సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో ఉన్న ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు, సిబ్బంది అప్రమత్తమయ్యాయి. విమానాల్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాంబుల బెదిరింపుల బెడద ఎక్కువ కావడంతో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికీ వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులపై కేంద్రం దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment