చాకలి రాముడు (ఫైల్) ,మతిన్‌బాషాను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
కర్నూలు నగర శివారులోని సుంకేసుల రోడ్డులో వైన్‌షాప్ వద్ద శుక్రవారం రౌడీషీటర్ చాకలి రాముడు(30)దారుణహత్యకు గురయ్యాడు. ఇతన్ని మరో రౌడీషీటర్ మతిన్‌బాషా బీరు బాటిల్‌తో పొడిచి చంపాడు.
కర్నూలు : నగర శివారులోని సుంకేసుల రోడ్డులో వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు(30) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా పైపాడు గ్రామానికి చెందిన రాముడు కర్నూలులో పెళ్లి చేసుకుని టెలికాం నగర్‌లో నివాసముంటున్నాడు. కొంతకాలం కారు డ్రైవర్‌గా పనిచేసిన అతడు ఆపని కూడా మానేసి జులాయిగా తిరిగేవాడు. ఆదిత్య నగర్‌లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్‌బాషా శుక్రవారం మధ్యాహ్నం రాముడు ఇంటి దగ్గరికి వెళ్లి అతడిని బైక్‌పై ఎక్కించుకుని కొత్తబస్టాండ్ సమీపంలోని అమరావతి బార్‌కు చేరుకున్నారు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలసి మద్యం సేవించి బైకులపై సుంకేసుల రోడ్డులోని వీకే వైన్స్‌కు చేరుకుని మరోసారి మద్యం సేవించారు. చాకలి రాముడు స్నేహితుడు ఇసాక్‌ను గతంలో మతిన్‌బాషా దూషించిన విషయం ప్రస్తావనకు వచ్చి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చాకలి రాముడు మద్యం బాటిల్‌తో మతిన్ బాషాపై దాడి చేశాడు. అతడు కూడా బీరు బాటిల్‌తో రాముడు కడుపులో పొడవడంతో కుప్పకూలి పడిపోయాడు. బండరాయితో తలపై బాది హత్య చేశాడు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషా, అడిషనల్ ఎస్పీ షేక్‌షావలి, అర్బన్ తాలూకా సీఐ షేక్ ఇస్మాయిల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మతిన్‌బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకుని అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధ విషయంలో విభేదాలున్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment