![After Jobs Loss Women Fooled By Fake Visa Racket In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/9/VISA.jpg.webp?itok=2hVktqme)
శంషాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి తప్పుడు వీసాలు అందజేస్తున్న కేసులో మొత్తం 12 మంది ఏజెంట్ల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో ఇద్దరు ఏజెంట్లు, ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని కడప తదితర ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది.
కడప జిల్లాకు చెందిన ఫయాజ్ అనే ఏజెంటు కొంతకాలంగా ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో ఉప ఏజెంట్ల ద్వారా తప్పుడు వీసాల వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం హైదరాబాద్ మల్లేపల్లిలో నివసిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ నూర్ మహ్మద్ (35)ను శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించడంతో రిమాండ్‌కు తరలించారు. కాగా, రెండు వీసాలతో కువైట్ వెళ్తూ మంగళవారం 44 మంది మహిళలు పట్టుబడిన మర్నాడే బుధవారం ఉదయం మరో ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment