
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
స్వల్ప వివాదం కారణంగా మహేష్‌గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్‌ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్‌పై దాడి చేసిన మహేష్గౌడ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment