Cancer Patient
-
క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్: సాధారణంగా క్యాన్సర్ బాధితులకు జీవితమే అంధకారబంధురంగా ఉంటుంది. అందులోనూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వచ్చిందంటే, ఆ తర్వాత ఇక గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. దాంతో వాళ్లు గర్భసంచి తొలగించుకునేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.“ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒకసారి గర్భం వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దాంతో తప్పనిసరిగా ఆమెకు గర్భసంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి, ఇక్కడకు వచ్చారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగిస్తే, తర్వాత ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయొచ్చని, ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చని వివరించాము. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరుశాతం ఉంటుందని, నిరాశ చెందక్కర్లేదని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్లు సమాధానపడి, చికిత్సకు సిద్ధమయ్యారు. ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ శస్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించాము. గర్భసంచికి కూడా కుట్లు వేశాం. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది.క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాము. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే, కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొనసాగించాము. మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్ పరీక్షలు, ఇతర పరీక్షలు చేశాము. 32 వారాల తర్వాత ముందుజాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల సమయంలోనే ప్రసవం కావచ్చని చూశాము గానీ, గర్భసంచి బాగానే ఉండటంతో వేచి చూశాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టింది.పాప పుట్టిన తర్వాత, ఒకసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భసంచి తొలగించాల్సిందిగా ఆ దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పైగా ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదు కాబట్టి అలాగే వదిలేయడం మంచిదని వారికి చెప్పాము. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్టర్ చీపురుపల్లి వసుంధర తెలిపారు. “ఒకానొక దశలో మేము అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి బృందం ఎంతగానో మాకు నచ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్యకరమైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి, డాక్టర్ వసుంధర, ఆమె బృందానికి మేమెంతో కృతజ్ఞులై ఉంటాము” అని మౌనిక భర్త మహేష్ చెప్పారు. -
Naresh Goyal: జైల్లోనే చావాలనుంది!
ముంబై: ‘‘నాలో బతకాలన్న ఆశలన్నీ పూర్తిగా అడుగంటాయి. క్యాన్సర్ ముదిరి నా భార్య అనిత మంచాన పడింది. ఆమెను ఎంతగానో మిస్సవుతున్నా. నా ఒక్కగానొక్క కూతురుకూ ఒంట్లో బాగుండటం లేదు. నా ఆరోగ్యం కూడా పూర్తిగా దిగజారింది. మోకాళ్లు మొదలుకుని మూత్ర సంబంధిత వ్యాధుల దాకా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఒళ్లంతా స్వాధీనం తప్పి వణుకుతోంది. నొప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో దైన్యంగా బతుకీడ్చడం కంటే జైల్లోనే చనిపోతే బాగుండనిపిస్తోంది’’ అంటూ జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ (74) భావోద్వేగానికి లోనయ్యారు. రూ.538 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితుడైన ఆయనను ఈడీ గత సెపె్టంబర్ 1న అరెస్టు చేసింది. నాటి నుంచీ జైల్లో ఉన్న ఆయన శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాసేపు వ్యక్తిగతంగా విచారించాలని కోరగా జడ్జి అనుమతించారు. ఈ సందర్భంగా చేతులు జోడించి తన దైన్యం గురించి చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. మాట్లాడుతున్నంత సేపూ గోయల్ వణకుతూనే ఉన్నారని జడ్జి తెలిపారు. ఆయన గత డిసెంబర్లో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. -
క్యాన్సర్ రోగి పట్ల సీఎం పెద్ద మనసు
దత్తిరాజేరు : క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఓ మహిళ పట్ల సీఎం జగన్ పెద్దమనసుతో స్పందించారు. మరడాం హెలిప్యాడ్ వద్ద విజయనగరం జిల్లా కొండదాడికి చెందిన సరస్వతి సీఎంను కలిసి తన కష్టాలు చెప్పుకుంది. తల్లిదండ్రులిద్దరూ క్యాన్సర్‌తో మృతి చెందారని, తను కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ఆస్పత్రి, ఇతరత్రా ఖర్చులకు ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని వేడుకుంది. స్పందించిన సీఎం రూ.3 లక్షల సాయంతో పాటు ఉచిత వైద్యం అందించాలని కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. ఈ మేరకు కొద్ది గంటల్లోనే బాధితురాలికి మంత్రి బొత్స సత్యనారాయణ రూ.3 లక్షల చెక్కు అందజేశారు. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
మరోసారి గొప్ప మనుసు చాటుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్
కోలీవుడ్‌లో ధైర్యం, సాహసం, సాయం, సేవా వంటి గుణాలు కలిగిన అతి తక్కువ నటీనటుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన స్వసక్తితోనే ఎదిగారు. నటిగా దక్షిణాదిలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. పోడా పోడి చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత రకరకాల పాత్రల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. తెరపై విలన్‌గా భయపెట్టే వరలక్ష్మిలో సేవ గుణం ఎక్కువే అనే విషయం తెలిసిందే. చదవండి: ప్రియుడి చేతిలో చావు దెబ్బలు తిన్న నటి, శరీరమంతా కమిలిపోయి.. తరచూ ఆమె సామాజిక సేవలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులను సాయం చేసి అండగా నిలిచారు. కాగా శనివారం తన పుట్టిన రోజును స్థానిక ఎగ్మోర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్‌లో హాస్పిటల్లో వైద్యులు, క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జాయ్ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప్ బ్యటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న వైద్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మన సన్నిహితులు, దగ్గరి వారు మాత్రమే క్యాన్సర్ బాధితులైనప్పుడు వ్యాధి గురించి ఆలోస్తున్నామని అభిప్రాయపడ్డారు. చేతిలో ఉన్న పది రూపాయలు సాయం చేసినా బాధితుల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందన్నారు. అలాగే దేశమంత సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న చెన్నైకి చెందిన శివ రవి, జై అశ్వాణిలపై ఆమె ప్రశంసలు కురిపించారు. చదవండి: తీవ్రమైన గుండెపోటు నుంచి కాపాడింది అదే: సుస్మితాసేన్ కాగా క్యాన్సర్ మహమ్మారిపై అవగాహన కలిగించే విధంగా శివ రవి అనే 26 ఏళ్ల వ్యక్తి, జై అశ్వాణి అనే 18 ఏళ్ల యువకుడు కలిసి చెన్నై నుంచి కోల్కత్తా వరకూ 1746 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు అదే విధంగా అనేకమంది క్యాన్సర్ బాధితులను కాపాడుతున్న సంకల్ప్ సేవా సంస్థ, వైద్యుల చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా నటి వరలక్ష్మి క్యాన్సర్ బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను సాయంగా అందించారు. అదేవిధంగా సైకిల్ యాత్రతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రవన్ని చేపట్టిన యువకులకు జ్ఞాపికలను అందజేశారు. -
పెళ్లి మండపంలో వధువు అనూహ్య నిర్ణయం.. కుటుంబం కంటతడి..
పెళ్లి అంటే ఓ పండగ. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరుపుకునే వేడుక. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేదిక. చాలా మంది తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పలు జంటలు తమ వివాహాన్ని మంచి పనులకు వేదికగా మలుచుకుంటున్నారు. సమాజం కోసం, భవిష్యత్తు కోసం ఉపయోగపడే పనులకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఓ వధువు కూడా ఇలాగే ఆలోచించింది. పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండేలా అందమైన, పొడవాటి తన జుట్టును కత్తిరించేందుకు సిద్ధపడింది. వధువు అనూహ్య నిర్ణయంతో మండపంలోని అతిథులందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. అనంతరం ఆమె క్యాన్సర్ బాధితులకు జుట్టు డొనెట్ చేసిందుకు ఇలా చేసిందని తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిలో వధువు తన జుట్టు కత్తిరించుకుంటున్న ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేశారు. విందులో పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు.. వివాహ వేడుక అనంతరం తన పొడవాటి జుట్టును కత్తిరించుకోవడం కనిపిస్తోంది. క్యాన్సర్ రోగులకు సాయం చేసేందుకు ఇలా చేస్తున్నట్లు ఆమె తెలిపింది. వధువు జుట్టు కత్తిరించుకుంటుంటే ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లక్షల్లో వ్యూస్ వచ్చి చేరుతున్నాయి. వధువు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Michigan Wedding Photographer & Videographer | Brianna Eslinger (@theunfilteredcollective) -
వైద్యుల పొరపాటు.. యువకుడి మర్మాంగం తొలగింపు.. పరిహారంగా..
వైద్యులు చికిత్స అందించే సమయంలో చేసిన పొరపాటు ఓ యువకుడికి శాపంగా మారింది. అతని మర్మాంగాన్ని పూర్తిగా తొలిగించాల్సి వచ్చింది. దీంతో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు నుంచి అనుకులంగా తీర్పు వచ్చింది. ఫలితంగా ఆస్పత్రి యాజమాన్యం అతనికి భారీ పరిహారం చెల్లించింది. ఫ్రాన్స్ నాంటెస్ యూనివర్సిటీలో 2014లో ఈ ఘటన జరిగింది. అప్పుడు యువకుడి వయసు 30 ఏళ్లు. పెళ్లి కూడా అయింది. అయితే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కార్సినోమా క్యాన్సర్ అని తేలింది. అంటే చర్మ ఎపిథీలియల్ కణజాలం లేదా అంతర్గత అవయవాల టిష్యూలకు క్యాన్సర్ సోకింది. పొరపాటుతో తలకిందులు.. అయితే వైద్యులు అతనికి చికిత్స అందించారు. టిష్యూల నుంచి క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చేసిన పొరపాట్లు అతనికి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. క్యాన్సర్ మర్మాంగానికి కూడా సోకింది. దీంతో భరించలేని నొప్పితో అతను నరకయాతన అనుభవించాడు. ఒకానొక సమయంలో కట్టర్‌తో స్వయంగా తానే మర్మంగాన్ని తొలగించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ భార్య వద్దని చెప్పడంతో ఆగిపోయాడు. కానీ రానురాను అతని క్యాన్సర్ తీవ్రత పెరిగింది. మొత్తం మర్మాంగానికి అది సోకింది. ఇక గత్యంతరం లేదని భావించిన వైద్యులు యువకుడి మర్మాంగాన్ని పూర్తిగా తొలగించారు. అలా చేయకపోతే అతని ప్రాణాలు పోయేవని చెప్పారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై యువకుడు న్యాయపరంగా పోరాడాడు. వైద్యులు పొరపాటు వల్లే మర్మాంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చిందని, ఆ బాధ వర్ణనాతీతం అని వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం తమ తప్పును అంగీకరించి యువకుడికి రూ.54 లక్షలు పరిహారంగా ఇచ్చింది. చదవండి: అఫ్గాన్‌లో విద్యార్థినుల నిరసన గళం -
వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!
ప్రస్తుత జనరేషన్లో ప్రతీ ఎలక్ట్రానిక్ వస్తువుకు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటోంది. ఇక, మనం ధరించే వాచ్‌ల విషయానికి వస్తే.. ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ అయిన యాపిల్ వాచ్ ఎంతో స్పెషల్. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న యాపిల్ వాచ్.. క్రేజీ లైఫ్ సేవింగ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ యాపిల్ వాచ్ ఎంతో మంది ప్రాణాలకు కాపాడింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. దీంతో, మరోసారి యాపిల్ స్మార్ట్‌వాచ్ తన ప్రత్యేకతను చాటుకుంది. వివరాల ప్రకారం.. ఇమాని మైల్స్(12)కి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో, యాపిక్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేసి తన చేతికి పెట్టుకోవడం ప్రారంభించింది. కాగా, యాపిల్ వాచ్ ధరించిన అనంతరం.. ఇమాన్ హెల్త్ గురించి వాచ్ ఎప్పటికప్పుడు ఆమెకు తెలియజేసింది. ఈ క్రమంలో ఓరోజు.. ఒక్కసారిగా యాపిల్ వాచ్.. ఇమాని హార్ట్‌రేట్ అసాధరణంగా ఎక్కువగా ఉందంటూ పలుమార్లు హెచ్చరించింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి జెస్సికా కిచెన్ ఆందోళనకు గురైంది. తన కూతురుకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని భావించి వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. దీంతో, ఇమానికి వైద్య చికిత్సలు అందించిన అనంతరం.. ఆమెకు అపెండిక్స్‌లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని కనుగొన్నారు. ఇటీవలి కాలంలో ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ కూడా విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్‌గా గుర్తించిన వైద్యులు.. సర్జరీ చేసి కణతులను తొలగించారు. ఇలా యాపిల్ వాచ్.. ఓ బాలిక ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన అనంతరం.. ఇమాని తల్లి జెస్సికా కిచెన్ మాట్లాడుతూ.. వాచ్ కారణంగా నా కూతురుకు ఎంతో మేలు జరిగింది. ఈ విషయం తెలియకపోతే ఇంకా కొన్ని రోజలు ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉండిపోయేవాళ్లము అని తెలిపారు. ఇక, అంతకుముందు కూడా యాపిల్ వాచ్ యూకేకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. #AppleWatch detects signs of rare #cancer, saves life of 12-year-old girlhttps://t.co/u9mPi3YXQp — DNA (@dna) October 22, 2022 -
పేగు క్యాన్సర్ చికిత్సలో అద్భుతం.. క్యాన్సర్ కణాలన్నీ మాయం
న్యూయార్క్: పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులపై ప్రయోగించిన ఒక కొత్త ఔషధం అద్భుత ఫలితాలిచ్చింది. డోస్టార్లిమాబ్గా పిలిచే ఈ కొత్త మందును వారికి మూడు వారాలకోసారి చొప్పున ఆర్నెల్లు ఇవ్వడంతో క్యాన్సర్ కణతులు పూర్తిగా కనుమరుగయ్యాయని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఎండోస్కోపీ నుంచి ఎంఆర్ఐ దాకా ఏ పరీక్షలోనూ క్యాన్సర్ కణాల జాడ కనిపించలేదు. క్లినికల్ పరీక్షలో భాగమైన రోగులు తర్వాత కీమోథెరపీ, రేడియేషన్, చిన్నపాటి సర్జరీలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ రోగులకు ఆ అవసరం రాలేదని న్యూయార్క్ మెమోరియల్ స్లో ఆన్ కాటరింగ్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్ లూయిస్ డియాజ్ అన్నారు. ‘‘ఇది 18 మంది రోగులపైనే జరిగిన ప్రయోగం. భారీ సంఖ్యలో ప్రయోగాలు జరిగాకే ఈ ఔషధంపై అవగాహనకు రావాలి’’ అని వైద్యరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. చదవండి👇 పబ్జీ ఆడొద్దన్నందుకు తల్లిని కాల్చి చంపిన కొడుకు ఇవి మామూలు టొమాటోలు కావు.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు -
నాకు జాబ్ కావాలి.. మీ జాలి కాదు..
సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటితో పోరాడుతున్న వారికి కావాల్సింది మద్దతు. అంతేకాని జాలి కాదు. బాధల్లో ఉన్నవాళ్లు చెడ్డవాళ్లు కాదు. వాళ్లను చూడగానే మీ ముఖ కవళికలు మార్చాల్సిన అవసరం లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరు క్షణమే అతన్ని మెచ్చకుంటూ తమ కంపెనీలో ఉద్యోగం చేయాలంటూ అనేక మంది సీఈవోలు ఆఫర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటీ అతను ఎందుకలా స్పందించాడు? ఝార్ఖండ్కి చెందిన ఆర్ష్ నందన్ ప్రసాద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా భయంకరమైన నిజం బయటపడింది. అతని ఒంట్లోకి ప్రవేశించిన క్యాన్సర్ వ్యాధి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మొదలెట్టింది. దీంతో ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జూమ్‌లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఇంటర్వ్యూలో అవతలి వ్యక్తులు అడుగుతున్న ప్రశ్నలకు ఆర్ష్ నందన్ సరైన సమాధానలు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులకు అతనిచ్చే సమాధానాల కంటే అతని ఆరోగ్య పరిస్థితిపైనే ఎక్కువ కన్సర్న్ చూపిండం ఆర్ష్ నందన్ ప్రసాద్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. జాబ్ ఇవ్వడం మాట అటుంచి... ఆస్పత్రి బెడ్‌పై ఉన్న అతన్ని చూడగానే ముఖకవళికలు మార్చడం, జాలిగా మాట్లాడటం. అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం ఎక్కువైంది. ఓవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్‌కి ఇంటర్వ్యూయర్ల ప్రవర్తన మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది. కీమో థెరపీతో క్యాన్సర్‌తో పోరాడే సమయంలో వీళ్ల ప్రవర్తన తనకు ఇబ్బందిగా ఉంటోందని పేర్కొటూ లింక్డ్ ఇన్‌లో మేసేజ్ పెట్టాడు. అందులో నా స్కిల్స్, సామర్థ్యం చూడండి అంతే కానీ నాకున్న వ్యాధిని చూసి జాలి పడొద్దు. నాకు కావాల్సింది అది కాదంటూ పేర్కొన్నాడు. ఆర్ష్ నందన్ ప్రసాద్ లింక్డ్ఇన్ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈవో నీలేశ్ సప్తూర్ స్పందించాడు. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న నువ్వు ఒక యోధుడివి. ఇకపై ఇంటరర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టు. ట్రీట్మెంట్ తీసుకో. నీ క్రెడెన్షియల్స్ నేను చూశాను. అన్నింటా సూపర్‌గా ఉన్నావ్. నీలాంటి యోధుడికి మా కంపెనీలో ఎప్పుడూ ఉద్యోగం రెడీగా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పు వచ్చి జాయిన్ అవమంటూ ఆఫర్ ఇచ్చాడు. విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలకు చెందిన సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. నందన్ ప్రసాద్ మద్దతుగా అనేక మంది గళం విప్పారు. మొత్తానికి కార్పోరేట్ వరల్డ్ చేపట్టే ఇంటర్వ్యూలపై ప్రసాద్ సరికొత్త చర్చకు తెర తీశాడు. చదవండి: మస్క్ చేతికి ట్విటర్.. సీఈవో పరాగ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు -
మరో వారం రోజుల్లో కేన్సర్ చికిత్స.. అయ్యో కేటుగాళ్లు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్): రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి. బాధితుడు భిక్షపతి ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో చెక్‌బుక్ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్ కట్‌చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్‌కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్‌నంబర్ లింకు చేశారు. బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి.. -
క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారి కోరిక నెరవేర్చిన విజయ్ సేతుపతి
చెన్నై: మొన్న మెదడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కెనడాకు చెందిన అభిమానితో నటుడు కమల్‌హాసన్ జూమ్ కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. అదేవిధంగా నటుడు విజయ్ సేతుపతి క్యాన్సర్ బారిన పడిన చిన్నారిని అక్కున చేర్చుకుని మనోబలాన్ని పెంచారు. క్యాన్సర్ వ్యాధికి గురైన ఒక చిన్నారి నటుడు విజయ్ సేతుపతిని దగ్గరగా చూడాలన్న కోరికను వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తన అభిమాన సంఘం నిర్వాహకుల ద్వారా తెలుసుకున్న విజయ్ సేతుపతి ఆ బాలుడిని, అతని కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి మాట్లాడారు. బాలుడిని గుండెలకు హత్తుకున్నారు. ఆ బాలుడి వివరాలు తెలియకపోయినా ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విజయ్‌సేతుపతి మానవత్వాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. చదవండి : అభిమానికి బ్రెయిన్ క్యాన్సర్: ధైర్యం చెప్పిన కమల్ -
మరోసారి తన సహృదయాన్ని చాటుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌తో బాధపడుతున్న ప్రముఖ ఫొటో జర్నలిస్టు భరత్ భూషణ్‌కు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రూ.50వేల ఆర్థిక సహాయం చేసి తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్న భరత్ భూషణ్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి రక్తనిధి కార్యాలయానికి వెళ్లి చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు, బ్లడ్ బ్యాంక్ బాధ్యుడు రవణం స్వామినాయుడు నుంచి చెక్కు అందుకున్నారు. తనకు సహాయం చేసిన చిరంజీవికి.. భరత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘వన్ డే కొత్వాల్’ సాదిఖ్ ఇకలేడు
సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయసులో హైదరాబాద్ నగరానికి ఒక రోజు పోలీసు కమిషనర్‌గా పని చేసిన బాలుడు సాదిఖ్ బుధవారం కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్‌తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లని తండ్రి జావేద్ బాషా తెలిపారు. సాదిఖ్‌కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే మేక్ ఏ విష్ ఫౌండేషన్ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్ 15న సాదిఖ్‌ను హైదరాబాద్ నగరానికి ఒక రోజు కమిషనర్‌గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి నుంచి సాదిఖ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. సాదిఖ్ ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, తన కుమారుడి కోరిక తీర్చిన పోలీసు విభాగానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జావేద్ బాషా అన్నారు. -
డాక్టర్ గారికి తాను చనిపోతానని తెలిసిన తరువాత...
‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక విజయయాత్ర ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కొనసాగుతూనే ఉంది. పుస్తకాలు ఎక్కువగా చదివే రష్మికకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి వెన్ బ్రీత్ బికమ్స్ ఏయిర్. 37 సంవత్సరాల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అమెరికన్ న్యూరోసర్జన్ పాల్ కళానిధి ఆటోబయోగ్రఫీలాంటి పుస్తకం ఇది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్’ జాబితాలో నెంబర్‌వన్‌గా నిలిచి, ఎంతోమందికి ఉత్తేజాన్ని ఇచ్చిన ఈ పుస్తకం పరిచయం... ఎప్పడూ చురుగ్గా, ఉల్లాసంగా ఉండే కుర్రాడికి తనకు క్యాన్సర్ అనే భరించలేని విషాదవార్త తెలిస్తే ఎలా ఉంటుంది? కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది. అయితే తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే పాల్ కళానిధి స్పందించిన తీరు వేరు. ఆయన తన మిత్రుడికి ఇలా మెయిల్ చేశాడు...‘గూడ్‌న్యూస్ ఏమిటంటే మహాకవులు కీట్స్, స్టీఫెన్ క్రేన్ల సాహిత్యాన్ని చదువుకోవడం. బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే ఇంత వరకు ఒక్క అక్షరం కూడా నేను రాయకపోవడం’ కళానిధి వైద్యాన్ని ఎంతగా ప్రేమించాడో, సాహిత్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. ‘పదిహేడేళ్ల వయసులో నువ్వు ఏమవుతావు? అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే కచ్చితంగా రచయిత అనేవాడిని. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు’ అనే కళానిధి యెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు ముందు స్టాన్‌ఫోర్డ్‌లో సాహిత్యంలో రెండు బీఏలు చేశాడు. కేంబ్రిడ్జిలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫి చేశాడు. ఈ విషాదవార్త తెలియగానే కుటుంబసభ్యులు, స్నేహితులతో అతని జోక్స్ ఆగిపోలేదు. ప్రకృతిని ఆరాధించడం ఆగిపోలేదు. ఫుట్‌బాల్ ఆడడం ఆగిపోలేదు. అన్నిటికి మించి బతుకును ప్రేమించడం ఆగిపోలేదు. చావుకు, బతుకు మధ్య ఉన్న స్వల్పకాలాన్ని ఈ పుస్తకం రాయడానికి ఉపయోగించాడు. అలా అని ఇది జ్ఞాపకాల సమహారం మాత్రమే అనుకోనక్కర్లేదు. ‘జీవితాన్ని కొత్తగా ఎలా చూడాలి?’ అనేది ఎవరికి వారు దిశానిర్దేశం చేసుకునేలా ఉంటుంది. బరువు తగ్గుతూ పోవడం, జ్వరం, చెమటలు పట్టడం, వెన్నునొప్పి, దగ్గు...ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం రాయడం ఆషామాషీ విషయం కాదు. పుస్తక రచన పట్ల తన ఇష్టం ఆ కష్టాన్ని తగ్గించింది. తనలో నూతనోత్సాహం. మరోశక్తి....పాప. ‘నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్నిరోజులకు పాప పుట్టింది. ఆ పాప హావభావాలు, నవ్వులు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. డైనమిజం అనేది పాప రూపంలో మా ఇంట్లోకి వచ్చింది’ అంటాడు కళానిధి. స్ట్రిక్ట్ మదర్, మెడిసిన్‌తో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్, కుందేలు, తాబేలు పరుగుపందెం నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దేవుడిపై తన నమ్మకం, సెటన్: హిజ్ సైకోథెరపీ అండ్ క్యూర్ బై ది అన్ఫార్చునెట్... పుస్తకం తనపై కలిగించిన ప్రభావం, చావుకు మానసికంగా సంసిద్ధం కావడం, ‘నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి’ అని భార్యను ప్రిపేర్ చేయడం, తన ట్రీట్మెంట్ కోసం డాక్టర్ ఎమ్మా హెవార్డ్ను ఎంచుకోవడానికి కారణం, చికిత్స సత్ఫలితాన్ని ఇస్తున్న పరిస్థితుల్లో మళ్లీ జీవితంపై కొత్త ఆశ, కొద్దికాలానికి ఆ ఆశ కొడిగట్టడం, మళ్లీ ధైర్యంతో పైకిలేవడం...ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం ఎంత పాప్లర్ అయిందంటే ఎంతోమంది డాక్టర్లు కళానిధికి ఫోన్ చేసి ‘డిప్రెషన్‌తో మా దగ్గరకి వచ్చే వాళ్లకు మందులేమీ ఇవ్వడం లేదు. మీ పుస్తకం చేతిలో పెడుతున్నాం. అంతే... వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేం’ అనేవాళ్లు.అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకువాళ్లు, చిన్న చిన్న విషయాలకే కుంగుబాటలో ప్రయాణించే వాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. చదవండి: ఇదే తొలిసారి.. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది : రష్మిక -
ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారూ: సుశీలమ్మ
సాక్షి, హిందూపురం: ‘సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నాకు హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించి ప్రాణభిక్ష పెట్టిన మీకు ధన్యవాదాలు సార్’ అంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు హిందూపురంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన సుశీలమ్మ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తన కుటుంబసభ్యులతో పాలు ఎమ్మెల్సీని ఆమె కలిసి మాట్లాడారు. పేదరికం కారణంగా మెరుగైన చికిత్సలుఇ అందులోని స్థితిలో ఉన్న తన పరిస్థితికి సకాలంలో స్పందించి ప్రభుత్వ పరంగా ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్సీపీ నాయకులు గోపీకృష్ణ, ఇందాద్, లతీఫ్, రహమత్, సునీల్, మంజునాథ్, సురేష్ తదితరులు ఉన్నారు. (చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?) -
చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి మృతి
కోల్‌కతా : లాక్డౌన్ కారణంగా చికిత్స అందక రెండేళ్ల క్యాన్సర్ చిన్నారి కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. కీమోథెరపీ కోసం ఆసుపత్రుల చూట్టూ తిరగాల్సి వచ్చిందని, సరైన సమయంలో చికిత్స అందక తన కూతురు చనిపోయినట్లు తండ్రి బిస్వజిత్ కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది క్యాన్సర్ కారణంగా ప్రియాంషి సాహా అనే రెండేళ్ల చిన్నరికి కలకత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్ర్తచికిత్స చేయించారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్‌గా కీమో ధెరపీ చేయించాలని వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కీమో థెరపీ చేయలేమంటూ హాస్పిటల్ నిర్వాహకులు చెప్పడంతో గత నెల నుంచి సరిగ్గా వైద్యం అందక ఆరోగ్యం క్షీణించినట్లు ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. కోల్‌కతాలోని బరాసత్ జిల్లా హాస్పిటల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి పలు ఆసుపత్రల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ప్రియాంషి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ.. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని నిర్లక్ష్యం చేయవద్దని, అత్యవసరంగా చికిత్స అవసరం ఉన్న వారి పట్ల వెంటనే స్పందించాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. గత పదేళ్లలో బెంగాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని, ఈ పేరును అప్రతిష్ట చేయవద్దని కోరారు. ( ‘వీడియో కాన్ఫరెన్స్‌లతో మాకు ఒరిగిందేమీ లేదు’ ) -
ఈ వీడియో నిజంగా కంటతడి పెట్టిస్తుంది
నార్త్ కరోలినా : మనం ఇంటర్నెట్లో రోజుకి ఎన్నో వీడియోలు చూస్తుంటాం. అయితే మీరు ఇప్పుడు చూసే వీడియో మాత్రం కంటతడి పెట్టిస్తుంది. అమెరికాకు చెందిన గ్యాబీ క్యాన్సర్ బారిన పడింది. ట్రీట్మెంట్ కోసం గ్యాబీకి తలమీద జుట్టు, కనుబొమ్మలు తొలగించారు. అయితే ఆమెకు క్యాన్సర్ సోకిన దానికంటే అందవికారంగా ఉందనే భావన ఆమె మనుసును ఎక్కువగా కలచివేసేది. దీంతో గ్యాబీ బాధను పోగొట్టేందుకు ఆమె సోదరి క్యామి కూడా తన జుట్టు, కనుబొమ్మలు తీసేసింది. ఆ తర్వాత క్యామి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోనూ షేర్ చేసింది. క్యామి మాటలు ఇప్పుడు అందరి గుండెలను బరువెక్కిస్తున్నాయి. (కరోనా: ఆసుపత్రిలో అమెరికా డాక్టర్ల డ్యాన్స్) 'నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు ఎలా ఉన్నా నాకు మాత్రం అందంగానే కనిపిస్తావు. నువ్వు రోగంతో బాధపడుతూ నీ జట్టు, కనుబొమ్మలు తీసేసుకోవాల్సి వచ్చింది. కనుబొమ్మలు తీసేసిన తర్వాత అందంగా లేకపోవడం వల్లే కదా నువ్వు బాధపడుతున్నావు. ఇదిగో ఇప్పుడు నేను కూడా నా కనుబొమ్మలు, జుట్టు తొలగించుకున్నా. ఒక్కటి మాత్రం నిజం.. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇదంతా నేను ఎవరికోసమే చేయడం లేదు.. కేవలం నీకోసమే మై లవ్లీ సిస్టర్ అంటూ' తన చెల్లికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత వారిద్దరు ఏడుస్తూ ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది. గ్యాబీ తొందరగా కోలుకోవాలి... మీరిద్దరు ఆనందంగా ఉండాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram cant say everything thats been going on has been easy, its been hard, it hurts. but this isnt for any of you or for me, this is for you gaby. I LOVE YOU w every bone in my body. u fight bitch & u do it damn well. hair does not make you. and even bald u still manage to b the prettiest sister, u whore. i love you so so so so much boot boot & every battle u go thru, i promise to go thru it w u cus thats what mf sisters do ❤️ A post shared by yung mila (@trillcami) on Mar 25, 2020 at 6:59pm PDT -
కేన్సర్‌తో పోరాడుతున్న సేవకుడు
సాక్షి, హైదరాబాద్: అతనో సేవకుడు. తాను పేదరికంలో ఉన్నా.. ఆపన్నులకు సేవా హస్తం అందించి సాయపడే గుణం అతనిది. స్వతహాగా ఆటో డ్రైవరైన అతను వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణులకు తన ఆటోను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఇలా ఎంతో మందికి తోడ్పాటును అందించిన ఆపద్బాంధవుడు మ్యాదరి సంజీవ్‌కు ఆపద వచ్చింది. ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. నలుగురికి సేవలందిస్తున్న ఆ పేదవాడి జీవితంలో కేన్సర్ దుఃఖాన్ని మిగిల్చింది. అందినకాడల్లా అప్పులు చేసి మూడెళ్ల క్రితం ఎముకల కేన్సర్‌కు ఆపరేషన్ చేయించుకున్నాడు. కోలుకుంటున్న తరుణంలో కేన్సర్ మహమ్మారి మళ్లీ సోకింది. అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడపడం మానుకోలేదు. ఈ క్రమంలోనే శరీరంలోని మిగతా భాగాలకు వ్యాధి సోకినట్లు వైద్యులు ప్రకటించారు. మరోసారి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కుటుంబ పోషణ, అప్పుల భాదతో తల్లడిల్లుతున్న సంజీవ్‌కు ఆపరేషన్ చేయించుకోవడం మృగ్యంగా మారింది. దిక్కుతోచని స్ధితిలో అటు ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్ధితి లేక ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక సంజీవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆపదలో నేనున్నానంటూ.. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఎవరికి ఆపద వచ్చినా తన ఆటోలో వారి గమ్యస్థానాలకు చేర్చేవాడు సంజీవ్. అర్ధరాత్రయినా సరే వెంటనే చేరుకునేవాడు. తన ఆటోపై వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ఉచితంగా ప్రయాణం అని తన ఫోన్ నంబర్ రాసి ఎంతో మందిని ఆపదల్లో ఆదుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో లేక తాను ఎదుర్కొన్న అవస్థలు మరొకరికి రావద్దని నిర్ణయించుకున్న సంజీవ్ సేవలందించాడు. తనయుడే ఆటో నడుపుతూ.. ఎస్పీఆర్‌హిల్స్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన మ్యాదరి సంజీవ్ తన కుటుంబంతో కిరాయి గృహంలో ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న సంజీవ్ కుమారుడు కార్తీక్ తండ్రి దయనీయ పరిస్థితితో రహమత్‌నగర్, ఎస్పీఆర్హిల్స్ మార్గంలో ఆటో నడుపుతున్నాడు. వచ్చిన డబ్బులతో తండ్రి వైద్య ఖర్చులు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజీవ్ కూతురు కల్యాణి ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపి కుటుంబ పనుల్లో తల్లికి చేదుడువాదోడుగా ఉంటోంది. దాతలు తనను ఆదుకోవాలని సంజీవ్ కోరుతున్నాడు. ఆర్థికంగా సాయపడేవారు 80080 55788ను సంప్రదించాలని వేడుకుంటున్నాడు. -
ఆసుపత్రి బెడ్‌మీద టెన్త్ క్లాస్ ఎగ్జామ్..
ముంబై : చదువుమీద ఉన్న శ్రద్ధ ఓ బాలికను ఆసుపత్రి బెడ్‌మీద నుంచి ఎగ్జామ్ హాల్‌కు నడిపించింది. ప్రాణం తీసే రోగాన్ని లెక్కచేయకుండా పదవ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్లింది. అయితే బాలిక పరిస్థితిని గుర్తించిన ఎగ్జామ్ సెంటర్ అధికారుల చొరవతో ఆసుపత్రి బెడ్‌మీదనుంచే ఎగ్జామ్స్ రాసే అవకాశం దొరికింది. ఈ సంఘటన ముంబైలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. పరేల్‌లోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే తను ఎగ్జామ్స్ రాయటానికి దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్, ఎక్కువ సమయం కేటాయించాలని స్టేట్ బోర్డుకు విన్నవించుకుంది. దీంతో దగ్గరలోని కన్నోసా హైస్కూల్లో ఎగ్జామ్స్ రాసేందుకు ఆమెకు ఏర్పాటుచేయబడింది. మొదటి నాలుగిటి కోసం బాలిక సెంటర్ దగ్గరకు వెళ్లింది. ఆమె పరిస్థితిని గుర్తించిన సెంటర్ అధికారులు బోర్డుకు ఓ విన్నపం చేశారు. ఆసుపత్రి బెడ్‌మీద నుంచే తను ఎగ్జామ్స్ రాసేలా చూడాలని కోరారు. ఇందుకు స్టేట్‌బోర్డు ఒప్పుకోవటంతో శనివారం ఆసుపత్రి బెడ్‌మీదనుంచే జియోమెట్రీ ఎగ్జామ్ రాసింది. -
చావుకు ముందు అతడికి ఓ సర్ప్రైజ్!
సిడ్నీ : క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంకొద్దిరోజుల్లో చనిపోతాడని తెలిసి ఆ ముసలాయనకు సర్ప్రైజ్ వీడ్కోలు ఇచ్చారు కుటుంబసభ్యులు. అతడికి ఎంతో ఇష్టమైన, బెస్ట్ ఫ్రెండ్‌ను కలుసుకునేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. సిడ్నీకి చెందిన పాల్ లీవిస్ అనే ముసలాయన గత కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి ముదరడంతో కొన్ని రోజుల నుంచి అతడ్ని ఆస్పత్రిలోనే ఉంచి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. పాల్‌కు రోజులు దగ్గర పడ్డాయని భావించిన కుటుంబసభ్యులు బ్రతికున్న కొన్ని క్షణాలైనా అతడ్ని సంతోషపెట్టాలనుకున్నారు. ఆస్పత్రి బెడ్ వద్ద పాల్ బెస్ట్ ఫ్రెండ్ కోకో ఇందుకోసం పాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన 19 ఏళ్ల కోకో అనే పిల్లిని అతడి వద్దకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆస్పత్రి బెడ్ మీద కదలలేని పరిస్థితిలో ఉన్న అతడు దాన్ని చూడగానే ఎంతో సంతోషపడ్డాడు. పాల్ మనవరాలు ఎలిసా ఫోటి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అయితే కోకోను కలుసుకున్న రెండు రోజులకు పాల్ కిడ్నీ ఫేయిల్యూర్ కారణంగా మరణించాడు. -
తలకొరివి పెడతాడనుకున్నా.. కానీ వాడే..
కన్నతల్లి.. కట్టుకున్న భార్య.. ఇద్దరు కూతుళ్లకు అతడే కొండంత అండ. పేదరికంలో ఉన్నా ఏనాడు వారికి లోటు రాకుండా చూసుకున్నాడు. ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ నలుగురిలో మంచిపేరు సంపాదించుకున్నాడు. అయితే విధి మాత్రం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. క్యాన్సర్ రూపంలో వెంటాడి.. ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. దీంతో తనకు తల కొరివి పెడుతాడకున్న కొడుకు తన కళ్లముందే వేదన అనుభవిస్తుండటం ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. ఇన్నాళ్లు తమను కంటికి రెప్పలా కాచిన తండ్రి శాశ్వతంగా దూరమవుతాడని తెలిసి అతడి కూతుళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కడదాకా తోడుంటానని బాస చేసిన భర్త.. ఇలా తనకు జీవిత కాలపు విషాదాన్ని మిగల్చబోతున్నాడంటూ అతడి భార్య విలపిస్తోంది. భర్తను కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సమ్మయ్య(40)కు ఇరవై ఏళ్ల క్రితం.. తన మేనమామ కూతురు కవిత(34)తో వివాహం జరిగింది. ఆయన ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తూ తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. కవిత తన భర్తతో కలిసి వ్యవసాయం పనులకు వెళ్తుండేది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉన్నంతలో హాయిగా జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సుచిత్ర(18), వైష్ణవి(14) ఉన్నారు. నాలుగేళ్ల కింద వెన్నంపల్లిలో అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉండడంతో కవిత ఆయాగా ఎంపికైంది. భర్త సంపాదన, అంగన్వాడీ విధులతో కుటుంబం హాయిగా గడుస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం సమ్మయ్యకు తీవ్రమైన తలనొప్పి రావడంతో కరీంనగర్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని సూచించారు. ఆ స్కానింగ్‌లో తలలో ట్యూమర్ ఉందని తేలడంతో 5 నెలలు చికిత్స చేయించారు. అయినా తలనొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకోవాలని చెప్పడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ న్యూరో విభాగం ప్రత్యేక వైద్యులను సంప్రదించగా ఆపరేషన్ చేయాలని సూచించారు. నెలరోజులు హైదరాబాద్‌లో ఉండి ఆపరేషన్ చేయించారు. శస్తచికిత్స అనంతరం క్యాన్సర్ కణాలు పెరగకుండా రేడియేషన్ చేయించుకోవాలని సూచించడంతో తమకు ఉన్న ఎకరం పొలం తాకట్టు పెట్టి.. అప్పులు చేసి దాదాపు రూ. 8 లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేసుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో కూలీ పనులకు.. సమ్మయ్య భార్య కవితకు వస్తున్న రూ. 6 వేల జీతం సరిపోక ఇద్దరు కుటుంబ పిల్లల పోషణ, భర్త వైద్యం ఖర్చులు భరించలేక కుటుంబం విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో సమ్మయ్య తల్లి మధురమ్మ తనకు వచ్చే పెన్షన్ డబ్బులను కొడుకు వైద్యం కోసం ఖర్చుపెడుతోంది. 70 ఏళ్ల వయసులో కొడుకు వైద్యం ఖర్చుల కోసం ఆమె కూలీ పనులకు వెళ్తుండడం పలువురిని కలిచివేస్తోంది.. రేడియేషన్ అనంతరం శరీరం బాగా క్షీణించడంతో సమ్మయ్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. చార్జీలకు సైతం ఇబ్బందే.. సమ్మయ్య పదిహేను రోజులకొకసారి హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రవాణా ఖర్చులకు సైతం డబ్బులేదని కవిత వాపోతోంది. ఇరుగుపొరుగు, బంధువుల వద్ద చార్జీలకు డబ్బు తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్నారు. క్యాన్సర్ రోగులకు వర్తించే ఫించను మంజూరు చేస్తే కొంత మేరకైనా ఖర్చులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ కూడా లేక భర్తను బతికించుకునేందుకు ఆయాగా విధులు నిర్వర్తిస్తూ.. రాత్రిపూట నిద్ర లేకుండా భర్తకు సేవలు చేస్తూ గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మనసున్న మారాజులు, స్వచ్చంద సంస్థలు ఎవరైనా ఆపన్నహస్తం అందించకపోతారా..! అని ఆశగా ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్య సేవలు అందించి కొంత కాలమైనా తన భర్తను కాపాడుకోవాలని ఆకాంక్షిస్తోంది. సమ్మయ్యతో తల్లి మధురమ్మ, కూతురు వైష్ణవి నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. పెద్దోళ్లు ఇద్దరూ ఉన్నంతలో కష్టపడి బతుకుతున్నారు. చిన్న కొడుకు సమ్మయ్యకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. నాకు కడుపుకోత మిగిలేలా ఉంది. కొరివి పెడతాడనుకున్న చిన్న కొడుకు... ఇలా ఎముకల గూడై పోవడంతో.. ఇది చూసేందుకేనా నేను బతికి ఉన్నది అనిపిస్తోంది. చుట్టాలు, ఇంటి పక్కనోళ్లు చేతనైంత సాయం చేశారు. అయినా వాడి చికిత్సకు డబ్బులు చాలడం లేదు. పెద్ద మనసు చేసుకుని నా కొడుకును బతికించేందుకు ఆర్థిక సాయం చేయండి. ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారు. వారి పరిస్థితేంటో.. నా కోడలు బతుకు ఏమవుతుందో తెలుస్తలేదు- మధురమ్మ, సమ్మయ్య తల్లి సమ్మయ్య కుటుంబానికి సహాయం చేయాలనుకున్న వారు: మొలుగూరి కవిత(మాతంగి శారద- పుట్టింట్లో పేరు)- అకౌంట్ నంబరు: 62333133861...ifsc: SBHY0020143లో డబ్బు జమచేయగలరు. వివరాల కోసం: ఫోన్ నంబరు: 8897077534లో సంప్రదించగలరు. -
క్యాన్సర్ రోగులకు పరిమితులొద్దు..
సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం జగన్ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇలాంటి నిరుపేదలను పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి గతంలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు. క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని విడతలు చికిత్స అవసరమైనా చేయించాలని సీఎం స్పష్టం చేశారు. చికిత్సలో ఎన్ని సైకిల్స్ అవసరమైనా పూర్తి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందింస్తున్నామని చెప్పారు. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తోందని.. అత్యవసర కేసులు ఉంటే.. ఆ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. -
ఇవ్వడంలోనే ఉంది సంతోషం
ఉద్యోగం చేసేవారైనా, ఇంటిపట్టున ఉండేవారైనా ఆడవాళ్లు పొడవైన శిరోజాలను ఇష్టపడతారు. ఏ ఉద్యోగంలో ఉన్నా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే.. కేరళలో మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ ఓ క్యాన్సర్ బాలిక విగ్గు కోసం పొడవాటి తన జడ కత్తిరించి ఇవ్వడం ఒక విశేషం అవడమే కాకుండా.. ఎందరికో ఆమె ప్రేరణగా నిలిచారు. త్రిశూర్ సమీపంలోని ఇరింజలకుడ మహిళా పోలీస్ స్టేషన్లో అపర్ణ సీనియర్ పోలీస్ అధికారి. 17 ఏళ్ల క్రితం పోలీసుగా విధులను చేపట్టారు అపర్ణ. ఆమె కురులు తల నుంచి మోకాలి పొడవు వరకు ఉండేవి. మూడేళ్ల క్రితం తొలిసారిగా ఆమె జుట్టును క్యాన్సర్ పేషంట్ల కోసం దానం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ పనికి పూనుకున్నారు. ‘ముందు ఎవరికీ చెప్పలేదు. అలా చెబితే నాకు అడ్డు చెప్పేవారే ఎక్కువ ఉంటారు. ఆలోచన వచ్చిన వెంటనే సెలూన్‌కి వెళ్లిపోయాను. విగ్గులు తయారు చేసేవారికి ఆ వెంట్రుకలు ఇచ్చేశాను. ఆ విగ్గును క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు చేరేలా చూశాను. ఇదో పెద్ద విషయంగా పరిగణించలేదు’’ అని చెబుతారు అపర్ణ. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో లేను, ఇలా కొందరి పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్నాను అంతే’’ అంటూ సంతోషంగా చెబుతున్నారు అపర్ణ. ఆత్మన్యూనతను పోగొట్టేందుకు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా చూడడం కష్టం. పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమో గురించి అంతగా తెలియదు. ‘‘క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కీమోథెరపీ చేయించుకుని జుట్టు కోల్పోయిన తరువాత పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కోవచ్చు. లేదంటే అందరికీ జుట్టు బాగా ఉండి తమకెందుకు ఇలా జరిగిందని బాధపడవచ్చు. ఈ ఆలోచనలు వారిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. క్యాన్సర్ బారిన పడి, కీమో థెరపీ చేయించుకున్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అమ్మాయిని చూసినప్పుడు ఇలాగే బాధనిపించింది. అలాంటి పిల్లలు పడే బాధను తొలగించి, వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఏం చేయచ్చు అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు ఈ పోలీస్ అధికారిణి. అనుష్కా శర్మ : ‘అపర్ణ చేసిన పని సాధారణమైనదేమీ కాదు. అమెకు నా అభినందనలు’ అపర్ణకు ఇద్దరు కుమార్తెలు.ఎంఎస్సీ చదువుతున్న దేవిక, పదోతరగతి చదువుతున్న గౌరీ కూడా రెండేళ్ల క్రితం తల్లిలాగే విగ్గుల కోసం తమ పొడవైన కురులను దానం చేశారు. అపర్ణ బంధువు, తోటి మహిళా పోలీసు అధికారి కూడా ఆమె ధైర్యమైన చర్యతో ప్రేరణ పొంది తమ శిరోజాలను దానం చేశారు. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ అపర్ణ పెద్దమనసుకు ప్రశంసలు కురిపించారు. వెల్లువలా వచ్చి పడుతున్న అభినందనలపై అపర్ణ స్పందిస్తూ.. తాను చేసింది పెద్ద ఘన కార్యమేమీ కాదని.. వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతాయని, నిజమైన త్యాగం అవయయ దానం చేసే వారిదేనని అన్నారు. – ఆరెన్నార్