రక్తపుటేరులు పారించిన రహదారులు
ప్రాణాలు కోల్పోయిన వందలాదిమంది
క్షతగాత్రులుగా మిగిలినవారెందరో..
కొత్త ఏడాదిలోనైనా రోడ్ల విస్తరణ జరిగేనా?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రహదారులు రక్తపుటేరులు పారిస్తున్నాయి. వాహనాల రద్దీ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం.. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటం.. ప్రమాదకర మైన మూల మలుపులే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం వెలుగు చూస్తూనే ఉంది. ఎవరో ఒకరు మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయినా పాలకుల్లో చలనం మాత్ర ం కలగడం లేదు. ప్రమాదాలను నియంత్రించే చర్య లు చేపట్టడం లేదు. కొత్త సంవత్సరంలోనైనా రోడ్ల వ్యవస్థ మెరుగుపడుతుందో లేదో వేచి చూడాల్సిందే.
2024లో తీరని విషాదం
విజయవాడ జాతీయ రహదారి ఇటు ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం వరకు విస్తరించి ఉంది. బీజాపూర్ జాతీయ రహదారి ఇటు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు విస్తరించి ఉంది. బెంగళూరు జాతీయ రహదారి ఆరాంఘర్ నుంచి షాద్‌నగర్ మండల వరకు విస్తరించి ఉంది. శ్రీశైలం జాతీయ రహదారి చాంద్రాయణగుట్ట నుంచి ఆమనగల్లు మండల శివారు వరకు విస్తరించి ఉంది. నాగార్జునసాగర్ జాతీయ రహదారి ఎల్బీనగర్ నుంచి యాచారం మండల శివారు వరకు విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరానికి మణిహారంగా గుర్తింపు పొందిన ఓఆర్‌ఆర్ ఇటు కోకాపేట నుంచి అటు తారామతిపేట వరకు విస్తరించింది. ఇక పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే సహా ఆర్ అండ్‌బీ, మున్సిపాలిటీ అంతర్గత రోడ్లు అనేకం ఉన్నాయి. ఆయా రహదారులు 2024లో జిల్లాలోని అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.
2025లోనైనా పనులు ప్రారంభమయ్యేనా?
ప్రమాదాలకు నిలయంగా మారిన బీజాపూర్ జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరణకు 29 ఏప్రిల్ 2022లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి శంకుస్థాపన చేశారు. టెండర్ కూడా ఖరారైంది. ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ఈ రహదారిపై నిత్యం రక్తపుటేరులు పారుతూనే ఉన్నాయి. ఇటీవల ఆలూరు స్టేజీ వద్ద రోడ్డు వెంట కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కేవలం ఈ ఒక్క రోడ్డుపైనే మూడేళ్ల వ్యవధిలో 379 ప్రమాదాలు చోటు చేసుకోగా>, సుమారు 400 మంది క్షతగాత్రులయ్యారు. 146 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓఆర్‌ఆర్‌పై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు మృతి చెందారు. ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచి్చన కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.నూతన సంవత్సరంలోనైనా విస్తరణ పనులు ప్రారంభమవుతాయో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment