నిందితుడు నితిన్‌కుమార్ అగర్వాల్
సుల్తాన్‌బజార్: వివిధ దేశాలలోని పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు వీసాలు, ఫ్లయిట్ టిక్కెట్‌లు ఇప్పిస్తానని దాదాపు 100 మంది వద్ద రూ.1కోటీ 32 లక్షలు మోసం చేసిన ఓ ట్రావెల్ ఏజెంట్‌ను శుక్రవారం సుల్తాన్‌బజార్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన నితిన్‌కుమార్ అగర్వాల్(38), బషీర్‌బాగ్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో యాస్ వెకేషన్స్ పేరిట ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా వివిధ దేశాలలో సందర్శక ప్రాంతాలను సందర్శించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నితిన్‌కుమార్‌ను ఆశ్రయించారు. దాదాపు 100 మంది వద్ద లక్ష నుంచి రెండు లక్షల చొప్పున వసూలు చేసిన నితిన్‌కుమార్ వారికి విసా, ప్లాయిట్ టికెట్లు ఇప్పించడంలో ఆలస్యం చేయడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు.
దీంతో సుల్తాన్‌బజార్‌కు చెందిన ఖలీల్, పాండురంగ మరో 20 మంది వద్ద ఈ జూన్ 22న యూరప్, థాయ్‌లాండ్, ఉజ్జయినీ లాంటీ ప్రాదేశాలకు తీసుకువెళ్లేందుకు వీసా, టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి వారి వద్ద రూ. 9.70 లక్షలు వసూలు చేశాడు. వినియోగదారులు తమ డబ్బు తమకు అప్పగించాలని ఒత్తిడి తీసుకురావడం, అప్పులు అధికం కావడంతో నితిన్‌కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్‌నోటు రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ నమోదు చేయించారు. అదే పోలీసుస్టేషన్‌లో నితిన్‌కుమార్ భా«ధితులు తమను చీటింగ్ చేశాడని సైతం కేసు నమోదు అయ్యింది. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్, నల్లకుంట ప్రాంతాలకు చెందిన భాధితులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ చంద్రమోహన్ కేసునమాదు చేసుకుని ధర్యాప్తులో భాగంగా బషీర్‌బాగ్‌లో నిందితుడు నితిన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించారు. తనకు వెండిబంగారు నగల దుకాణం ఉందని దానిలో ప్రయాణికుల వద్ద తీసుకున్న డబ్బును పెట్టడంతో నష్టం వచ్చిందని విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment