Fake visa
-
ఐదేళ్లలో రూ. 300 కోట్లు.. నకిలీ వీసా ముఠా గుట్టురట్టు
ఢిల్లీ: నకిలీ వీసాలు తయారు చేసి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. సెప్టెంబర్ 2 తేదీన సందీప్ అనే వ్యక్తి నకిలీ స్వీడిష్ వీసాతో ఇటలీ వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుబడ్డాడు. దీంతో ఓ భారీ నకిలీ వీసా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సుమారు నాలుగైదు వేలకుపైగా నకిలీ వీసాలు తయారు చేసి ఈ ముఠా రూ. 300 కోట్లు సందపాదించనట్లు అధికారులు పట్టుపడిన సందీప్ అనే వ్యక్తి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్ అలీ అనే ఏజెంట్ ద్వారా రూ. 10 లక్షలకు సందీప్ నకిలీ వీసా పొందాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ అలీతో పాటు అతని సహచరులు శివ గౌతమ్, నవీన్ రానాలను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో శివ గౌతమ్.. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఏజెంట్ల బల్బీర్ సింగ్ , జస్విందర్ సింగ్ పేర్లను చెప్పాడు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలోని మనోజ్ మోంగా అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో పలు దేశాలకు చెందిన నకిలీ వీసాలు తయారు చేసినట్లు వారు వెల్లడించారు. పోలీసులు తిలక్ నగర్‌లోని ఫ్యాక్టరీపై దాడి చేసి గ్రాఫిక్ డిజైన్‌లో డిప్లొమా చేసిన మనోజ్ మోంగాను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం.. జైదీప్ సింగ్ అనే వ్యక్తిని మనోజ్ కలిశాడు. మనోజ్ గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ చూసి.. జైదీప్ నకిలీ వీసాలను తయారుచేయమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా వాటిని సంబంధిచి అవసరమైన సామగ్రిని కూడా అందించాడు. ఈ ముఠా ప్రతి నెలా 30 నుంచి 60 నకిలీ వీసాలు తయారు చేస్తుంది. కేవలం 20 నిమిషాల్లో వీసా స్టిక్కర్‌ను సిద్ధం చేస్తారు. ప్రతి నకిలీ వీసాకు సుమారు 8 నుంచి 10 లక్షలకు విక్రయిస్తారు. టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్‌లను ద్వారా విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులతో మాట్లాడి నకిలీ వీసాలు అందిస్తారు.ఇప్పటి వరకు ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేశామని, 16 నేపాలీ పాస్‌పోర్ట్‌లు, రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు, 30 వీసా స్టిక్కర్లు, 23 వీసా స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని ఐజీఐ ఎయిర్పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. నకిలీ వీసాల తయారీలో ఉపయోగించిన ప్రింటర్లు, లామినేటింగ్ షీట్లు, ల్యాప్‌టాప్‌ల ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.చదవండి: బాలికపై లైంగిక దాడి.. తృణమూల్ నేత అరెస్టు -
తప్పుడు వీసాల కేసులో 12 మంది ఏజెంట్ల పాత్ర!
శంషాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి తప్పుడు వీసాలు అందజేస్తున్న కేసులో మొత్తం 12 మంది ఏజెంట్ల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. మరో ఇద్దరు ఏజెంట్లు, ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని కడప తదితర ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఫయాజ్ అనే ఏజెంటు కొంతకాలంగా ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో ఉప ఏజెంట్ల ద్వారా తప్పుడు వీసాల వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం హైదరాబాద్ మల్లేపల్లిలో నివసిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ నూర్ మహ్మద్ (35)ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించడంతో రిమాండ్‌కు తరలించారు. కాగా, రెండు వీసాలతో కువైట్ వెళ్తూ మంగళవారం 44 మంది మహిళలు పట్టుబడిన మర్నాడే బుధవారం ఉదయం మరో ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. -
అక్రమంగా వీసా ప్రాసెసింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అర్హతలు, అవసరమైన అనుమతులు లేకుండా వీసా ప్రాసెసింగ్ చేస్తున్న నిందితుడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇతడిపై గతంలోనూ కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చాడని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. నగరంలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన సికిందర్ గతంలో వీడియోగ్రాఫర్‌గా పని చేశాడు. 2012లో దుబాయ్ వెళ్లిన ఇతగాడు అక్కడ కొన్నాళ్ల పాటు పని చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి వివిధ దేశాలకు చెందిన వీసాల ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో నగరానికి తిరిగి వచ్చిన తర్వాత వీసా ప్రాసెసింగ్ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. 2014లో వచ్చిన సికిందర్ ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా ఈ దందా ప్రారంభించాడు. అనేక మందికి ఎర వేసి స్టడీ, విజిట్, బిజినెస్ వీసాలు ఇప్పించి పంపాడు. అక్రమంగా చేస్తున్న ఈ దందా నేపథ్యంలో ఇతడిపై గతంలో ఫలక్‌నుమా, ఆర్జీఐ ఎయిర్పోర్ట్, శంషాబాద్, కాలాపత్తర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు అయిన ఇతగాడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోని సికిందర్ వీసా ప్రాసెసింగ్ దందా కొనసాగించాడు. అక్రమంగా వీసా ప్రాసెసింగ్ చేస్తూ ఒక్కో వీసాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్ఐలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్ తమ బృందాలతో దాడి చేసి బుధవారం అరెస్టు చేశారు. నలుగురికి చెందిన పాస్‌పోర్టులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును కాలాపత్తర్ పోలీసులకు అప్పగించారు. -
వీసా పేరిట టోకరా
సుల్తాన్‌బజార్: వివిధ దేశాలలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు వీసాలు, ఫ్లయిట్ టిక్కెట్లు ఇప్పిస్తానని దాదాపు 100 మంది వద్ద రూ.1కోటీ 32 లక్షలు మోసం చేసిన ఓ ట్రావెల్ ఏజెంట్‌ను శుక్రవారం సుల్తాన్‌బజార్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన నితిన్‌కుమార్ అగర్వాల్(38), బషీర్‌బాగ్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో యాస్ వెకేషన్స్ పేరిట ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా వివిధ దేశాలలో సందర్శక ప్రాంతాలను సందర్శించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నితిన్‌కుమార్‌ను ఆశ్రయించారు. దాదాపు 100 మంది వద్ద లక్ష నుంచి రెండు లక్షల చొప్పున వసూలు చేసిన నితిన్‌కుమార్ వారికి విసా, ప్లాయిట్ టికెట్లు ఇప్పించడంలో ఆలస్యం చేయడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో సుల్తాన్‌బజార్‌కు చెందిన ఖలీల్, పాండురంగ మరో 20 మంది వద్ద ఈ జూన్ 22న యూరప్, థాయ్‌లాండ్, ఉజ్జయినీ లాంటీ ప్రాదేశాలకు తీసుకువెళ్లేందుకు వీసా, టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి వారి వద్ద రూ. 9.70 లక్షలు వసూలు చేశాడు. వినియోగదారులు తమ డబ్బు తమకు అప్పగించాలని ఒత్తిడి తీసుకురావడం, అప్పులు అధికం కావడంతో నితిన్‌కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్‌నోటు రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సైఫాబాద్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ నమోదు చేయించారు. అదే పోలీసుస్టేషన్లో నితిన్‌కుమార్ భా«ధితులు తమను చీటింగ్ చేశాడని సైతం కేసు నమోదు అయ్యింది. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్, నల్లకుంట ప్రాంతాలకు చెందిన భాధితులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ చంద్రమోహన్ కేసునమాదు చేసుకుని ధర్యాప్తులో భాగంగా బషీర్‌బాగ్‌లో నిందితుడు నితిన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనకు వెండిబంగారు నగల దుకాణం ఉందని దానిలో ప్రయాణికుల వద్ద తీసుకున్న డబ్బును పెట్టడంతో నష్టం వచ్చిందని విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ వీసాలతో మహిళలను కువైట్‌కు..
గచ్చిబౌలి: నకిలీ వీసా స్టాంపింగ్‌లతో మహిళలను కువైట్‌కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో నకిలీ వీసా స్టాంపింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన రెల్లు కుబెందర్ రావు అలియాస్ చిన్న హమాలీగా పని చేసేవాడు. ఆ తర్వాత వెల్డింగ్ పని నేర్చుకున్న అతను 2007 నుంచి 2014 వరకు సింగపూర్, సౌతాఫ్రికాలో పని చేశాడు. 2016లో నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించిన అతను కమీషన్‌పై చెన్నైకి చెందిన ఎన్బీఎస్ ట్రాÐð ల్స్‌లో ఎయిర్ టికెట్ బుకింగ్ చేసేవాడు. ఇందుకుగాను అతడికి చెన్నై, కుంభకోణం ప్రాంతానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ సహాయకుడిగా పని చేసేవాడు. తరచు శ్రీలంక వెళ్లే బషీర్ అక్కడ కుమార్ అనే వ్యక్తి నుంచి ఒరిజనల్ స్టాంపులు తెచ్చేవాడు. అనంతరం వాటి ఆధారంగా కుబెందర్‌రావు, బషీర్, కుంభకోణంకు చెందిన బాలు ప్రసాద్‌తో కలిసి శంషాబాద్‌లోని ఓ హోటల్లో నకిలీ వీసాలు తయారు చేసేవారు. నకిలీ వీసాలతో దుబాయ్‌కి.. ఈ నకిలీ స్టాంప్‌ల ఆధారంగా బాలుప్రసాద్ నకిలీ పీఓఇ, ఇసీఆర్, మెడికల్ సర్టిఫికెట్లు రూపొందించేవాడు. అనంతరం సబ్ ఏజెంట్ల ద్వారా తమను సంప్రదించిన మహిళలను విజిటింగ్ వీసాపై దుబాయ్, అక్కడి నుంచి కువైట్ పంపేవారు. కువైట్ చేరుకున్న వారికి లక్ష్మీ, శారద, శ్రీను, సారా అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పించేవారు. ఇందుకు గాను ఒక్కో మహిళ నుంచి రూ. లక్ష వసూలు చేసేవారు. ఇందులో కువైట్‌లో ఉండే ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇదే తరహాలో 21 మందిని కువైట్ పంపినట్లు సీపీ తెలిపారు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే కువైట్ ఎంబసీకి సమాచారం అందించామన్నారు. ప్రధాన నిందితులు రెల్లు కుబెందర్‌రావు, షేక్ బషీర్ అహ్మద్‌తోపాటు సబ్ ఏజెంట్లుగా వ్యవహరించిన మోహన్‌రావు, అగస్టీ, రుత్తమ్మ, సునీత, వెంకటరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బాలు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, ప్రింటర్, లాప్ ట్యాప్, 15 మీ సేవా పత్రాలు, 16 పాస్ పోర్ట్‌లు, 13 వీసా పేపర్లు, 25 ఒరిజినల్ స్టాంపులు, 6 స్టాంప్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, శంషాబాద్ డీసీపీ సందీప్‌కుమార్, ఏసీపీ అశోక్‌కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్, ఎస్ఐలు రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనవాళ్లే మోసం చేస్తున్నరు..
సాక్షి, సిరిసిల్ల: ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువకులకు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. నకిలీ వీసాలను అంటగడుతూ నిలువునా మోసం చేస్తున్నారు. లైసెన్స్ పొందిన గల్ఫ్ ఏజెంట్లు కొద్ది మందే ఉంటే.. లైసెన్స్‌లేని వాళ్లు ఊరుకొక్క రు ఉన్నారు. కొందరు లైసెన్స్ ఏజెంట్లు సైతం సబ్ ఏజెంట్లను నియమించుకుని అక్కరకు రాని వీసాలు అంటగడుతున్నారు. గల్ఫ్ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు సైతం సులభతరంగా వీ సాలు ఇస్తూ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది నకిలీ ఏజెంట్లకు కాసులు కురిపిస్తోంది. వేతనం అధికమని, పనితక్కువగానే ఉం టుందని నకిలీ ఏజెంట్లు అబద్ధపు ప్రచారంతో నిరుద్యోగ యువతను రొంపిలోకి దింపుతున్నారు. ఖతర్‌లో వీసాల మోసాలు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోయపల్లికి చెందిన ముత్తన్న కోట ఖతర్‌లో కాంట్రాక్టర్. పనులు చేయించుకునే అతడు.. వలస జీవులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడనే అపవాదు ఉంది. తాజాగా మూడు నెలలుగా పని చేయించుకుంటూ చిల్లిగవ్వకూడా ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జీతం ఇవ్వకున్నా.. కనీసం బయటపని చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా వేధింపులు తప్ప మరో మార్గం కనిపించడంలేదు. ఇళ్లకు చేరిన వలస జీవులు ఏజెంట్ల మాటలతో మోసపోయిన వేములవాడకు చెందిన గొర్ల మురళి(42), కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య, కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మొకెనపల్లి రాజయ్య ఎంబసీ అధికారులు, ఖతర్‌లోని తెలంగాణ ప్రతినిధుల సాయంతో శుక్రవారం స్వగ్రామాలకు చేరారు. అంతకుముందు పది మంది యువకులు సైతం ఇండియా చేరారు. ఇంకాచాలా మంది ఏం చేయాలో తెలియక అక్కడే మగ్గిపోతున్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపారు. నకిలీ ఏజెంట్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గల్ఫ్ ఏజెంట్లు వీసాల దందా మానేసిన నకిలీలు.. ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు పోలీసుల నిఘా తగ్గింది. నకిలీ ఏజెంట్లు వీసాల దందా ప్రారంభించారు. అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెంట్‌కు ఎనభై వేలు ఇచ్చిన బావుసాయిపేటకు చెందిన ఏజంట్ అంజయ్యకు ఎనభైవేల రూపాయలు ఇచ్చి ఖతర్ పోయిన. జూలై 7వ తేదీకి నాలుగు నెలలు. అక్కడికి పోయిన కాడినుంచి పని చేయించుకున్న ఏజెంట్ జీతం ఇవ్వలేదు. నాకు భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అప్పు చేసి ఖతర్ పోతే.. జీతం రాక అప్పులో కూరుకపోయిన. రజని మేడమ్, సంతోష్ సార్లు సాయం చేసి ఎంబసీ అధికారుల సాయంతో మా ఇంటికి పంపించిండ్రు. – మొకెనపల్లి రాజయ్య, పల్లిమక్త జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు మనవాళ్లను మనవాళ్లే మోసం చేస్తున్నారు. ఖతర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనవాళ్లే పనిచేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫోరం(ఐసీడీఎఫ్)గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సాయం చేయిస్తుంటాం. ఇప్పటికే చాలామందికి సాయం చేసి ఇండియా పంపించాం. ఎవరూ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు. కంపెనీ వీసాలు, లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. – రజని, ఐసీడీఎఫ్, ప్రతినిధి -
టూరిస్టు వీసాలతో నిరుద్యోగుల తరలింపు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): మలేషియాలో ఉద్యోగాల పేరిట నిజామాబాద్ జిల్లావాసులను తీసుకెళ్తున్న తరుణంలో మోసం ముందుగానే బయటపడింది. ఇమిగ్రేషన్ అధికారుల అప్రమత్తతతో నిరుద్యోగులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. జరిగిన ఘోరాన్ని వారు అధికారులకు చెప్పడంతో ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి మంగళవారం రాత్రి 9.55 సమయంలో ఎయిరేషియా విమానం మలేషియాకు బయలుదేరాల్సి ఉంది. ఈ విమానం ఎక్కడానికి 17 మంది నిజామాబాద్ ప్రయాణికులు టూరిస్టు వీసాలతో సిద్ధమయ్యారు. వీరిని ఇమిగ్రేషన్ అధికారులు అనుమానించారు. ఇంత నిరుపేదల్లా ఉన్న మీరు టూరిస్టులా... ఎక్కడికెళ్లి ఎపుడొస్తారంటూ ప్రశ్నించడంతో వారు నిజం చెప్పేశారు. తాము టూరిస్టులం కాదని, ఉపాధి కోసం మలేషియా వెళ్తున్నామని చెప్పారు. అంతేకాదు. తాము మలేషియాలో కూలి పనులకోసం రూ.50 వేల నుంచి రూ.70 వేలు వరకు చెల్లించామని చెప్పారు. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు మలేషియాలో ఇలా జరిగే మోసాలను నిరుద్యోగులకు వివరించారు. విదేశీ వీసా లేకుండా టూరిస్టు వీసాలతో పంపుతున్నారంటే అక్కడ మోసానికి ప్లాన్ చేసినట్లేనని, ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగు చూస్తున్నాయని చెప్పడంతో 17 మంది ప్రయాణికులూ కళ్లు తేలేశారు. ఇంత మోసమా...అంటూ వారిని సాగనంపడానికి వచ్చిన ఏజెంట్ల వైపు చూసే సరికి వారి నోట మాటలేదు. టెర్మినల్ బిల్డింగ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులతోపాటు బయట ఉన్న మరో ఏజెంట్‌ని ఆ నిరుద్యోగులు పోలీసులకు చూపించారు. మోసపోకముందే మేల్కొలిపారని ఊపిరిపీల్చుకుని ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. -
వీడియో డ్రీమ్ తీరకుండానే...
సాక్షి, సిటీబ్యూరో: అన్ని అర్హతలు ఉన్న ఓ యువకుడు విదేశాల్లో ఉద్యోగం కోసం ఓ కన్సల్టెన్సీని ఆశ్రయించి, వారు ఆశించిన మొత్తం అందించి, అసలుది అనుకుని నకిలీ వీసా తీసుకుని... మోసపోతే అతడు బాధితుడు అవుతాడు. అర్హతలు లేని ఓ విద్యార్థి స్టడీ వీసా కోసం కన్సల్టెన్సీని సంప్రదించి, వారు డిమాండ్ చేసిన మొత్తం ఇవ్వడం ద్వారా నకిలీ సర్టిఫికెట్లు పొంది, వీటిని దాఖలు చేయడం ద్వారా విదేశాలకు వెళితే... కచ్చితంగా నిందితుడే. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్న మూడు కన్సల్టెన్సీల నిర్వాహకుల నుంచి సర్టిఫికెట్లు కొన్న వారు రెండో కోవకే చెందుతారు. అయినప్పటికీ వీరిని బాధితులుగా భావించాలా? నిందితులుగా చేర్చాలా? అనే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై స్పష్టత కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయా కన్సల్టెన్సీలకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన వ్యక్తికి ‘ట్రావెల్ వీడియో’ డ్రీమ్‌గా ఉంది. దానికి సన్నాహాలు చేస్తుండగానే గుట్టురట్టు కావడంతో జైలుకు వెళ్లాడు. ఆ మూడు ఆరోపణలపై... నగరంలోని బేగంపేట, ఎస్సార్‌నగర్ ప్రాంతాల్లో జస్ట్ వీసా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో–యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, రైజర్స్ ఆర్గనైజేషన్ కన్సల్టెన్సీలు దాదాపు నాలుగున్నరేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించి విక్రయిస్తున్నాయి. ఈ కాలంలో దాదాపు 650 మంది విద్యార్థులు, విదేశాలకు వెళ్లాలని భావించిన వారు వీటిని సంప్రదించి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వెచ్చించి సర్టిఫికెట్లు కొనుగోలు చేశారు. వీటినే ఆయా కాన్సులేట్స్, ఎంబస్సీల్లో దాఖలు చేయడం ద్వారా స్టడీ వీసాలు పొందిన వారు 250 మంది వరకు ఉన్నారు. వీరు తమకు తెలిసే నకిలీ సర్టిఫికెట్లు ఖరీదు చేసి వాటి ఆధారంగానే వీసాలు పొందారు. ఈ పనులన్నీ వారికి తెలిసే చేసిన నేపథ్యంలో మోసం చేయడం, ఫోర్జరీ, నకిలీ పత్రాలను అసలువిగా చూపించడం వంటి ఆరోపణల కింద వీరు నేరం చేసినట్లే. ఇందుకుగాను సర్టిఫికెట్లు ఖరీదు చేసిన వారందరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉందని కొందరు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాలకు వెళ్లిన 250 మందినీ ఈ ఆరోపణలపై వెనక్కు రప్పించే ఆస్కారం ఉందని తెలిపారు. ‘కస్టమర్లు’గా వచ్చి ఏజెంట్లుగా మారి... ఈ కన్సల్టెన్సీల వద్దకు ఓసారి కస్టమర్‌గా వచ్చి సర్టిఫికెట్లు ఖరీదు చేసుకున్న వారే కొన్ని రోజులకే వారికి ఏజెంట్లుగా మారిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా బొంతుపల్లికి చెందిన అఖిల్ మంథి గతంలో వీరి నుంచే ధ్రువీకరణ పత్రాలు ఖరీదు చేసి విదేశాల్లో ఎంఎస్ చేసి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత పలువురు స్టడీ వీసా పొందటంపై ఇతడి సలహాలు కోరారు. వారందరికీ ఆ మూడు కన్సల్టెన్సీలకు ‘మార్గదర్శకుడి’గా మారిపోయిన అఖిల్ ఏజెంట్‌గా వ్యవహరించాడు. ఒక్కో విద్యార్థిని కన్సల్టెన్సీకి తీసుకువచ్చినందుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నిర్వాహకుల నుంచి కమీషన్‌గా తీసుకునేవాడు. ఇలానే మరికొందరూ ఈ కన్సల్టెన్సీలకు ఏజెంట్లగా మారిపోయి ‘వ్యాపారాభివృద్ధి’కి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్యాంగ్ విక్రయించే సర్టిఫికెట్స్‌లో టెన్త్ నుంచి పీజీ వరకు... డిగ్రీ నుంచి మెడిసిన్ వరకు వివిధ రకాలైన కోర్సులకు చెందినవి, 19 విద్యా సంస్థలు, యూనివర్శిటీలవి ఉంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల పేర్లనూ వీరు ‘వాడేశారు’. ఈ మూడు కన్సల్టెన్సీలు ఇప్పటి వరకు విక్రయించిన సర్టిఫికెట్ల జాబితా, ఖరీదు చేసిన వారి వివరాలతో కూడిన చిట్టాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియో డ్రీమ్ తీరకుండానే... ఈ మూడు కన్సల్టెన్సీలకూ ఇమ్రాన్ షేక్ అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చాడు. కడపకు చెందిన ఇతను 16 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి టోలిచౌకిలో స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆ జీతంతో సంతృప్తి చెందలేదు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్స్‌పై పట్టు సాధించిన అతను 2015 నుంచి నకిలీ సర్టిఫికెట్ల తయారీ ప్రారంభించాడు. కొన్నాళ్ల పాటు ఓ ప్రైవేట్ ఛానల్లో వీడియో ఎడిటర్‌గా పని చేసిన ఇమ్రాన్‌కు ఓ డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై హైదరాబాద్ నుంచి టిబెట్ వరకు వెళ్ళాలని, మార్గ మధ్యంలో తన అనుభవాలతో ట్రావెల్ వీడియో రూపొందించాలని భావించాడు. దీనికోసం ఎన్ఫీల్డ్ను కొనుగోలు చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అయితే అది కార్యరూపంలోకి రాకుండానే పోలీసులకు చిక్కి కటకటాల్లోకి చేరాడు. ఇతడు తయారు చేసిన సర్టిఫికెట్లలో సిటీ, కాకినాడల్లోని జేఎన్టీయూ, ఉస్మానియా వర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హేమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్ (ఆస్ట్రేలియా), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (విజయవాడ), కేఆర్ఎం యూనివర్శిటీ తదితరాలకు చెందినవి ఉన్నాయి. -
జగ్గారెడ్డి రిమాండ్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్ : నకిలీ పాస్‌పోర్ట్‌లతో అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం జగ్గారెడ్డిని పద్నాలుగు రోజులపాటు రిమాండ్‌కు తరలించింది. రిమాండ్ రిపోర్ట్‌లోని వివరాలు.. 2004లో నిర్మల, విజయ లక్ష్మి, భరత్‌ల పేర్లతో పాస్‌పోర్ట్‌లు పొందారు. ఏజెంట్ మధు ద్వారా ముగ్గురిని తన భార్యా పిల్లల పేర్లతో అమెరికాకు పంపేందుకు 15 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూతురు విజయ లక్ష్మి పేరుతో శ్రీ తేజ జూనియర్ కాలేజీ నుంచి బోనఫైడ్ సంపాదించారు. ఆమె పుట్టిన రోజును 1987 సెప్టెంబర్ 3గా పేర్కొన్నారు. కొడుకు భరత్ సాయి రెడ్డి పేరు కోసం సంగారెడ్డిలోని కరుణ స్కూల్ నుంచి బోనోఫైడ్, క్యారెక్టర్ సర్టిఫికెట్స్ పొందారు. అతని పుట్టిన రోజును 1989 మార్చి 5గా పేర్కొన్నారు. ఈ వివరాలు జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల్లో తేడాలున్నాయి. పాస్‌పోర్ట్ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్, గతంలో జగ్గారెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన రాజేందర్ తో పాటు మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. భార్య పిల్లలుగా పాస్పార్ట్ల్లో ఉన్న ఫొటోలు జగ్గారెడ్డి ఫ్యామిలివీ కాదని రాజేందర్ తెలిపారు. వీసా పొందిన తరువాత తన స్నేహితుడు కుసుమ కుమార్ తో కలిసి ఆ ముగ్గుర్ని జగ్గారెడ్డి న్యూ యార్క్ తీసుకెళ్ళారు. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్ట్ వీసాలు పొంది దేశ భద్రతకు ముప్పు తెచ్చారు. 2016లో తన పాస్ పోర్ట్ పోయిందని కొత్త పాస్ పోర్ట్ కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. -
‘జగ్గారెడ్డి పారిపోయే అవకాశం లేదు’
సాక్షి, హైదరాబాద్ : అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. సికింద్రాబాద్‌లోని 18వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పరిచారు. 14 రోజులు జగ్గారెడ్డిని రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ నెల 25 వరకు ఆయన చంచల్‌గూడ జైలులో ఉండనున్నారు. అయితే, జగ్గారెడ్డి అరెస్టును ఆయన న్యాయవాది దామోదర్ రెడ్డి తప్పుబట్టారు. 2007లో రషీద్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలంలో జగ్గారెడ్డి పేరు లేదని, 2007 నుంచి 2014 వరకు అనేక మంది ఎమ్మెల్యేలు పాస్‌పోర్ట్‌లు తీసుకున్నారని, జగ్గారెడ్డి కుటుంబసభ్యుల పేర్ల మీద నకిలీ పాస్‌పోర్ట్‌లు తీసుకుంటే.. ప్రభుత్వ అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బొండా మార్కెట్ పోలీసులు సుమోటోగా కేసు రిజిస్టర్ చేశారని, ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని, జగ్గారెడ్డి అరెస్ట్ పూర్తిగా న్యాయసూత్రాలకు విరుద్దమని అన్నారు. అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్ట్‌కు నిరసనగా.. సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు బంద్‌ను ప్రకటించారు. ఈ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మాజీమంత్రి సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నర్సాపూర్‌లో ధర్నా చేస్తుండగా.. అరెస్టు చేసి పుల్కల్ మండలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెయిల్‌పై కొనసాగుతున్న వాదనలు.. అరెస్ట్‌లో భాగంగా పోలీసులు నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 370 సరికాదంటూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని జగ్గారెడ్డి తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. 2004లో సంఘటన జరిగితే... ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని.. విశ్వసనీయ సమాచారమంటున్నారని.. సమాచారం ఎవరిచ్చారో రిమాండ్ రిపోర్ట్‌లో కూడా తెలుపలేదని ఆయన అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారని, ప్రస్తుతం రాజకీయ నేతగా కొనసాగుతున్నారని.. జగ్గారెడ్డి పారిపోయే అవకాశం లేదని.. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తాడని.. బెయిల్ మంజూరు చేయవలిసిందిగా న్యాయస్థానాన్ని కోరారు. జగ్గారెడ్డి 15 లక్షలు తీసుకున్నారు: డీసీపీ సుమతి -
జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. 2004లో ఆయన బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై పాస్‌పోర్టు అధికారుల ఫిర్యాదుతో నార్త్‌జోన్‌లోని మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సోమవారం రాత్రి పటాన్చెరు ప్రాంతంలో ఉన్న జగ్గారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మార్కెట్ పోలీసులకు అప్పజెప్పారు. మరో బృందం మెదక్ జిల్లాలో ఉన్న ఆయన అనుచరుడిని (అప్పట్లో ఆయనకు పీఏగా పనిచేశారు) అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించింది. ప్రస్తుతం వారిద్దరినీ పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వారు అక్రమ రవాణా చేసిన గుజరాతీయులు ఎవరనేది గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆ గుజరాతీయులు అమెరికాలోనే ఉన్నట్లు అనుమానాలున్నాయని చెబుతున్నారు. ఏ దళారుల ద్వారా జగ్గారెడ్డి ఈ అక్రమ రవాణాకు అంగీకరించారు.. ప్రతిఫలంగా ఆయనకు ఏం దక్కింది తదితర అంశాలను విచారిస్తున్నారు. జగ్గారెడ్డి అరెస్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. జగ్గారెడ్డి వద్ద పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2007లో ఓ ఎంపీ అరెస్ట్‌తో కదిలిన డొంక... 2007లో ఢిల్లీ పోలీసులు బాబూభాయ్ ఖటారా అనే ఎంపీని అరెస్టు చేశారు. ఈ అరెస్టుతోనే దేశంలో తొలిసారిగా మనుషుల అక్రమ రవాణా డొంక కదిలింది. అనివార్య కారణాల నేపథ్యంలో గుజరాతీయులకు అప్పట్లో అమెరికా వీసాలను నిలిపివేసింది. విజిట్ సహా వివిధ రకాల వీసాలపై తమ దేశం వచ్చే గుజరాతీయులు అక్రమంగా స్థిరపడిపోతున్నారని ఆరోపిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో గుజరాతీయుల అక్రమ రవాణాకు దేశంలో నాంది పడి క్రమంగా జోరందుకుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ముఠాలుగా ఏర్పడిన దళారులు రాజకీయ నాయకులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వారికి డిప్లొమాటిక్ పాస్‌పోర్టులు సహా మరికొన్ని సదుపాయాలు ఉండటంతో డబ్బు ఆశజూపి అనేక మంది ప్రజాప్రతినిధులను తమ దారిలోకి తెచ్చుకున్నారు. గుజరాతీయులను ఆయా రాజకీయ నాయకుల భార్య, పిల్లలుగా చూపిస్తూ నకిలీ పత్రాలు సృష్టించి పాస్‌పోర్టులు పొందేవారు. ఈ పాస్‌పోర్టుల ఆధారంగా తమ లెటర్హెడ్లను వినియోగించి వీసా కోసం ఆయా కాన్సులేట్లకు లేఖలు రాసే వారు. వాటి ఆధారంగా గుజరాతీయులకు అమెరికా వీసాలు లభించేవి. ఇలా గుజరాతీయులను తమతోపాటు తీసుకెళ్లి అమెరికాలో వదిలేసి వచ్చేవాళ్లు. 2007లో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టు తరవాత దానికి కొనసాగింపుగా హైదరాబాద్‌లోనూ కొన్ని అరెస్టులు జరిగాయి. -
ఇచ్చట అన్ని డాక్యుమెంట్లు అమ్మబడును!
సాక్షి, హైదరాబాద్ : అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా కోసం దాఖలు చేయాల్సిన పత్రాలు నకిలీవి తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సూత్రధారిగాని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఏజెంట్ల కోసం గాలిస్తున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. భూపాలపల్లికి చెందిన డి.విష్ణువర్ధన్ బతుకుతెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. బీటెక్ మధ్యలోనే మానేసిన ఇతగాడు తొలినాళ్లల్లో అనేక కన్సల్టెన్సీల్లో పని చేశాడు. ఈ నేపథ్యంలోనే విష్ణుకు వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన వచ్చింది. దీంతో 2013 నుంచి బంజారాహిల్స్ నెం.12లో తానే ఓ వీసా ప్రాసెసింగ్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశాడు. నగరం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రస్తుతం విదేశాల్లో 14 మందిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లాలని భావిస్తున్న వారిని ఏజెంట్లు విష్ణు వద్దకు పంపేవారు. ఆ వ్యక్తి పేరుతో యూజర్ ఐడీ క్రియేట్ చేసి వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసే విష్ణు అప్లికేషన్ సైతం డౌన్లోడ్ చేసేవాడు. వీసా ఇంటర్వ్యూ పై తర్ఫీదు ఇచ్చేవాడు. వీటితో పాటు ప్రాసెసింగ్‌కు అవసరమైన పత్రాలు నకిలీవి తయారు చేసి అందిస్తున్నాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు దాదాపు 100 మందికి ప్రాసెస్ చేసి భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై స మాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు దాడి చేసి విష్ణును ప ట్టుకున్నారు. అతడి నుంచి 18 బోగస్ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్,ప్రింటర్స్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
గల్ఫ్ గాయం
గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల బాధలు చెప్పలేకుండా ఉన్నాయి. బోగస్ ఏజెంట్లు, నకిలీ వీసాలు, విజిట్ వీసాలను ముట్టజెప్పి కంపెనీ వీసాలుగా నమ్మిస్తే.. గంపెడాశతో గల్ఫ్ వెళ్లిన అనేక మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గల్ఫ్‌లో ఎంత మంది ఉంటారనే కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వం వద్ద కూడా లేకపోగా, గల్ఫ్ బాధితుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 240 గ్రామాల నుంచి 60 వేల మందికి పైగా గల్ఫ్ బాట పట్టారు. జగిత్యాల, రాయికల్, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట, చందుర్తి, కోహెడ, బెజ్జంకి, గన్నేరువరం, రామడుగు, ధర్మారం, వెల్గటూరు, జూలపల్లి, కమలాపూర్ తదితర మండలాల నుంచి వలస వెళ్లారు. సౌదీ అరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమాన్, కువైట్, ఖతర్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన మనోళ్ల గోస వర్ణణాతీతంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో నకిలీ ఏజెంట్ వ్యవస్థనే శాసిస్తోంది. విదేశాల్లో ఉన్న ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రిక ప్రకటన ఇవ్వాలి. స్థానికులు, అధికారుల అనుమతి పొంది ఉండాలనే నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. వీటిని పాటించని కంపెనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వాళ్ల డిపాజిట్ జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ.. స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు బహిరంగంగా నకిలీ ఏజెంట్లు నిర్వహించే ఇంటర్వూ్యలు, జారీ చేసే ప్రకటనలపై కఠినంగా వ్యహరించటం లేదు. కాగా.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తామని, పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించే పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల్లో బోగసే ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల వరకు ఇలాంటి ఏజెన్సీలు ఉంటే.. అందులో రెండు ప్రభుత్వ కంపెనీలను కలుపుకుని మొత్తం 31 కంపెనీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్‌లు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓంకాం), తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకొల్పిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టాంకాం)తోపాటు 29 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేవలం ఐదింటికీ మాత్రమే అనుమతి ఉండగా.. ఉపాధి వేటలో అలసిపోయిన వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్నచిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకులు ఇక్కడి యువకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు చేతిలో పడ్డాక మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. విజిట్ వీసాలపై వెళ్లిన వారికి పని దొరక్క.. ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ పొంతనలేక వలస జీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశం తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు. నామమాత్రంగా టామ్‌కాం పాత్ర..పత్తాలేని ఎన్ఆర్ఐ పాలసీ.. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కాం పాత్ర నామమాత్రంగా మారింది. నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉన్న ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు ఉద్దేశించిన ఈ సంస్థ క్రియాశీల పాత్ర పోషించడం లేదనే చెప్పొచ్చు. గల్ఫ్‌లో ఉన్న కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే పాత్రను పోషించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వూ్యలు నిర్వహించి వీసాలు ఇప్పించాల్సిన బాధ్యతను విస్మరించింది. దాదాపు మూడు వేల మంది యువకులు ఇప్పటికే టామ్కాంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తుండగా, టామ్‌కాం క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్ల బారిన పడి అనేక మంది మోసపోతున్నారు. గడిచిన రెండేళ్లలో టామ్‌కాం ద్వారా రెండు వందల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు చెబుతున్నప్పటికీ.. వీరిని కూడా వయా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటంతోపాటు మంత్రి కేటీఆర్‌కు అప్పగించడంతో గల్ఫ్‌లో ఉన్న పూర్వ కరీంనగర్ వాసుల్లో ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ పాలసీని రూపొందిస్తామని ప్రకటించారు. 2016 జూన్‌లో గల్ఫ్‌లో తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి పాటుపడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. తగ్గని గల్ఫ్ చావులు.. ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఆశల సౌధంలో గల్ఫ్ బాట పడుతున్న పలువురు అక్కడే మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందితే.. అక్కడ చేసే పని సరిగా లేక, జీతం సరిగా రాక గుండె పోటుకు గురవ్వడం.. లేకుంటే అనారో గ్యం పాలవ్వడంతో చనిపోతున్నారు. దీం తో ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు దిక్కుతోచని స్థితి లో పడుతున్నాయి. గల్ఫ్‌కు వెళ్లే సమయంలో చేసిన అప్పులు తీర్చలేక.. పిల్లల్ని సాకలేక నానా యాతన అనుభవిస్తున్నారు. ఎట్లా బతికేది అంటూ దుఃఖసాగరంలో మునుగుతున్నారు. గడిచిన ఏడాదిలో సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోనే 54 మందికి పైగా మృతిచెం దారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గల్ఫ్ బాధితుల డిమాండ్లు ♦ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ♦ సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లోనూ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. ♦ విదేశాలలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ♦ విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి. ♦ తెల్లకార్డు ఉంటేనే.. మృతదేహాన్ని విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలి. ♦ గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించా లి. అందులో వలసల కారణాలు, ఏయే జిల్లా ల నుంచి వలసలు ఉన్నాయో తెలుసుకోవాలి. ♦ కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు ప్రత్యేక ఇన్సూ్యరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వలస వెళ్లిన కార్మికుల పేర్లను రేషన్‌కార్డుల జాబితా నుంచి తొలగించవద్దు. ♦ వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలి. కేంద్రం చేయాల్సినవి.. ♦ ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి. ♦ హైదరాబాద్‌లో సౌదీ ఎంబసీని ఏర్పాటు చేయాలి. -
శిరీష కేసులో కొత్త కోణం
పట్నంబజారు(గుంటూరు): విద్యార్థులను ఇటలీకి పంపిన వీసాల కేసులో గత 18న ఆత్మహత్యకు పాల్పడిన ఇంటూరి శిరీష (29) కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుమారు రెండు వందల మంది విద్యార్థులకు సంబంధించిన వీసాల విషయంలో ముంబైలోని కన్సల్టెన్సీ నకిలీదని పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు పాతగుంటూరుకు చెందిన పోలీసులు ముంబై వెళ్లారు. అయితే ముంబైలోని మెహాతారోడ్ కృష్ణకుంజ్ ప్రాంతంలో ఉన్న గగన్‌దీప్ కార్యాలయానికి వెళ్లిన గుంటూరు పోలీసులు సైతం కంగుతున్నారు. పూర్తిస్థాయిలో గుంటూరుకు పంపని వీసాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని గగన్‌దీప్ కన్సల్టెన్సీ నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. కనీసం పోలీసులకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవటంతో పోలీసులు వెనుదిరిగి వచ్చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణపై మరింత దృష్టి సారించిన పోలీసులు ముంబై నుంచి గుంటూరుకు వచ్చిన కొరియర్ ఆధారంగా అక్కడి కొరియర్ కార్యాలయాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి సమాచారం కొరవడటంతో సదరు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటలీలో ఉన్న తలశిల కిషోర్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ బృందంతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరి వీసాలు ఎలా వచ్చాయి? ముంబైలో గగన్‌దీప్ కన్సలెటెన్సీ, కొరియర్ కార్యాలయ నిర్వాహకుల నుంచి కొద్దిపాటి సమాచారం ఆధారంగా కొరియర్ ద్వారా కూడా వీసాలు వచ్చేందుకు అవకాశంలేదని, శిరీషను మోసం చేసిన వ్యక్తులే కొరియర్లా నకిలీ వీసాలను పంపి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నకిలీ వీసాలు తయారు చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు వర్గాలు చర్యలు చేపడుతున్నారు. -
గల్ఫ్ కన్నీళ్లు ఇంకెన్నాళ్లు?
తెలంగాణలో గల్ఫ్ మాయాజాలం మళ్లీ మొదలైంది. పొట్టచేతబట్టుకొని ఎడారి దేశాలకు వెళ్లి మోసపోతున్న వలస జీవుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. బోగస్ ఏజెంట్లు.. నకిలీ వీసాలు, విజిట్ వీసాలు అంటగట్టి ఎన్నో కుటుంబాలను నట్టేట ముంచుతున్నారు. గల్ఫ్ బాధితులకు అండగా ఉండేందుకు ప్రత్యేక ఎన్ఆర్ఐ పాలసీ తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినా ఆ దిశగా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. ఫలితంగా గల్ఫ్ కన్నీటి గాథలు రోజుకోచోట వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు పది లక్షల మంది తెలంగాణవాసులు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అనధికార లెక్కలున్నాయి. వీరికి తోడు.. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఆ దేశాలకు పయనమవుతున్నారు. ఉన్న ఊరిలో పని దొరక్కపోవటం.. అక్కడికి వెళ్తే ఏదో ఓ పని చేసుకోవచ్చనే మొండి ధైర్యం.. ఇక్కడ ‘రూపాయి’ కష్టానికి అక్కడ పది రూపాయలొస్తాయనే ఆశలు.. తెలంగాణ యువతను గల్ఫ్ బాట పట్టేలా ప్రేరేపిస్తున్నాయి. వీరి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ నకిలీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. ఉత్తర తెలంగాణలో పెరిగిపోతున్న వీరి ఆగడాలు, ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు, ఎన్ఆర్ఐ పాలసీపై ఫోకస్... – బొల్గం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి గల్ఫ్ దేశాల్లో ఉపాధితోపాటు పాస్‌పోర్టులు మొదలు వీసాలు, టికెట్ల సేవలందించేందుకు తెలంగాణలో దాదాపు 2,800 మంది ఏజెంట్లున్నారు. వీరిలో 2,772 మంది బోగస్ ఏజెంట్లే. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన లైసెన్స్డ్ కంపెనీలు కేవలం 28. అందులో రెండు ప్రభుత్వ ఏజెన్సీలే. అవి ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (ఓమ్కాం), తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కాం). వీటితోపాటు మరో 26 కంపెనీలకు మాత్రమే ఈ లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్న కంపెనీలను మాత్రమే ఆశ్రయించాలనే ప్రచారం లేకపోవటంతో వలస జీవులు బోగస్ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. చిన్న చిన్న కంపెనీలు పంపే వీసాలు, విజిట్ వీసాలు చూపించి ఏజెంట్లు అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ‘విజిట్ వీసాలతో వెళ్తే.. అక్కడేదైనా పని వెతుక్కోవచ్చు.. తిరిగి వచ్చేటప్పుడు రెండుమూడు రోజులు జైల్లో ఉంటే వాళ్లే పంపిస్తారు..’ అని మాయమాటలు చెప్పి సాగనంపుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక వీసాలు చెల్లక.. పని దొరక్క.. దొరికినా ఇక్కడ ఏజెంట్లు చెప్పిన జీతానికి అక్కడ ఇచ్చే జీతానికి పొంతన లేక వలసజీవులు చిత్తవుతున్నారు. తిరిగి సొంత దేశానికి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ ఉంటే పక్కాగా.. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు జరిపే కంపెనీలు విధిగా కేంద్ర విదేశాంగ శాఖ లైసెన్స్ పొంది ఉండాలి. కేంద్రం వద్ద రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలి. వారికి అనుమతించిన పరిధిలోనే నియామకాలు జరపాలి. ఉద్యోగ వివరాలతో పత్రికా ప్రకటన ఇవ్వాలి. వీటిని పాటించని కంపెనీలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం వాళ్ల డిపాజిట్‌ను జప్తు చేస్తుంది. లైసెన్స్ రద్దవుతుంది. కానీ స్థానికంగా పోలీసు, రెవెన్యూ విభాగాలు నకిలీ ఏజెంట్లు బహిరంగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా, ప్రకటనలు జారీ చేస్తున్నా కఠినంగా వ్యవహరించటం లేదు. సిరిసిల్ల జిల్లా ఒక్కటే ఆదర్శం గల్ఫ్ మోసాలు, బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం బోగస్ ఏజెంట్ల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుంచి గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. అందుకే లైసెన్స్ లేని ఏజెంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సిరిసిల్ల జిల్లాలో పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. లైసెన్స్ లేని ఏజెంట్లందరినీ బైండోవర్ చేసి.. గల్ఫ్ వీసాలు ఇప్పించే ట్రావెల్ ఏజెన్సీలన్నీ మూసేయించింది. మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ ముందుకుసాగలేదు. దీంతో క్రమంగా ఈ చర్య అడ్డదారులకు తావిచ్చింది. ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలోని ఏజెంట్లు ఇతర జిల్లాలకు వెళ్లి వీసాలు అమ్ముకుంటూ తమ దందాను ఎప్పట్లాగే కొనసాగిస్తున్నారు. కేటీఆర్‌పైనే ఆశలు.. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాని బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. దీంతో గల్ఫ్‌లో ఉన్న తెలంగాణవాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. నకిలీ ఏజెంట్లను అరికట్టడంతోపాటు మృతదేహాల తరలింపు, పెన్షన్లు, ఎక్స్‌గ్రేషియా తదితర అంశాలతో ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ పాలసీ రూపొందిస్తామని మంత్రి ప్రకటించారు. గల్ఫ్‌లో తెలంగాణవారి సంక్షేమానికిపాటు పడే సంస్థలు, వివిధ సంఘాల ప్రతినిధులతో ఎన్ఆర్ఐ పాలసీ ముసాయిదా తయారీకి గతేడాది జూలై 27న ప్రత్యేకంగా సదస్సు నిర్వహించారు. కానీ ఇప్పటికీ ఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించకపోగా.. సదస్సులో వివిధ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అమలుకు నోచుకోలేదు. పత్రికల్లో వచ్చే వార్తలు, బాధితుల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు గల్ఫ్ జైళ్లలో చిక్కుకున్న వారు, మృతదేహాలను స్వదేశాలకు రప్పించేందుకు పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవటం తప్ప.. విధాన ప్రకటన దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెల్లకార్డుకు మృతదేహానికి లింక్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌తోపాటు సింగపూర్, మలేసియా తదితర దేశాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు, వివిధ కారణాలతో ఏటా దాదాపు 200 మందికిపైగా తెలంగాణవాసులు చనిపోతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గల్ఫ్ దేశాలలో దాదాపు 540 మంది చనిపోయారు. వారిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించగా.. స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని మృతదేహాలు నెలల తరబడి నిరీక్షించిన తర్వాత స్వదేశానికి చేరాయి. మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కొంతకాలంగా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నా ఇప్పటికీ నెరవేరలేదు. విదేశాల నుంచి వచ్చే మృతదేహాలను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుతో ముడిపెట్టింది. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ నిబంధనను సడలించి అందరికీ అంబులెన్స్ సదుపాయం కల్పించాలని, ఎయిర్‌పోర్ట్‌లో గల్ఫ్‌కు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి వివిధ సంఘాలు విజ్ఞప్తి చేసినా అమలుకు నోచుకోలేదు. కామ్‌గా.. టామ్‌కాం నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేయటంతోపాటు గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలకు తెలంగాణలోని యువతను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రెండేళ్ల కిందట టామ్‌కాం ఏజెన్సీని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని.. ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కాం క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంది. జిల్లాల్లోని ఉపాధి కల్పన కేంద్రాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతకు టామ్‌కాం ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వీసాలు ఇప్పించాలి. దాదాపు 30 వేల మంది యువకులు ఇప్పటికే టామ్కాంలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే సంస్థ క్రియాశీలంగా వ్యవహరించకపోవటంతో నకిలీ ఏజెంట్లు చెలరేగిపోతున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 2 వేల మందిని గల్ఫ్‌కు పంపించినట్లు ఈ ఏజెన్సీ చెబుతున్నా.. వారిని కూడా ప్రైవేటు ఏజెన్సీల ద్వారానే పంపించారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకూ ఈ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయలేదు. ఇటీవల నల్లగొండ జిల్లాకు చెందిన బోయపల్లి రంగారెడ్డిని ప్రభుత్వం టామ్‌కాంకు చైర్మన్‌గా నియమించింది. గల్ఫ్ వలసలు తక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఈ నియామకం చేపట్టడం కూడా గల్ఫ్ బాధిత వర్గాల్లో చర్చకు తెరదీసింది. గల్ఫ్‌లో ఉన్నవారెందరు? తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారెందరన్న వివరాలు ప్రభుత్వం దగ్గర కూడా పక్కాగా లేవు. దాదాపు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ఉన్నట్లు గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్‌తోపాటు గల్ఫ్‌లో తెలంగాణవాసుల సంక్షేమానికి పని చేసే సంఘాలు చెబుతున్నాయి. పలు ఏజెన్సీల లెక్క కూడా ఇంచుమించు ఇంతే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య 97 వేలు మాత్రమే అని తేలింది. ఓటుహక్కు, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు కత్తిరిస్తారనే భయంతో గల్ఫ్‌కు వెళ్లిన వారి కుటుంబీకులు సర్వేకు వచ్చిన బృందాలకు తప్పుడు సమాచారం ఇచ్చారని, అందుకే ఈ సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందనే వాదనలున్నాయి. అందుకే రాష్ట్రం నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించడానికి మరో సమగ్ర సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈ సర్వే ఖర్చులో సగం భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సర్వేతో వలసకు కారణాలు, సామాజిక, ఆర్థిక కోణం, వలస వెళ్ళిన వారి సంఖ్య, వారి విద్యార్హతలు, సాంకేతిక పరిజ్ఞానం, వయసు, ఏయే దేశాలకు ఏయే జిల్లాల వారు వెళ్తున్నారనే విషయాలు తెలుస్తాయి. ఈ సర్వే ఆధారంగా ఎన్ఆర్ఐ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు పక్కాగా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి గల్ఫ్‌లో విపత్కర పరిస్థితులున్నాయి. తెలంగాణ వచ్చాక తమకు భరోసా ఉంటుందనే ధీమా ప్రవాసీయుల్లో సడలుతోంది. ఇటీవల ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరిగిపోయింది. 2009లో ఇలాంటి పరిస్థితి ఉండేది. క్యాంపులకు వెళ్లి కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఇటీవలే ఇద్దరు సిరిసిల్ల ప్రాంతానికి చెందిన యువకులు కంపెనీ వీసా అని మోసపోయి విజిట్ వీసాతో గల్ఫ్‌కు వెళ్లి ఇబ్బందుల్లో పడ్డారు. గత నెలలోనే 14 మంది జగి త్యాలæ ప్రాంత వాసులు ఓ ఏజెంట్‌ను నమ్మి కంపెనీ వీసా ఇప్పిస్తామంటే దుబాయ్‌కి విజిట్ వీసాపై వెళ్లారు. అక్కడికెళ్లాక ఇరుకైన గదిలో ఉంచి ఇబ్బందుల పాల్జేశారు. తిరిగి వెళ్దామంటే వీసా టైం అయిపోయింది. రిటర్న్ టికెట్ లేదు. పాస్‌పోర్టు లేదు. విజిట్ వీసాలు వేరు. ఉద్యోగ వీసాలు వేరు. ఏజెంట్ల మాయమాటలు నమ్మకండి. లెసైన్స్డ్ ఏజెన్సీలు నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా వెళితే ఉపాధికి గ్యారంటీ ఉంటుంది. లైసెన్స్ లేని ఏజెంట్లను పోలీసులకు పట్టించండి. గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా ఉండేలా ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపకల్పన చేయాలి. ఏటా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలి. టామ్‌కాం కార్యకలాపాలను విస్తరించి నిరుద్యోగులకు చేరువ చేయాలి – జువ్వాడి శ్రీనివాసరావు, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్రోకర్లను నియంత్రిస్తాం గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కొన్ని ఏజెన్సీలు పెద్ద మొత్తంలో దండుకుంటున్నాయి. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పుచ్చుకుని విదేశాలకు పంపుతున్నాయి. అక్కడ ఉద్యోగం దొరి కిందా సరే.. లేకుంటే అంతే సంగతి. బ్రోకర్ సంస్థల ఆటలను కట్టడి చేసేందుకే టామ్‌కాం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తర ఫున ఎంపికై వెళ్లడమే శ్రేయస్కరం. త్వరలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తున్నాం. – బోయపల్లి రంగారెడ్డి, టామ్‌కాం చైర్మన్ త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ఓవర్సీస్లో పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి డిమాండ్ ఉన్నా రిజిస్ట్రేషన్ పెరగడం లేదు. ప్రస్తుతం టీఎస్ ఆన్లైన్ కేంద్రా ల్లోనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. త్వరలో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పటివరకు 79 మందికి గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా గల్ఫ్‌దేశాల్లో ఉద్యోగం పొందడమే మంచిది. టామ్‌కామ్ సంస్థపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తాం. ఈ మేరకు జిల్లాల్లో ఉన్న ఉపాధి కల్పన అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రతి జిల్లాలో మైగ్రేట్ రిసోర్స్ కేంద్రాలను తెరుస్తాం. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి వివరాలను అందులో నమోదు చేస్తాం. అక్కడ డిమాండ్ ఉన్న కొలువులకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నాం. – కేవై నాయక్, టామ్‌కాం మేనేజింగ్ డైరెక్టర్ నకిలీ వీసాతో మోసం నేను డిగ్రీ వరకు చదువుకున్న. భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. ఊళ్లో భూమి లేదు. కొన్నేళ్లుగా కూలీ పనులు చేసి బతుకుతున్న. వచ్చే కూలీతో మా కుటుంబం గడవడం కష్టంగా మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింహులపల్లెలో ఓ మహిళా ఏజెంట్ పరిచయమైంది. ఖతార్‌లో మంచి పని, వేతనం ఉందని చెప్పింది. నా తల్లి, భార్య వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టి రూ.70 వేలు తెచ్చి కట్టిన. 15 రోజుల్లోగా ఖతార్‌కు పంపిస్తానని చెప్పి నకిలీ వీసా, నకిలీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి మోసం చేసింది. డబ్బులు, పాస్‌పోర్టు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. – వంగపెల్లి భూపతి, కనగర్తి, కోనరావుపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా డబ్బులు మిత్తికి తెచ్చిన.. నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన. కూలీకి పోతే కుటుంబం గడుస్తలేదు. అందుకే గల్ఫ్ పోదామనుకున్న. మా గ్రామానికి చెందిన మల్లేశం ద్వారా ప్రమీల అనే ఏజెంట్‌కు డబ్బులు కట్టిన. ఖతార్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తమన్నరు. రెండ్రూపాయల మిత్తికి రూ.70 వేలు తెచ్చి ముట్టజెప్పిన. పాస్‌పోర్టు కూడా ఇచ్చిన. కానీ నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశారు. ఇప్పుడు ఏజెంట్, మధ్యవర్తి తప్పించుకు తిరుగుతుండ్రు. – రావులపెల్లి మల్లారెడ్డి, కనగర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ బాధితుల విజ్ఞప్తులివీ.. కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. విదేశాలకు వెళ్లే కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి విదేశాలకు వలస వెళ్లే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రవాసీ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వలస వెళ్లే కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చైతన్య సదస్సులు నిర్వహించాలి మోసపోయి తిరిగొచ్చిన వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వారి అనుభవాన్ని, వృత్తి నైపుణ్యాన్ని వినియోగించుకోవాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేయాలి. నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రతి సబ్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి సచివాలయంలోని ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి వలసవెళ్లిన వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించొద్దు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి. రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి. ఏజెంట్లను నియంత్రించాలి. విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయ సహాయం చేసి, వారి విడుదలకు కృషి చేయాలి విదేశాల్లోని భారతీయుల కోసం తక్షణం స్పందించే ఆన్లైన్ వ్యవస్థ ’మదద్’ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం) ఉంది. ఇదే తరహాలో గల్ఫ్ కుటుంబాలకు సాయమందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్)లో ప్రవాస భారతీయులందరూ చేరవచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలి. -
ఆస్ట్రేలియన్ వీసా రాకెట్ బట్టబయలు..
సిడ్నీ: భారతీయులకు ఉద్యోగాలు, విద్యావకాశాల పేరుతో నకిలీ వీసాలను అందిస్తున్న అతిపెద్ద నకిలీ వీసా రాకెట్ ను మెల్ బోర్న్ లో నివసిస్తున్న భారతీయుడు బట్టబయలు చేశారు. దాదాపు 40 మంది భారతీయులకు ఈ స్కాంతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మెల్ బోర్న్ లోని ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్న జస్విందర్ సిద్దూ ను కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి భారతీయులకు వీసాలు కావాలంటే ఏర్పాటు చేస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, విద్యార్థులు ఎవరైనా ఆస్ట్రేలియాలో చదువుకోవాలంటే వీసాలు ఇప్పిస్తానంటూ సంప్రదించాడు. ఒక వ్యక్తికి ఉద్యోగానికి గానీ, చదువు కోసం గానీ వీసాను ఏర్పాటు చేస్తే ఐదు వేల యూఎస్ డాలర్లను సిద్దూకి ఆఫర్ చేశాడు. మెకానిక్స్, హోటల్ మేనేజ్ మెంట్, ఐటీ రంగాల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తెలిసిన వారు ఉంటే తనకు చెప్పాలని అడిగాడు. కాగా, సిద్దూ ఆ వ్యక్తి తో జరిపిన సంప్రదింపులన్నింటినీ హిడెన్ కెమెరా ద్వారా రికార్డు చేసి కేసును బలపరిచేందుకు దీనిని సాక్ష్యంగా ఉపయోగించారు. స్కాంపై మాట్లాడిన సిద్దూ.. గత పదేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నానని చెప్పారు. వీసా సమస్యలు వస్తే ఇక్కడి ఉద్యోగ సంస్థలు భారతీయులను రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయని, పెద్ద ఎత్తున వీసా మోసాలు జరుగుతున్నాయని తరచూ తన దృష్టికి వచ్చేదని తెలిపారు. వీటన్నింటినీ బయటపెట్టి ముఠా ఆట కట్టించాలని తాను భావించినట్లు వివరించారు. అనుకున్నట్లే తనను సంప్రదించిన వ్యక్తికి తెలియకుండా మొత్తం స్కాంను రికార్డు చేసినట్లు చెప్పారు. ఈ స్కాంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని తెలిపారు. పెద్ద స్థాయిలో ఉన్న ఆస్ట్రేలియన్ అధికారులకు, కొంతమంది భారతీయులకు స్కాంతో సంబంధం ఉందని వివరించారు. -
నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ అరెస్ట్
శంషాబాద్: నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రేణుక(35) ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతుండగా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద ఉన్న వీసా నకిలీదిగా గుర్తించి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. అయితే తాను ఏజెంట్ చేతిలో మోసపోయానంటూ సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ వీసాలు సృష్టిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏకంగా నకిలీ వీసాలనే సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఈ ముగ్గురు సభ్యుల ముఠాను మల్కాజ్గిరి డీసీపీ రామచంద్రారెడ్డి శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 45 నకిలీ పాస్‌పోర్ట్‌లు, రూ. 80 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
శంషాబాద్ లో నకిలీ వీసా ముఠా అరెస్టు
శంషాబాద్: నకిలీ వీసాలను తయారు చేసి, ఉపాధి పేరుతో పలువురు మహిళలను విదేశాలకు పంపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ పోలీసులు సోమవారం ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుబ్బిరెడ్డి, తూర్పు గోదావరికి చెందిన వెంకటేశ్వర్లు, డేవిడ్ రాజు, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎడ్ల శంకర్, మణికంఠతో పాటు అనంతపురం వాసి ఇలియాస్ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నకిలీ వీసాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
శంషాబాద్ : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ) పోలీసులకు అప్పగించారు. ఉపాధి నిమిత్తం ఏజెంట్ ద్వారా నకిలీ వీసా పొందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదీర్ బాషా(40) సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి యత్నిస్తుండగా అతడి వీసాను పరిశీలించిన అధికారులు నకిలీదిగా గుర్తించారు. వెంటనే అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇమిగ్రేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాతో ఓ మహిళ పట్టుబడింది. పట్టుబడ్డ మహిళ వైఎస్సార్ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. దుబాయ్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆమె పట్టుబడినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దేవయాని కేసులో అమెరికాపై ఒత్తిడి
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రాగడేపై అమెరికాలో నమోదైన అభియోగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని భారతప్రభుత్వం పేర్కొంది. 2013లో న్యూయార్క్‌లోని నకిలీ వీసా వినియోగం ఆరోపణలపై దేవయానిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత స్తబ్దత ఏర్పడింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని బుధవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. -
నకిలీ వీసా కలిగిన యూపీవాసి అరెస్టు
శంషాబాద్: నకిలీ వీసా కలిగిన ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయప్రకాష్ వర్మ (35) జెడ్డా వెళ్లడానికి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అతడి వద్ద వర్క్ పర్మిట్ వీసాతోపాటు నకిలీ విజిటింగ్ వీసా లభించింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వర్మను అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ వీసాలు, పాస్పోర్టుతో 12 మంది అరెస్ట్
సాక్షి, చెన్నై: నకిలీ వీసా, పాస్ పోర్టులతో నగరంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పది మంది యువకుల్ని, ఓ మహిళను, మరో వ్యక్తిని మీనంబాక్కం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ పది మంది యువకులు బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి వచ్చినట్టు తేలడంతో వారు తీవ్ర వాదులా..? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. మీనంబాక్కం జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ భద్రతా వలయాన్ని ఛేదించుకుని నకిలీ వీసా, పాస్ పోర్టులతో ఇక్కడి నుంచి విదేశాలకు, విదేశాల నుంచి ఇక్కడికి వెళ్లేందుకు యత్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర భద్రతకు సవాలుగా మారాయి. సింగపూర్, మలేషియా, శ్రీలంకల నుంచి ఈ నకిలీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరిలో కొందరు మాత్రం అధికారులకు చిక్కుతున్నారు. విచారణానంతరం కొందర్ని తిరిగి వెనక్కు పంపుతుండగా మరికొందర్ని అరెస్టుచేసి కటకటాల్లోకి పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఒకే విమానంలో పది మంది నకిలీ వీసాతో చెన్నైకు రావడం అధికారుల్ని ఆందోళనలో పడేసింది. వీరంతా తీవ్ర వాదులన్న ప్రచారం బయలు దేరడంతో మీనంబాక్కంలో కాసేపు కలకలం రేగింది. అదుపులో పది మంది మంగళవారం ఉదయం మలేషియా- కోలాలంపూర్ నుంచి టైగర్ విమానం చెన్నైకు వచ్చింది. ఆ విమానం నుంచి పది మంది యువకులు దిగారు. వీరి కదలికలు అనుమానా స్పదంగా ఉన్నట్టు నిఘా నేత్రాల ద్వారా భద్రతా సిబ్బంది గుర్తించారు. వీరంతా కలసికట్టుగా ముందుకు కదులుతుండడంతో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారి పాస్ పోర్టులు, వీసాలను తనిఖీ చేశారు. వీరికి నేతృత్వం వహిస్తున్న యువకుడి పేరు మహ్మద్‌గా గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారం, వివరాలు అన్నీ పొంతన లేకుండా పోయాయి. వీసాను పూర్తి స్థాయిలో పరిశీలించారు. చివరకు ఆ పది మంది వీసాలు నకిలీవిగా తేలాయి. వీరంతా ఇండో నేషియా - బంగ్లాదేశ్‌లోని ఢాకా, కోలాలంపూర్ మీదుగా చెన్నై కు వచ్చినట్టు తేల్చారు. అలాగే తిరుగు పయనానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. చెన్నై నుంచి రైలు మార్గం గుండా ఉత్తరాధి రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు వారు పేర్కొనడంతో అనుమానాలు నెలకొన్నాయి. వీరు తీవ్ర వాదులేమోనని మీనంబాక్కం పోలీసులకు అప్పగించారు. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి క్యూబ్రాంచ్, రా, ఇంటెలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నాయి. నకిలీ పాస్పోర్టుతో మరో ఇద్దరు అదే విమానంలో మరో ఇద్దరు నకిలీ పాస్ పార్టుతో రావడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చంటి బిడ్డతో ఓ మహిళ ఉన్నారు. ఆమె పేరు నజీర్ఖాన్గా గుర్తించారు. మరొకరి పాస్ పోర్టులో ఆమె ఇక్కడికి రావడంతో అనుమానం నెలకొంది. ఆమెనూ విచారిస్తున్నారు. అలాగే మణివణ్ణన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తిరువణ్ణామలైకు చెందిన ఇతడు ఓ హత్య కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో ఇతడ్ని అరెస్టు చేశారు. ఒకే రోజు పది మంది నకిలీ వీసాతో, మరో ఇద్దరు నకిలీ పాస్ పోర్టుతో వచ్చి చెన్నైలో పట్టుబడడం బట్టిచూస్తే, విదేశాల్లో ఏ మేరకు తనిఖీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అక్కడి నిర్లక్ష్యం, ఇక్కడి భద్రతను ప్రశ్నార్థకం చేస్తుండడం గమనార్హం.