Photo journalist
-
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్‌ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
ఫొటో జర్నలిస్ట్ గోపాల్‌పై దాడి
హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై దాడి చేసిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫొటో జర్నలిస్ట్ నగర గోపాల్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. స్వల్ప వివాదం కారణంగా మహేష్‌గౌడ్ అనే వ్యక్తి కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిన గోపాల్ ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. గోపాల్‌ను సహచర ఫొటో జర్నలిస్టులతో కలసి వారు పరామర్శించారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే గోపాల్‌పై దాడి చేసిన మహేష్గౌడ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
Photojournalist Smita Sharma: ఉయ్ క్రై ఇన్ సైలెన్స్
ఈ పరిశోధనాత్మక ఛాయాచిత్ర పుస్తకంలో ‘అయ్యో!’ అనిపించే జీవితాలు ఉన్నాయి. కన్నీటి సముద్రాలు ఉన్నాయి. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగి, పరిశోధించి దిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్ట్ రూపొందించిన ఈ పుస్తకం బాధిత హృదయానికి నిలువుటద్దం... దిల్లీలోని ఒక వ్యభిచార గృహం నుంచి పదిహేడు సంవత్సరాల యువతిని కాపాడారు పోలీసులు. ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటో జర్నలిస్ట్ స్మితాశర్మకు ‘తెలుసుకోవాల్సి విషయాలు చాలా ఉన్నాయి’ అనిపించింది. అలా తన పరిశోధన మొదలైంది. ఏడు సంవత్సరాలు ఎన్నెన్నో కష్టాలు పడి, ఎంతో పరిశోధించి ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ అనే ఫొటోబుక్ తీసుకువచ్చింది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో ఈ పుస్తకం ప్రచురితం అయింది. తన పరిశోధనలో భాగంగా స్మిత తెలుసుకున్న ముఖ్యవిషయం ఏమిటంటే, చాలా కేసుల్లో మానవ అక్రమ రవాణా అనేది బెదిరింపులతో బలవంతంగా జరగడం లేదు. అమ్మాయిల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని రకరకాల మోసాలతో ఉచ్చులోకి దించుతున్నారు. ఉదాహరణకు మీనా(పేరు మార్చడమైనది) ఒక రోజు మీనాకు ఒక యువకుడి నుంచి ఫోన్ వచ్చింది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకసారి కలవాలనుకుంటున్నాను’ అన్నాడు. రెండోరోజు మీనా దగ్గరకు వచ్చి ‘ వీరు మా అమ్మా,నాన్నలు’ అంటూ ఇద్దరిని పరిచయం చేసి పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ అద్దె తల్లిదండ్రులు కూడా తమ నటనతో రెచ్చిపోయారు. ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం’ అని నమ్మించారు. తన సోదరికి దిల్లీలో వస్త్రవ్యాపారం ఉందని, ఇద్దరం అక్కడే పనిచేద్దాం అన్నాడు యువకుడు. వీరి మాయమాటలు నమ్మి దిల్లీకి చేరిన మీనా దుర్మార్గుల బారిన పడింది. బంగ్లాదేశ్‌కు చెందిన 12 సంవత్సరాల బాలికకు కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయడం అనివార్యం అయింది. తమ కుటుంబంతో కాస్త పరిచయం ఉన్న ఒక వ్యక్తి ‘ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ తీసుకెళ్లి బ్రోతల్ హౌస్‌కు అమ్మేశాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ అమ్మాయి పోలీసుల సహాయంతో విముక్తి అయింది. ఒక ఆశ్రయంలో చేరింది. కొద్దిరోజులకు ఆమెకు ఒక మహిళ పరిచయం అయింది. ‘మీ దేశం తీసుకెళతాను’ అని నమ్మించి పశ్చిమ బెంగాల్‌లోని నమ్‌ఖానా అనే ఊరిలోని బ్రోతల్కు అమ్మేసింది... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ఎందరో బాధితులు ఉన్నారు. యాంటీ–హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్స్, లాయర్లు, పోలీస్ అధికారుల సహాయంతో మీనాలాంటి ఎంతోమంది అమ్మాయిలతో మాట్లాడింది స్మిత. దీనివల్ల అమ్మాయిల అమాయకత్వం, నేరగాళ్లు ఎన్ని రకాలుగా నమ్మిస్తారు? ఆ తరువాత ఎలా తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు? ఎలా మోసం చేస్తారు? మానవ అక్రమ రవాణా నేరవ్యవస్థ మూలాలు ఏమిటి?... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది స్మిత. కొన్ని ప్రాంతాలలో అమ్మాయిలు ఇల్లు ఎందుకు విడిచి పెట్టాలనుకుంటున్నారనే విషయానికి వస్తే కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తేవడం, వంట వండడం, బట్టలు ఉతకడం, పొలానికి వెళ్లి పనులు చేయడం... పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ అంతులేని బండచాకిరీతో తమకు తెలియకుండానే ఇల్లు, ఊరు దాటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే మోసగాళ్ల బారిన పడుతున్నారు. ‘సున్నితమైన అంశంపై పనిచేస్తున్నాను’ అనే ఎరుకతో కెమెరాను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది స్మిత. బాధితుల ముఖాలు కనిపించకుండా స్పాట్లైట్లు, షాడోస్... ఇతరత్రా క్రియేటివ్ మెథడ్స్‌ను ఉపయోగించింది. ‘లైట్లు, షాడోస్ నా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించాయి’ అంటుంది స్మితా శర్మ. హైదరాబాద్‌లో జరిగిన ‘ఇండియన్ ఫొటో ఫెస్టివల్–2022’లో పరిశోధనాత్మక ఫొటోబుక్ ‘ఉయ్ క్రై ఇన్ సైలెన్స్’ ఆవిష్కరణ జరిగింది. -
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
ఆదర్శ జీవితానికి కొలమానం
సుప్రసిద్ధ ఫొటో జర్నలిస్టుగా, ప్రజల జీవనాన్ని, వారి సంస్కృతిని జీవితాంతం తన కెమెరాకన్నులో బంధించి పేద ప్రజల బతుకు చిత్రాన్ని అక్షర సత్యంగా నాలుగు దశాబ్దాలకు పైగా అందిస్తూ వచ్చిన ప్రజా కళాకారుడు భరత్ భూషణ్. ఆయన నిజ జీవితంలో కూడా తిరుగులేని ఒక ఆదర్శ శిఖరం! భరత్ దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా తన కెమెరా కన్నుకు క్షణం విశ్రాంతి నివ్వలేదు. విద్యావంతురాలైన పేదింటి మహిళా రత్నం సుభద్రను ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత రెండు కుటుంబాలకు కనపడకుండా నెలల తరబడి కాదు, కొన్నేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని కూడా గడుపుతూ ఆమె జీవితాన్ని తీర్చిదిద్దాడు. ఈ జంటను కాపాడుకుంటూ వారి ఆదర్శానికి ఒక దిక్సూచిగా నిలబడవలసిన ధర్మం నాకూ, నా భార్య సుధారాణిపైన పడింది. అలా వారి అజ్ఞాత దాంపత్యం కొత్త చిగుళ్లు తొడిగింది. కలవారి కుటుంబంలో పుట్టిన భరత్, పేద కుటుంబంలో పుట్టిన విద్యావంతురాలైన సుభద్రను చేసుకోవడంతో ఎదురైన కొత్త కష్టాలను ధైర్యంతో, మనో నిబ్బరంతో ఎదు ర్కొంటూ వచ్చాడు. ‘ఉదయం’ దినపత్రిక ద్వారా (1984–86) మొదలైన మా స్నేహం వయోభేదంతో నిమిత్తం లేకుండా, ప్రాంతా లతో సంబంధం లేకుండా ఎదుగుతూ వచ్చింది. అందు వల్ల భరత్ భౌతికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగమైన తెలంగాణకు చెందినా, ఏ కోశానా ప్రాంతాల స్పృహ లేకుండా తెలుగువాళ్లుగా స్నేహ బాంధవ్యం పెరిగి బలపడుతూ వచ్చింది. ఈ బంధం, ఆత్మీయతల అనుబంధంగా పెరుగుతూ వచ్చింది కనుకనే హైదరాబాద్ లోని మా ఇల్లు భూషణ్ దంపతుల సొంతిల్లుగానే మారిపోయింది. ఈ చరిత్ర మన జర్నలిస్టు మిత్రులలో చాలా కొద్దిమందికే తెలుసు. మొన్న భరత్ పేద ప్రజా జీవితాలకు అంకితమైన ఫొటో జర్నలిస్టుగా కన్నుమూసే వరకూ మా కుటుంబాల ఆత్మీయతలు ఎక్కువ మందికి తెలియవు. మొన్నమొన్న భరత్ కన్నుమూసే వరకు, చివరి క్షణాల వరకూ భరత్, సుభద్రలు, వారి కుమార్తె అనుప్రియ, కొడుకు అభినవ్ నాతో భరత్ ఆరోగ్య విషయాల గురించి చెబుతూనే ఉన్నారు. వృద్ధాప్యం వల్ల నేను ఎక్కువసార్లు భరత్ ఇంటికి వెళ్లి ఇంతకు ముందులా అతడిని పరామర్శిస్తూ ముచ్చటలాడటం కుదరలేదు. అందువల్ల కేవలం ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉండేవాడిని. తను ఏ చిన్న ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకున్నా విధిగా నాకు ఫోన్ చేస్తూ మీరు కూడా వస్తే ‘నాకు దండి’గా ఉంటుందని చెప్పేవాడు. కానీ నా ఆరోగ్య పరిస్థితి, వృద్ధాప్య దశవల్ల నేను వాటిలో కొన్నింటికీ వెళ్లేవాడిని కాదు. ఐనా విధిగా సమాచారం మాత్రం భరత్ అందిస్తూనే ఉండేవాడు. అరుదైన ప్రజల, పేదసాదల ఫొటో జర్నలిస్టుగా, కళాకారుల్లో అరుదైన సమాజ స్పృహ తీవరించి ఉన్న వ్యక్తిగా భరత్‌ను నేను పరిగణిస్తాను. అంతేగాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తరువాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తెలంగాణ వాసి అయిన భరత్‌కు తెలిసినంత లోతుగా తెలంగాణ సంస్కృతీ వైభవానికి చెందిన అనంతమైన పార్వ్శాలు మిగతా తెలంగాణ కళాకారులకు తెలియ వంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజా జీవితానికి చెందిన అనేక కోణాలను, చివరికి ఇళ్ల తలుపు చెక్కల సొగసుల్ని, వంటింటి సామాన్ల తీరు తెన్నుల్ని అక్షరబద్ధమూ, చిత్రాక్షర బద్దమూ చేసి చూపరుల్ని ఆశ్చర్యచకితులను చేశాడు భరత్. (క్లిక్: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) అందుకే ఏ తెలంగాణ చిత్రకారునికన్నా, ఫొటో జర్నలిస్టుకన్నా లోతైన అవగాహనతో భరత్ తెలంగాణ ప్రజా జీవన చిత్రాలను ప్రాణావశిష్టంగా మలిచారని చెబితే అతిశయోక్తి కాదు. భరత్ కుంచెలోనూ, కలం లోనూ విలక్షణమైన ఈ శక్తియుక్తులను పెంచి పోషించింది అభ్యుదయ భావ సంప్రదాయాలేనని మనం గుర్తించాలి. సబ్బు ముక్క, తలుపు చెక్క కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. అలాగే తెలంగాణ పల్లెపట్టుల్లో తలుపు చెక్కల సౌందర్యాన్ని ఫొటో జర్నలిజం ద్వారా చిత్రబద్ధం చేశాడు భరత్. మహాకవి కాళోజి అన్నట్లు ‘‘చావు నీది, పుట్టుక నీది/ బతుకంతా దేశానిది’’. ఈ సత్యాన్ని ఎన్నటికీ మరవకండి! అందులోనే నిజం ఉంది, నిజాయితీ ఉంది!! (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..
పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. ‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్బార్డ్’ క్యాప్షన్‌తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్‌లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021 -
మొదటి ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్ కథ చెప్పే క్లిక్
ఇండియాలో ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఫొటో జర్నలిస్ట్‌గా జోయా థామస్ లోబో ఇటీవల వార్తల్లో నిలిచారు. ముంబైలో ఉంటున్న 27 ఏళ్ల జోయా యాచకురాలి నుంచి ఫొటోజర్నలిస్ట్‌గా ఎలా మారిందో తెలుసుకుంటే సాధనమున ఎవరికైనా ఏ పనైనా సాధ్యమే అనిపించకమానదు. ‘రకరకాల జీవన శైలులను బంధించడానికి నా కెమెరాతో వీధుల్లో నడవడం అంటే నాకు చెప్పలేనంత ఇష్టం’ అంటుంది జోయాను కదిలిస్తే. ‘చిత్రం’గా మలుపు ఇంట్లో చుట్టుపక్కలవారి నిరాదరణకు గురైన జోయా 18 ఏళ్ల వయసులో తన కుటుంబంనుంచి బయటకు వచ్చి, ముంబైలోని తన లాంటివారిని వెతుక్కుంటూ వెళ్లింది. కొంతమంది హిజ్రాల బృందంతో కలిసి, వారితో చేరి స్థానిక రైళ్లలో యాచించేది. ప్రతీ ఒక్కరినీ అవకాశాలు పలకరిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి విజేతల జాబితాలో జోయా నిలుస్తుంది. ‘‘2018లో ఒక రోజు నా జీవితం అకస్మాత్తుగా మలుపుతీసుకుంది. ఒక షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ ట్రాన్స్‌జెండర్ నటుల కావాలని వెతికారు. నటులు ఎవరూ లేకపోవడంతో నాకు అందులో ఓ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిత్రం ట్రాన్స్జెండర్ల సమస్యల మీద తీశారు. అందులోనూ నటించాను’’ అని తనకు వచ్చిన అవకాశం గురించి ఆనందంగా వివరిస్తుంది జోయా. ఆ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమం లో కుటుంబాలు, సమాజం ట్రాన్స్‌జెండర్స్‌ని దూరంగా ఉంచడం అన్యాయమని పలువురు వక్తలు ప్రసగించారు. అప్పుడు జోయా తను ఎదుర్కొన్న సమస్యలను సభాముఖంగా వివరించింది. ఆమె ఉచ్ఛారణ ఆకట్టుకునే విధంగా ఉండటంతో స్థానిక పత్రికా సంపాదకుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా ఉద్యోగావకాశం ఇచ్చాడు. అలా మొదటిసారి పత్రికా ఆఫీసులో అడుగుపెట్టింది జోయా. అక్కడ ఉపయోగించే కెమెరాలు ఆమెను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాధనమున ఫొటోగ్రీఫీ కొన్ని నెలల్లో సాధన చేసి, సన్నివేశాన్ని కళ్లకు కట్టే క్లిక్‌ను ఔపోసన పట్టింది. కిందటేడాది ఏప్రిల్ లాక్డౌన్ సమయంలో ముంబైలోని బాంద్రా స్టేషన్ సమీపంలో చిక్కుకున్న వలస కార్మికుల నిరసనల ఫొటోలను అన్ని పత్రికలు కవర్ చేశాయి. అందులో జోయా తీసిన ఫొటోలు ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాయి. జోయా ఓ కెమరా తీసుకొని, కరోనా మహమ్మారి మధ్య తన పని కోసం కష్టపడుతూ తిరిగింది. ‘ముందు జర్నలిజం గురించి చాలా తక్కువ తెలుసు. కెమెరాతో వర్క్ చేస్తున్నప్పుడు సంఘటనలను ఎలా ఒడిసిపట్టుకోవాలో, వార్తలో ఫొటో ప్రాధాన్యత ఎంతో వర్క్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా అర్ధమైంది’ అంటూ తను నేర్చుకున్న పని గురించి వివరిస్తుంది. యాచన డబ్బుతో కెమెరా సాధనకు మరింత మెరుగులు పెట్టాలంటే అందుకు తగిన వనరులు కూడా ఉండాలి. ‘‘సొంతం గా నా దగ్గర ఒక కెమరా ఉండాలనుకున్నాను. కానీ, అంత డబ్బు నా దగ్గర లేదు. ఫ్రీలాన్సింగ్ జాబ్‌కి పెద్ద ఆదాయమూ లేదు. అందుకే, రైళ్లలో యాచిస్తూనే ఉండేదాన్ని. అలా వచ్చిన డబ్బు నుంచి కొంత మొత్తాన్ని దాచిపెట్టేదాన్ని. కానీ, అది కూడా చాలా తక్కువ. 2019 దీపావళి సమయంలో మాత్రం డబ్బు కోసం చాలా కష్టపడ్డాను. అలా వచ్చిన దానితో చివరికి నికాన్ డి–510ను కొన్నాను’’ అంటూ జోయా తన పోషణతో పాటు కెమెరా కొనుగోలుకోసం పడిన కష్టాన్ని తెలియజేస్తుంది. ఒక్క క్లిక్‌తో కథ స్కూల్ దశలోనే వదిలేసిన చదువు. పనిని ఎలా అర్ధం చేసుకుంటారు అని ఎవరైనా అడిగితే– ‘నేను పనిలోకి వెళ్లేటప్పుడు జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, దానికి సరైన సమాధానం చెప్పగలిగే ఫొటో తీయడంపై దృష్టి పెడతాను. ఒక కథ చెప్పగలిగే ఫొటో ప్రయత్నిస్తాను. వలసకార్మికుల చిత్రాలకు మంచి ప్రశంసలు వచ్చాయి. సీనియర్ ఫొటో జర్నలిస్టులు నా పనిని మెచ్చుకున్నారు. లైసెన్స్, ఇతర సాంకేతిక విషయాలపై నాకు అవగాహన కల్పించారు. దీంతో నాకు తగినన్ని పనులు వచ్చాయి. డబ్బు గురించి పక్కన పెడితే ఫొటో జర్నలిస్టుగా నా వర్క్‌ని నేను అమితంగా ఆనందిస్తున్నాను. కథల గురించి వెతకనప్పుడు పక్షులు, జంతువుల ఫొటోలు తీస్తాను. ఇటీవల అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు కింగ్‌ఫిషర్‌ను క్లిక్ చేయగలిగాను. కిందటేడాది వరకు ఆర్థికంగా మార్పేమీ లేదు. రైళ్లలో యాచించవలసి వచ్చేది. లాక్డౌన్ కావడంతో కెమెరాను కూడా అమ్మాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. కానీ, అలా జరగలేదు. నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిచోటా ట్రాన్స్‌జెండర్స్ చేయలేని పని ఏదీ లేదంటూ చెబుతూనే ఉన్నాను. వారి కుటుంబాల నుండి వారిని తిరస్కరించడం మానేస్తే, మంచి విద్య లభిస్తే, మిగ™ éవారిలాగే మంచి జీవితాలను గడుపుతారు. అన్ని ఉదోగ్యాలలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తారు. యాచించరు’’ అని వివరిస్తుంది జోయా. -
గ్రేట్ జర్నీ... మానస చిత్రం
గిగిల్స్... లిల్లీపుట్ ల్యాండ్ పేరు పైన రెండు బుజ్జి పాదాలు. లోపలికి వెళ్తే ఓ గదిలో పదకొండు నెలల బాబు విహాస్ పియానో ముందు కూర్చుని కీ బోర్డుని పరీక్షగా చూస్తున్నాడు. ఆ బాబు దృష్టి తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తోందామె. ఇంగ్లిష్ రైమ్ మొదలు పెట్టగానే బాబు ఆమె వైపే చూడసాగాడు. ఓ అరనిమిషం పాటు అలాగే చూసి నోరంతా తెరిచి నవ్వాడు. అప్పుడు క్లిక్ మన్నది ఆమె చేతిలోని కెమెరా. ఆమె పేరు మానస అల్లాడి. కెమెరామన్ అనే మాటను సవరిస్తూ కెమెరా పర్సన్ అనే పదాన్ని నిర్ధారించేశారు. అందుకు మహిళలు వేసిన ఓ ముందడుగే కారణం. ఫొటోగ్రాఫర్‌గా మగవాళ్లు మాత్రమే ఉన్న రోజుల్లో నిర్ధారణ అయిన పదానికి జెండర్ స్పెసిఫికేషన్‌ను తుడిచేస్తున్నారు మహిళలు. ఫొటోగ్రాఫర్‌గా మహిళలు అరుదుగానే అయినా కనిపిస్తున్నారు. వాళ్లు కూడా ఫొటో జర్నలిస్టులు. ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ల విషయానికి వస్తే... ఇంకా మహిళల ప్రస్థానం ఊపందుకోలేదు. అలాంటి సమయంలో ఓ సాహసం చేసింది మానస అల్లాడి. విహాస్ను ఫొటో తీస్తున్న ఉమన్ ఫొటోగ్రాఫర్ మానస ఫొటోగ్రఫీ మీద ఇష్టంతో కోర్సు చేయడంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫొటో స్టూడియో పెట్టింది. మరో ఐదుగురు ఫొటోగ్రాఫర్లకు, ఐదుగురు ఎడిటర్లకు ఉద్యోగం ఇచ్చింది. సొంత స్టూడియో ఆలోచనకు దారి తీసిన కారణం తనలోని తల్లి మనసేనంటోంది. తన పిల్లలను రకరకాల పోజుల్లో చూడాలని ముచ్చటపడింది. డెలివరీ అయిన ఐదో రోజున నిద్రలో నవ్వుతున్న తన బాబుని ఫొటో తీయాలనుకుంది. ఆ క్షణంలో తాను కదల్లేదు. ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లు అందుబాటులో లేరు. అలా ఆ కోరిక తీరకపోవడం వల్ల ఆ పని తానే మొదలు పెట్టింది. సొంతంగా డిజైన్ కరీంనగర్లో పుట్టి పెరిగిన మానస, ఇంజనీరింగ్ వరకు అక్కడే చదివింది. బీటెక్ పట్టాతో హైదరాబాద్‌కి వచ్చి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో చేరింది. ఏడేళ్లు ఉద్యోగం ఇవ్వని సంతృప్తి మూడేళ్ల ఫొటోగ్రఫీ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూనే ఒక ప్రైవేట్ ఫొటోగ్రఫీ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లమో కోర్సు చేసింది. సీనియర్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అప్పటికి స్టూడియో పెట్టే ఆలోచన లేదు. కేవలం ఇష్టంతో మాత్రమే నేర్చుకున్నది. ‘‘మా అబ్బాయి ఐదు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు ఫొటో తీయడానికి బేబీ ఫొటోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. నేను లేవగలిగినప్పటి నుంచి బాబుకి నేనే ఫొటోలు తీసుకున్నాను. ప్రతినెలా పుట్టినరోజు చేస్తూ ఒక్కో నెల డ్రెస్‌కి ఒక్కో థీమ్‌తో కుట్టించి మరీ ఫొటోలు తీశాను. రెండవసారి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు సీరియెస్‌గా ఆలోచించాను. నేనే స్టూడియో పెడతాను. బేబీ ప్రతి మూమెంట్‌ని, రకరకాల నేపథ్యాలలో కెమెరాలో దాస్తానని ఇంట్లో చెప్పాను. ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. ‘ఏ ప్రయోగం చేయాలన్నా ఇదే సరైన వయసు’ అని ప్రోత్సహించారు. ఇక నేను ఏయే థీమ్స్‌తో పిల్లల్ని ఫొటో తీయాలని ముచ్చటపడ్డానో అన్ని సెట్టింగులూ చేయించుకున్నాను. మా స్టూడియోలో ఉన్నవేవీ మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికేవి కాదు. ప్రతిదీ నేనే డ్రాయింగ్ వేసి కార్పెంటర్‌కి వివరించి చేయించుకున్నాను. మొత్తం ముప్పై నేపథ్యాలతో గదులు సిద్ధమయ్యాయి. అన్నీ త్రీ డైమన్షన్ సెటప్లే. ఇండియాలో పెద్ద బేబీ ఫొటో స్టూడియో ఇదే. ఈ ఏడాది మా కరీంనగర్లో కూడా ఓ స్టూడియో పెట్టాను. పిల్లలు మాలిమి అవుతారు ఉద్యోగం చేసినప్పుడు మిగుల్చుకున్న డబ్బు పదిలక్షలతో 2017లో హైదరాబాద్, బోయిన్‌పల్లిలో స్టూడియో పెట్టాను. అప్పటికి హైదరాబాద్‌లో న్యూ బార్న్ బేబీ స్టూడియో ఉంది. కానీ మహిళలు ఈ ప్రయత్నం చేయలేదు. నాకు అడ్వాంటేజ్ ఏమిటంటే... చిన్న పిల్లలు మగవాళ్ల కంటే ఆడవాళ్లకే త్వరగా మాలిమి అవుతారు. పిల్లలతో ఓ అరగంట గడిపితే ఆ బేబీకి ఏమిష్టమో అర్థమవుతుంది. అదే సమయంలో పిల్లలకు నేను అలవాటవుతాను. ఒక్కో పిల్లలు రైమ్స్ ఇష్టపడతారు, కొందరు బొమ్మలను ఇష్టపడతారు. ఇక షూట్ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైనవి చేస్తూ ఉండాలన్నమాట. మగవాళ్లకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. ఏం చేస్తే వాళ్ల ఏడుపును ఆపవచ్చనేది కూడా వెంటనే స్ఫురించదు. కాబట్టి ఈ ప్రొఫెషన్లో ముఖ్యంగా బేబీ ఫోటోగ్రఫీలో మహిళలకు మంచి అవకాశాలుంటాయి. హాబీగా నేర్చుకున్న వాళ్లు అక్కడితో ఆగిపోకుండా దీనిని ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చు’’ అన్నది మానస. ఒక తొలి అడుగు మరికొన్ని అడుగులకు స్ఫూర్తి అవుతుంది. మానస ఇష్టంగా క్లిక్ మనిపించుకున్న జీవిత చిత్రమిది. ఈ దారిలో మరికొంతమంది యువతులు ఫొటోగ్రాఫర్లుగా ఎదగాలని ఆశిద్దాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
సిద్ధిఖీ మరణంలో మా ప్రమేయం లేదు!
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ మరణించడంలో తమ ప్రమేయం లేదని తాలిబన్లు ప్రకటించారు. ఎవరి కాల్పుల కారణంగా డానిష్ మరణించాడన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని, అతను ఎలా చనిపోయాడో తమకు తెలియదని తాలిబన్ల ప్రతినిధి జబుల్లా ముజాహిద్ తెలిపారు. వార్‌జోన్‌లోకి వచ్చే ప్రతి జర్నలిస్టు తమకు సమాచారం ఇవ్వాలని, అప్పుడే వారి గురించి తగిన రక్షణలు తీసుకుంటామని సీఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జర్నలిస్టులు తమకు చెప్పకుండా రణ క్షేత్రంలోకి వస్తున్నారని, ఇది బాధాకరమని అభిప్రాయపడ్డారు. డానిష్ మృతదేహాన్ని ఐసీఆర్సీ(ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్‌క్రాస్)కు అప్పగించారు. తాలిబన్లకు, అఫ్ఘన్ దళాలకు మధ్య జరుగుతున్న కాల్పులను కవర్ చేయడానికి వెళ్లిన డానిష్, అవే కాల్పుల మధ్య చిక్కుకొని మృతి చెందాడు. -
షాకింగ్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ జర్నలిస్టు మృతి
కాందహార్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ దుర్మరణం పాలయ్యారు. కందహార్ నగరంలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి శుక్రవారం తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు. పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడియా మితత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్ చేసిన మూడురోజుల్లోనే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ సందర్బంగా ట్విటర్ వేదికగా సిద్ధిఖీ గతంలో అందించిన కథనాలు, షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్‌గా ఉన్నారు. అలాగే ఇండియాటుడే గ్రూప్‌లో కొంతకాలం కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్ధిఖీ ఎదుర్కొన్నారు. कल रात कंधार में एक दोस्त दानिश सिद्दीकी की हत्या की दुखद खबर से गहरा दुख हुआ। भारतीय पत्रकार और पुलित्जर पुरस्कार विजेता अफगान सुरक्षा बलों के साथ थे, जब उन पर आतंकवादियों ने हमला किया था। मैं उनसे 2 हफ्ते पहले काबुल के लिए रवाना होने से पहले मिला था। उन्होंने फोटो पत्रकारिता pic.twitter.com/iV79PfjO5i — Farid Mamundzay फरीद मामुन्दजई فرید ماموندزی (@FMamundzay) July 16, 2021 -
మరోసారి తన సహృదయాన్ని చాటుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్‌కు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్ బ్యాంక్ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
కశ్మీర్ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
శ్రీనగర్: ఈ యేడాది ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డు జమ్మూకశ్మీర్‌కు చెందిన ఫొటో జర్నలిస్టులను వరించింది. అసోసియేట్ ప్రెస్‌కి చెందిన చెన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసీన్లను ఫీచర్ ఫొటోగ్రఫీ కేటగిరీ కింద ఈ అవార్డులకు ఎంపిక చేశారు. 370 రద్దు సందర్భంలో, కశ్మీర్లో లాక్డౌన్ కాలంలో ప్రజల కష్టాలను తమ కెమెరాల్లో బంధించినందుకుగాను వీరికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ‘ఇది తమకు దక్కిన అరుదైన గౌరవం’ అనీ, క్లిష్టకాలంలో తమకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, అసోసియేటెడ్ ప్రెస్‌లకు అవార్డుని గెలుచుకున్న జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. పరిశోధనాత్మక రిపోర్టింగ్, ఇంటర్నేషనల్ రిపోర్టింగ్‌లో ది న్యూయార్క్ టైమ్స్‌కి రెండు ప్రైజ్‌లు దక్కాయి. -
జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి
శ్రీనగర్: జాతి విద్వేషాలను రెచ్చగొడుతూ పోస్టులు పెడుతున్న ఫొటో జర్నలిస్టుపై జమ్మూ కశ్మీర్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. న్యాయ వ్యతిరేక కార్యకలాపాల(యూపీపీఎ) కింద ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం చెందిన జర్నలిస్టు సంఘాలు పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నాయి. జమ్ము కశ్మీర్‌కు చెందిన పోలీసు సోషల్ మీడియాలో గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్‌ను మరోసారి తెరమీదకు తీసుకు రావడంతో సదరు పోలీసు తన ట్వీట్‌ను తొలగించాడు. వివరాల్లోకి వెళితే.. 2002లో గుజరాత్లో అల్లర్లు చెలరేగినప్పుడు మోదీకి.. "ముస్లింల ప్రాణాలు పోయినందుకు మనస్తాపం చెందారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ "కారు కింద కుక్కపిల్ల పడ్డా బాధగానే ఉంటుంద"ని సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. (శభాష్ అనిపించుకున్న ఐఏఎస్ అధికారిణి) దీన్ని ఉటంకిస్తూ సైబర్ విభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న తాహిర్ అష్రిఫ్ 2013లో.. ఈ మాటలే మోదీ అసలు స్వభావాన్ని నిరూపిస్తున్నాయంటూ అతన్నో "శాడిస్ట్"గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా ఫొటోగ్రాఫర్ అరెస్టవడంతో ఈ ట్వీట్ మరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. "ముందు ఇతన్ని అరెస్ట్ చేయండి", "జాతి వ్యతిరేక నినాదాలు చేస్తున్న ఇలాంటివారిని పట్టుకోండి" అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. దీంతో అధికారులు వెంటనే సదరు పోలీసును ట్వీట్ తొలగించాల్సిందిగా ఆదేశించారు. ఇదిలావుండగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సమయంలోనూ అనేకమంది జర్నలిస్టులను పోలీసులు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైనా జమ్మూకాశ్మీర్‌లో జర్నలిస్టులపై బెదిరింపులు ఆపాలని వారు కోరుతున్నారు. Tahir Ashraf arrest yourself. Your tweet will be threat to national Sovereignty. @Sheikhzahid402 @FaisalMajeed0 pic.twitter.com/sG7zaeetyH — MUSAIB BIN UMEYR (@MusaibUmeyr) April 21, 2020 I guess the enthusiastic cyber police needs to book this person @Tahir_A. Please help purify social media @listenshahid. #FreeSpeech is not absolute. @narendramodi. https://t.co/vfbuwHKtKH pic.twitter.com/RxPqyDEv2Z — AngryKangri (@qazizaid89) April 21, 2020 -
చంపేస్తే అప్పు తప్పుతుందని..
గోవిందరావుపేట: అప్పు తీసుకున్న డబ్బు ఇప్పుడే ఇవ్వాలంటూ కూర్చున్న దేవేందర్‌రెడ్డిని హత్య చేస్తే మిగతా చిన్నచిన్న అప్పులను తీర్చేయవచ్చని.. ఇదేక్రమంలో హత్య చేశాక మృతదేహాన్ని రాత్రి మాయం చేయాలని భావించాడు.. ఇదే ఆలోచనతో బేకరీ లోపలికి తీసుకెళ్లిన దేవేందర్‌రెడ్డిని తీవ్రంగా కొట్టాక చనిపోయాడనుకుని బయటకు వచ్చాక సునీల్‌రెడ్డి కనిపించాడు.. అంతసేపటి వరకు ఒకటే హత్య చేయాలని అనుకున్న నిందితుడు.. రెండో హత్యకు కూడా సిద్ధమయ్యాడు. దీంతోనే సునీల్‌ను నమ్మించి ఇంటికి తీసుకెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ఇదీ ములుగు జిల్లా పస్రాలో సోమవారం రాత్రి జరిగిన హత్యకు సంబంధించి నిందితుడు, బేకరీ యజమాని దయానంద్ అలియాస్ దయ పన్నాగంగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. రూ.6లక్షల అప్పు.. కర్ణాటకకు చెందిన దయానంద్ తన మామ ప్రభుతో కలిసి పస్రాలో కొన్నేళ్ల క్రితం బేకరీ ప్రారంభించారు. అయితే, అప్పులు ఎక్కువ కావడంతో కొద్దికాలం క్రితం ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ ఆరునెలల క్రితం వచ్చిన వారు పస్రాలోనే కొత్తగా బేకరీ తెరిచారు. అప్పటికే ఉన్న అప్పులకు తోడు మరికొన్ని అప్పులు చేశారు. ఈ క్రమంలో దయకు రూ.6లక్షలు అప్పు ఇచ్చిన దేవేందర్‌రెడ్డి నుంచి ఒత్తిడి పెరిగింది. సోమవారం కూడా దేవేందర్‌రెడ్డి తన స్నేహితుడైన ఫొటో జర్నలిస్ట్ సునీల్‌రెడ్డితో కలిసి పస్రా వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మంతనాలు సాగించినా డబ్బు తిరిగి ఇవ్వడంలో ఎలాంటి పురోగతి కానరాలేదు. తనకు స్థానిక వ్యాపారి ఒకరు డబ్బు ఇవ్వాల్సి ఉందని చెప్పగా.. దేవేందర్, సునీల్ ఆయన వద్దకు వెళ్లి ఆరా తీశారు. అయితే, దయకు తాను డబ్బు పెద్దగా ఇచ్చేది లేదని.. కొంతమొత్తమే ఉన్నా తనకు కుమార్తె వివాహం ముగిశాక ఇస్తానని చెప్పాడు. (ఫొటో జర్నలిస్ట్ దారుణ హత్య) ఇస్తావా.. ఇవ్వవా? వ్యాపారి మొండిచేయి చూపడంతో దేవేందర్, సునీల్ మళ్లీ దయ బేకరీ వద్దకు వచ్చారు. దేవేందర్‌రెడ్డి తనకు ఇవ్వాల్సిన రూ.6లక్షల విషయమై మళ్లీ ప్రశ్నించాడు. ఉదయం నుంచి నచ్చచెప్పినా వినడం లేదని భావించిన దయ.. తొలుత దేవేందర్‌రెడ్డిని హత్య చేసి అప్పు వదిలించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే భావనతో పక్కనే ఉన్న మామ ప్రభుకు కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7–30 గంటలకు బేకరీకి వచ్చిన దేవేందర్‌రెడ్డిని బేకరీలో వెనక ఉన్న బట్టీ వద్దకు తీసుకెళ్లి విచక్షణా రహితంగా తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో చనిపోయాడని భావించి శవాన్ని రాత్రికి మాయం చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలా రాగానే సునీల్‌రెడ్డి కనిపించడంతో దయా తన ఆలోచన మార్చుకున్నాడని సమాచారం. ‘ఇంటికి పోయి మాట్లాడుకుందాం.. అక్కడ నీకు అన్ని విషయాలు, నా ఇబ్బందులు చెబుతా’ అంటూ సునీల్‌రెడ్డిని తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దయ మామ, భార్య బేకరీలో ఉన్నారు. ఈ మేరకు ఇంటికి వెళ్లగానే అక్కడ ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సునీల్‌రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రక్తపు మడుగులో దేవేందర్.. దయ, సునీల్‌రెడ్డి ఇంటికి వెళ్లాక పనిపై ప్రభు బేకరీలోని బట్టీ వద్దకు వెళ్లాడు. అక్కడ రక్తపు మడుగులో దేవేందర్‌రెడ్డి కనిపించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన స్థానికుల సాయంతో 108లో ములుగు ఆస్పత్రికి చేర్చాడు. ఇంతలోనే దయ భార్య బేకరీ నుంచి ఇంటికి వెళ్లగా లోపలి నుంచి గొడవ వినిపించినట్లు సమాచారం. ఉదయం నుంచి అప్పు విషయమై జరుగుతున్న గొడవగానే ఆమె భావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దయ రక్తపు మరకలు కడుక్కుంటూ ఇంటి నుంచి బయటకు రావడాన్ని చూసిన ఆమె ఏదో జరిగిందని ఊహించినట్లు సమాచారం. ఆ తర్వాత దయా రోడ్డుపైకి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇంతలోనే దయ నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
జాతరలో విషాదం..!
చిత్తూరు అర్బన్ : అప్పటి వరకు తోటి ఫొటోగ్రాఫర్లతో కలివిడిగా తిరిగాడు. పలుచోట్ల కొలువుదీరిన గంగమ్మలను తన కెమెరాలో బంధించాడు. తొలుత తీసిన ఫొటోపై సంతృప్తిచెందక మళ్లీ అమ్మవారి ఫొటో తీయడానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. చిత్తూరుకు చెందిన ఓ దినపత్రిక ఫొటో జర్నలిస్టు అనంతపద్మనాభస్వామి మృత్యువాత పడటంపై జిల్లా కలెక్టర్, పాత్రికేయులు, పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివరాలిలా.. చిత్తూరు గ్రామీణ మండలంలోని బీఎన్ఆర్.పేటకు చెందిన అనంతపద్మనాభస్వామి (38) ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం నగరంలో గంగజాతర సందర్భంగా బజారువీధి, కట్టమంచి, సంతపేట ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్ల ఫొటోలు తీసుకున్నాడు. అయితే కొంగారెడ్డిపల్లె జాతరలో అమ్మవారు, భక్తుల ఫొటోలను చూసి సంతృప్తి చెందకుండా మళ్లీ ఫొటోలు తీయడానికి వెళ్లాడు. జాతర వద్ద ఏర్పాటు చేసిన చలువపందిళ్ల కొయ్యలపైకి ఎక్కి ఫొటో తీస్తుండగా విద్యుత్‌లైట్ల కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఈ ప్రమాదంలో స్వామి తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన ఇతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తరలించి, వన్‌టౌన్ ఎస్ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురి సంతాపం.. అనంతపద్మనాభస్వామి మరణవార్త తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆసుపత్రికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా రావాల్సిన బీమాను స్వామి కుటుంబానికి అందజేస్తామన్నారు. అలాగే చిత్తూరు ప్రెస్‌క్లబ్ నాయకులు, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు నాయకులు స్వామి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎంఎస్.బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు, బుల్లెట్ సురేష్, మాజీ మునిసిపల్ చైర్మన్ భాస్కరన్, త్యాగరాజులు, అపోలో మెడికల్ కళాశాల యూనిట్ ఇన్చార్జ్ నరేష్‌కుమార్‌రెడ్డి, సీపీఐ నేత నాగరాజన్, గోపినాథ్ తదితరులు స్వామి మృతదేహం వద్ద నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
శ్రీలంక పేలుళ్లు; ఫొటో జర్నలిస్టు అరెస్టు
కొలంబో : నిబంధనలు అతిక్రమించాడన్న కారణంగా ఓ ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భాగంగా మే15 వరకు నెగోంబో మెజిస్ట్రేట్ అతడికి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలో ముష్కరులు సృష్టించిన నరమేధంలో 250 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నివసించే రాయిటర్స్ జర్నలిస్టు సిద్ధిఖి అహ్మద్ డానిష్ న్యూస్ కవరేజ్ కోసం అక్కడికి వెళ్లారు. ఇందులో భాగంగా నెగోంబో సిటీకి చేరుకున్న ఆయన అనుమతి లేకున్నా ఓ స్కూళ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వరుస పేలుళ్లలో మరణించిన ఓ విద్యార్థి కుటుంబాన్ని కలిసేందుకు అక్కడికి వెళ్లగా పోలీసులు సిద్ధిఖిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నెగొంబో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఈనెల 15వరకు రిమాండ్ విధించారు. ఇక ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో నెగోంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధికంగా వంద మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించిన సంగతి తెలిసిందే. పేలుళ్లపై ఇంటలెజిన్స్ హెచ్చరికలు పట్టించుకోని పోలీస్ ఛీఫ్‌పై వేటు వేయడంతో పాటుగా.. ముసుగులు ధరించడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. -
జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి
-
అయితే మాత్రం ఫొటో తీస్తావా..?
సాక్షి, తమిళనాడు: కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో జనాలు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న ఫోటో జర్నలిస్టుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి.. దాడి చేశారు. తమిళనాడులోని విరూద్‌నగర్ జిల్లాలో శనివారం కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి పెద్దగా జనాలు రాలేదు. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి కూడా ఖాళీ కుర్చీలు కనిపించడంతో ఓ తమిళ వార పత్రిక జర్నలిస్టు అయినా ముత్తురాజ్.. ఆ ఖాళీ కుర్చీలను ఫోటో తీశాడు. ఆది కాంగ్రెస్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. ఖాళీ కుర్చీల ఫొటోలు ఎందుకు తీస్తున్నావంటూ.. అతని దగ్గరున్న కెమెరాను లాక్కోడానికి ప్రయత్నించడమే కాకుండా అతనిపై దాడికి దిగబడ్డారు. ఇతర జర్నలిస్టులు కలుగజేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన జర్నలిస్టు ముత్తురాజ్‌ని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ గొడవంతా అక్కడి కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఈ దాడిని ఖండిస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలను గూండాల్లా ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. -
ఫోటోగ్రాఫర్‌ని కాపాడేందుకు ముందుకొచ్చిన రాహుల్ గాంధీ
-
సత్యం చూపిన కన్ను.. ఇక లేదు
కాబూల్: నెత్తుటి మరకలతో అప్ఘనిస్థాన్ రోదించింది. సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో పది మంది విలేకరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు. కాబూల్ మృతుల్లో ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు. షా మరై గురించి... వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. అధికార మార్పిడి, అంతర్యుద్ధంతో సతమతమైన అఫ్ఘన్ చీకటి గతాన్ని రెండు దశాబ్దాలకు పైగా తన కెమెరాలో బంధించారు. ఉత్తర కాబూల్ షమాలి ప్రాంతానికి చెందిన షా మరై తర్వాత కాబూల్‌కు వలస వెళ్లారు. 1996లో ఏఎఫ్‌పీ వార్తా సంస్థలో ఓ డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టారు. అరుదైన ఫోటోలను తాను పని చేసే సంస్థకు అందించి ఫోటోగ్రాఫర్‌గా మారిపోయారు. ముఖ్యంగా 2001లో అమెరికా సైన్యం అప్ఘనిస్థాన్‌పై విరుచుకుపడ్డప్పుడు ఆయన ఇచ్చిన ఫోటోలు ప్రపంచాన్ని కదిలించాయి. ఆయన టాలెంట్‌ను గుర్తించిన ఏఎఫ్‌పీ..ఆ మరుసటి సంవత్సరమే ఫోటో స్ట్రింగర్‌గా ఆయన్ని నియమించింది. ఆపై చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా ఆయన పదొన్నతి పొందారు. యుద్ధం అంటే ఇలా ఉంటుందా? ఫోటోల కోసం ఆయన చాలా శ్రమించేవారు. కొన్ని నెలలపాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఎత్తైన కొండలు, గుహలను దాటుకుని.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఆయన ప్రయాణించేవారు. ఆయన మూలంగానే అఫ్ఘన్‌లో యుద్ధ పరిస్థితులు ప్రపంచానికి తెలిశాయి. విస్మయపరిచే కోణాల్లో ఆయన తీసిన ఫోటోలు ‘యుద్ధం అంటే ఇలా ఉంటుందా?’ అన్న భావన కలిగించేవి. ఫోటోగ్రఫీని ఓ వృత్తి.. ప్రవృత్తిలా కాకుండా.. ఓవైపు ఉగ్ర కోరలు, మరోవైపు సంయుక్త సైన్యాల దాడులతో నలిగిపోతున్న ప్రజా జీవితాన్ని సమాజానికి తెలియపరచాలనే ఆయన ఆరాటపడేవారు. అలాంటి వ్యక్తి చివరకు ఉగ్ర ఘాతుకానికి బలైపోయారు. మరైకు భార్య, ఆరుగురు సంతానం. ఈ మధ్యే ఆయనకు కూతురు కూడా పుట్టింది. నిబద్ధతకు ప్రతిరూపం... షా మరై మరణంపై ఏఎఫ్‌పీ స్పందించింది. ‘నిబద్ధత.. నిజాయితీ కలిగిన వ్యక్తి షా మరై. ధైర్యశాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఆయన తీసిన ఫోటోలు ఎన్నో. ఆయన కెమెరా కన్నులొంచే యుద్ధ బీభత్సాన్ని ప్రపంచానికి తెలిసింది. అలాంటి కన్ను చివరకు చిధ్రమైపోయింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఏఎఫ్‌పీ గ్లోబల్ న్యూస్ డైరెక్టర్ మైకేలే లెరిడాన్ ప్రకటన వెలువరించారు. ఆయన తీసిన కొన్ని ఫోటోలు కింద -
ప్రథమ మహిళ..
ఒకప్పుడు గడప దాటాలంటే ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు. ఎన్నెన్నో కట్టుబాట్లు. ఆడపిల్ల అంటే వంటింటి కుందేలు అనే భావన. పరిస్థితి మారింది. నేడు ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కాలానుగుణంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటూనే... తాము ఎవరి కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. విద్య, వైద్య, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు... ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తామేంటో నిరూపిస్తున్నారు. ఆంక్షలు అణిచివేతలను ఎదుర్కొని చరిత్ర సృష్టించిన మొదటి మహిళామణులు వీరు... చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ బ్రిటీష్ సంస్థానంలోని మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లుగా చంద్రముఖి బసు, కదాంబిని గంగూలీ చరిత్రలో నిలిచారు. చంద్రముఖి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో 1883లో పట్టా పొందారు. అదే ఏడాది కదాంబినీ కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి యూరోపియన్ మెడిసిన్‌లో పట్టా పొందారు. 1886లో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మహిళా డాక్టర్‌గా, ఆనందీ గోపాల్ జోషీ సరసన నిలిచారు. చంద్రముఖి బసు బేతూన్ కాలేజీలో లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించి, అదే కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యారు. దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ స్థాపించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. కామినీ రాయ్ బెంగాలీ రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, స్త్రీవాదిగా సుపరిచితమైన కామినీ రాయ్ భారత్‌లోనే మొదటి ఆనర్స్ పట్టా పొందిన మహిళ. సాహిత్య రంగంలో ఆమె కృషికి మహాశ్వేత, పౌరంకీ, జిబాన్, పుండరీక్, ద్వీప్ ఔర్ ధూప్, నిర్మాల్య వంటి రచనలు నిదర్శనాలు. కర్నాలియా సోరబ్జీ కర్నాలియా భారత్‌లో మొదటి న్యాయవాదిగా, ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయ విద్యనభ్యసించిన మొట్టమెదటి మహిళగా గుర్తింపు పొందారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా భిన్న పార్శ్వాలు కలిగిన వ్యక్తి. విశ్వ విద్యాలయ మహిళా సమాఖ్య, భారత మహిళా సమాఖ్య బెంగాల్ శాఖ, బెంగాల్ లీగ్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఫర్ వుమెన్ వంటి సంస్థలతో కలిసి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఆమె చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1909లో ‘ఖైజర్-ఎ-హింద్’ అవార్డుతో సత్కరించింది. హొమి వైర్‌వాలా భారత్‌లో మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు. 1930ల్లో కెరీర్ ప్రారంభించిన హొమి ముంబై చేరుకున్న తర్వాత తను తీసిన ఫొటోల ద్వారా దేశమంతటికీ సుపరిచితురాలయ్యారు. ఢిల్లీకి వెళ్లి గాంధీజీ, ఇందిరా గాంధీ, నెహ్రూ వంటి పలు జాతీయ,రాజకీయ నాయకులతో పనిచేశారు. 1970లో రిటైర్ అయిన తర్వాత అనామక జీవితం గడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2011లో దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించింది . ఆసిమా ఛటర్జీ సైన్స్ రంగంలో డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రవీణురాలు. మూర్చ నిరోధక, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ప్రతిష్టాత్మక ‘ఖైరా ప్రొఫెసర్షిప్’ పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా కలకత్తా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు. 1961లో రసాయనిక శాస్త్రంలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు. బచేంద్రీ పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ. 1984లో పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ సాహస యాత్ర చేపట్టి, 7 ప్రపంచ రికార్డులు సృష్టించారు. భారత మహిళా సాహస యాత్రికులకు మార్గదర్శకురాలిగా నిలిచారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. కల్పనా చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి ఇండో- అమెరికన్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు. 1995లో నాసా ఆస్ట్రోనాట్ కార్‌్ప్స బృందంలో చేరి, 252సార్లు భూమిని చుట్టి సుమారు 10.4 మిలియన్ కి.మీ. దూరం ప్రయాణించారు. అంతరిక్ష నౌక ‘కొలంబియా’లో చంద్రగ్రహ యాత్రకు వెళ్లిన బృందంలో ఒకరైన కల్పనా చావ్లాతో సహా ఆరుగురు వ్యోమగాములు మరణించారు. మరణానంతరం కాంగ్రెషనల్ స్సేస్ మెడల్, నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్, నాసా సర్వీస్ మెడల్ పొందారు. ఆనందిబాయి గోపాలరావు జోషి నేటికీ ఆడపిల్లకు చదువెందుకనుకునే సమాజం ఇది....అలాంటిది 18వ శతాబ్దంలోనే వైద్య విద్యనభ్యసించి దేశంలోనే తొలి మహిళా వైద్యురాలుగా గుర్తింపు పొందారు. అంతేకాదు పాశ్చాత్య వైద్యశాస్త్రంలో శిక్షణ పొందిన తొలి మహిళ, అమెరికా వెళ్లిన మొట్టమొదటి భారతీయ స్త్రీ కూడా ఆనందిబాయి గోపాలరావు జోషినే. శీలా దవ్రే ఆటో డ్రైవర్ అంటే ఇప్పటికి మనకు గుర్తుకు వచ్చేది మగవారే....అలాంటి పురుషాధిక్య రంగంలోకి ప్రవేశించి వారికి ధీటుగా నిలదోక్కుకున్నారు శీలా దవ్రే. పూనాలో జన్మించిన దవ్రే 1988 నుంచి ఆటో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం ఒక అకాడమీని స్థాపించి ఆసక్తి ఉన్న మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. రోషిణి శర్మ దేశంలో తొలి మహిళా బైక్ రైడర్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బైక్ పై ప్రయాణించారు. అరుణిమా సిన్హా జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా...ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆమె అధైర్యపడలేదు. ఇంతటితో జీవితం ముగిపోయిందని బాధపడనూలేదు. క్రీడాకారిణిగా గుర్తింపు ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు. రీటా ఫారియా పావెల్ ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఆసియా తొలి మహిళ, తొలి భారతీయురాలు కూడా. బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యమిచ్చే పోటీలో నిలిచి గెలిచిన తొలి వైద్యురాలిగా కూడా చరిత్రకెక్కారు. ఆరతి సాహా ఇంగ్లీష్ చానల్‌ను ఈదిన తొలి ఆసియన్. 1959లో ఈ ఘనత సాధించారు. 1960లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆరతినే కావడం విశేషం. ఇందిరా గాంధీ భారత తొలి మహిళా ప్రధాని. తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు ఇందిరా గాంధీ. సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా(1966 నుంచి 1977 వరకూ) పనిచేసి, ‘ఉక్కుమహిళ’ గా గుర్తింపు పొందారు. దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’(1971) అందుకున్న తొలి మహిళగా రికార్డుకెక్కారు. 1999లో బీబీసీ వారు నిర్వహించిన సర్వేలో ‘సహస్రాబ్ది మహిళ’గా నిలిచారు. ప్రతిభా పాటిల్ మన దేశ ప్రథమ పౌరుడు అంటే రాష్ట్రపతి. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్. 2007 నుంచి 2012 వరకు రాష్ట్రపతిగా కొనసాగారు. 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. సుఖోయ్–30ఎమ్కేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు. అంజలి గుప్తా ఫిలాసఫి చదివి, ఆ విద్యతో ఏమాత్రం సంబంధంలేని త్రివిధ దళాల్లో అత్యంత ప్రమాదభరితమైన వాయుసేనలో చేరారు. భారత వాయుసేనలో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా చేరిన తొలి మహిళ. బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్లో పనిచేశారు. జస్టిస్ ఎమ్ ఫాతిమా బీబీ సుప్రీంకోర్టులో పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. మనదేశంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన మొదటి ముస్లిం మహిళ కూడా ఈవిడే. తమిళనాడు గవర్నరుగా కూడా పనిచేశారు. సరళ థాక్రల్ అతిపిన్న వయసులో(21) విమానాలు నడిపేందుకు లైసెన్స్ పొందిన తొలి మహిళ . లైసెన్స్ పొందిన తరువాత, వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన మొదటి మహిళ. ఎయిర్ మెయిల్ పైలట్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా కూడా రికార్డు సృష్టించారు. దుర్గా బెనర్జీ ఇండియన్ ఎయిర్‌లైన్స్ మొదటి మహిళా పైలట్, కెప్టెన్. ‘టొర్నాడో అ–200’ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళ కూడా ఈమెనే. హరితా కౌర్ డియోల్ ఆకాశంలో ఒంటరిగా ప్రయాణించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధీశాలి హరితా కౌర్ డియోల్.1994 లో భారత వైమానిక దళంలో ఒంటరిగా విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి మహిళా పైలెట్‌గా పేరు పొందారు. ప్రియ ఝింగాన్ పోలీసు నేపథ్యం కుటుంబంలో పుట్టి పెరిగారు . సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరికతో 1993 లో భారత సైన్యంలో చేరారు. సైన్యంలో చేరిన మొట్టమొదటి మహిళా క్యాడెట్‌గా గుర్తింపు పొందారు. - ధరణి, సుష్మారెడ్డి -
నాటి భూకంపం ఫొటోలు తీశాడు.. నేటి భూకంపానికి చిక్కాడు
మెక్సికో : ఆయన పెద్ద పెద్ద విపత్తులు కళ్లారా చూశారు. చూసిన వాటిని తన కెమెరాలో బంధించి రిపోర్టింగ్ చేశారు. 1985లో వచ్చిన భారీ భూకంపం సమయంలో తీసిన చిత్రాలతో ఒక్కసారి ఉన్నత స్థానానికి వెళ్లి మంచిపేరు తెచ్చుకున్న ఆ ఫొటో జర్నలిస్టు తాజాగా చోటుచేసుకున్న మెక్సికో భూకంపంలో మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు చావుతో పోరాడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. వెస్లీ బక్సే అనే అమెరికా ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన రాయిటర్స్ పత్రికకు పనిచేసే సమయంలో 1985లో భారీ భూకంపం వచ్చింది. ఆ సమయంలో పలు అద్భుతమైన చిత్రాలు తన కెమెరాలో బందించడంతో ఆయన కెరీర్లో దూసుకెళ్లారు. ప్రపంచంలోని ప్రధాని సంఘటనలు జరిగిన ప్రతి చోటకు ఆయనే వెళ్లే వారు. యుద్ధాలకు సంబంధించిన ఫొటోలు కూడా తీశారు. దీంతో ప్రస్తుతం ఆయన టైమ్, న్యూస్ వీక్ సంస్థలకు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. మెక్సికోలో ఈ నెల (సెప్టెంబర్) 7.1తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో వెస్లీ ఆయన భార్యతో ఇంట్లో ఉన్నారు. భూకంపంకారణంగా వారి అపార్ట్మెంట్ కూలిపోయి అందులో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు సహాయం చేసేందుకు మిత్రులు గతంలో ఆయన తీసిన చిత్రాలను వేలం పెడుతున్నారు. ఆయనకు ఓ ఐదేళ్ల కూతురు కూడా ఉంది. ఆ పాప స్కూల్‌కు వెళ్లడంతో ఎలాంటి గాయాలవకుండా బయటపడింది. -
భాస్కరాచారికి వైఎస్సార్సీపీ సన్మానం
మహబూబ్‌నగర్ అర్బన్: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్‌పిక్షర్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ భాస్కరాచారిని శనివారం వైఎస్సార్సీపీ నాయకులు సన్మానించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఫొటోగ్రాఫర్‌కు ప్రథమ స్థానం రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హైదర్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోస్గి నసీర్, జమీర్‌పాష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ వాజిద్, నేత శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
న్యూశాయంపేట : ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫొటో జర్నలిస్టు ఛాయాచిత్ర ప్రదర్శనలో సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సంపెట వెంకటేశ్వర్లుకు అవార్డు వచ్చింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ నెల 17 నుంచి 26 వరకు ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యాప్త ప్రదర్శనకు ఫొటో జర్నలిస్టులు 104 ఎంట్రీలతో 683 ఛాయాచిత్రాలను పంపించగా, 145 ఫొటోలను ప్రదర్శనకు పెట్టారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇండియన్ ఫొటో ఫెస్టివల్ డైరెక్టర్ అశ్విన్ మాథ్యూస్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి కేటగిరీల వారీగా బహుమతులకు ఎంపిక చేశారు. మొదటి విభాగం బెస్ట్ న్యూస్ పిక్చర్లో పల్లెవాగులో జలకాలు చిత్రానికి సంపెట వెంకటేశ్వర్లుకు రెండవ ప్రోత్సాహక బహుమతి లభించింది. హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్కూ అవార్డు.. రెండవ విభాగం తెలంగాణ పండుగలు జాతరలు, చారిత్రాత్మక కట్టడాలు సంస్కృతిలో వేయి స్తంబాల గుడి చిత్రానికి ది హన్స్ ఇండియా ఫొటోగ్రాఫర్ గోకారపు శ్యాంకుమార్‌కు మొదటి ప్రోత్సాహక బహుమతి లభించింది. 26న ఉదయం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో వీరికి మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేస్తారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, శ్యాంకుమార్‌ను పలువురు అభినందించారు. -
‘సెజ్’ పొమ్మంది..
అరుణ్ రాయ్‌చౌదరి.. 25 ఏళ్లు ఫొటో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఆయనది. కెమెరా క్లిక్‌మంటే ఫొటో అయిపోతుంది. కానీ, ఒక్క ఛాయాచిత్రంతో దాని వెనుకున్న కథను చెప్పగలిగితేనే అది ఫొటో జర్నలిజం అవుతుందంటున్న అరుణ్ రాయ్చౌదరితో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్. ఫొటో జర్నలిజం అంటే ఒక స్టిల్ కాదు. మనం నేరుగా చూడలేని అంశాలను కళ్లకు కట్టేది. సబ్జెక్ట్‌లోకి తొంగి చూడగలగాలి. అలాంటిదే పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్‌లో నేను తీసిన ఫొటో. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్) వివాదం ఆ ఊరిని కల్లోలం చేసింది. ప్రాణభయంతో ఆ గ్రామస్తులను పరుగులు తీసేలా చేసింది. పోలీసులకు, అల్లరి మూకలకు చెలరేగిన ఘర్షణలు అమాయక జనాన్ని కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకూ తరిమింది. ఆ సమయంలో తీసిన ఫొటో అక్కడున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. ఈ ఫొటో తీసిన ముందు రోజు అదే గ్రామంలో జరిగిన ఘర్షణల్లో 14 మంది అమాయక రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చోటు లేదు... ఒక ఫొటో మాట్లాడుతుంది. అలాంటి చిత్రం చూసిన తర్వాత మాట్లాడటం ఆపేసి... ఆలోచించటం మొదలుపెడతాం. ఈ రోజుల్లో అలాంటి చిత్రాలకు దినపత్రికల్లో చోటు లేదు. మొబైల్స్, డిజిటల్ కెమెరాల్లో రోజుకు ఎన్నో వేల ఫొటోలు క్లిక్‌మంటున్నాయి. అవన్ని ఫొటో జర్నలిజం కాలేవు. అసలు ఫొటో జర్నలిజం అనేది ఈ రోజుల్లో లేదనే చెప్పాలి. ఇప్పుడు న్యూస్ పేపర్లలో వస్తున్నది కేవలం పేజ్ ఫిల్లింగ్ కోసం తీసిన ఫొటోలు మాత్రమే. న్యూస్‌ను క్యారీ చేసేవి, వివరించే చిత్రాలకు చోటెక్కడుంది. దీనికి ప్రకటనలు, ఆలోచన ధోరణిలో మార్పు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫొటో జర్నలిజం కంట్రిబూషన్స్ ఈ రోజు హైదరాబాదులో చోటు చేసుకున్న మార్పులకు ఫోటో జర్నలిస్టుల కాంట్రిబూషన్ ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి దుర్గం చెరువు వెళ్లడానికి ఒక పిల్ల రోడ్డు ఉండేది. వర్షంలో, బురదలో సైకిల్ మీద వెళ్లి ఫొటోలు తీసిన సందర్భాలు నా అనుభవంలో ఉన్నాయి. అప్పట్లో న్యూస్ పేపర్స్లలో ఫొటో ఫీచర్స్ ఉండేవి. వాటి కోసం ఇలాంటి ఎన్నో ఫొటో ఫీచర్స్ చేసిన ఫొటోగ్రాఫర్లను, వారి కంట్రిబూషన్స్ని మరచిపోయారు. ఈ రోజుల్లో అలాంటి ఫీచర్స్ కూడా రన్ చెయ్యట్లేదు ఎవరూ. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడమే ఇందుకు కారణం. ప్రజెంటర్: ఓ మధు