
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్‌కు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్ బ్యాంక్ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.