
సాక్షి, అత్తాపూర్: ఇంటి ఎదుట ఉన్న ఆలయంలో పూజ చేయవద్దు అంటూ ఓ వ్యక్తి మహిళపై దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ పాండురంగానగర్ ప్రాంతంలో కవిత ఇంటి ఎదుట ఉన్న ఆలయంలో రోజూ పూజ చేస్తుంది. శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తున్న సమయంలో పక్కనే నివాసం ఉండే యేసు అనే వ్యక్తి పూజ చేసే సమయంలో గంట శబ్ధం ఎక్కువగా వస్తుందని దీంతో ఇబ్బందిగా మారుతుందన్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో యేసు కవితపై కట్టెలు, రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనతో కవిత తల, మొహం, చేతి, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక సిత్థిలో పడి ఉన్న కవితను స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కవిత రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో యేసుపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.