నకిలీ వీసాలను తయారు చేసి, ఉపాధి పేరుతో పలువురు మహిళలను విదేశాలకు పంపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు.
శంషాబాద్ లో నకిలీ వీసా ముఠా అరెస్టు
Jan 25 2016 12:26 PM | Updated on Sep 3 2017 4:18 PM
శంషాబాద్: నకిలీ వీసాలను తయారు చేసి, ఉపాధి పేరుతో పలువురు మహిళలను విదేశాలకు పంపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ పోలీసులు సోమవారం ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి వీసాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సుబ్బిరెడ్డి, తూర్పు గోదావరికి చెందిన వెంకటేశ్వర్లు, డేవిడ్ రాజు, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎడ్ల శంకర్, మణికంఠతో పాటు అనంతపురం వాసి ఇలియాస్ ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement