన్ అమలుతోపాటు సెక్షన్ 30 పోలీస్ యాక్టును అమలు చేస్తున్నట్లు డీఎస్పీ సౌజన్య తెలిపారు. పట్టణంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని డీఎస్పీ పేర్కొన్నారు.