న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త, ఐఎఫ్‌ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రాగడేపై అమెరికాలో నమోదైన అభియోగాలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని భారతప్రభుత్వం పేర్కొంది. 2013లో న్యూయార్క్‌లోని నకిలీ వీసా వినియోగం ఆరోపణలపై దేవయానిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత స్తబ్దత ఏర్పడింది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని బుధవారం లోక్‌సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు.