నకిలీ వీసా కలిగిన యూపీవాసి అరెస్టు | Uttar pradesh resident arrested to have Fake visa | Sakshi
Sakshi News home page

నకిలీ వీసా కలిగిన యూపీవాసి అరెస్టు

Nov 26 2014 1:32 AM | Updated on Sep 2 2017 5:06 PM

నకిలీ వీసా కలిగిన ప్రయాణికుడిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు.

శంషాబాద్: నకిలీ వీసా కలిగిన ప్రయాణికుడిని ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జయప్రకాష్ వర్మ (35) జెడ్డా వెళ్లడానికి మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అతడి వద్ద వర్క్ పర్మిట్ వీసాతోపాటు నకిలీ విజిటింగ్ వీసా లభించింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వర్మను అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement