చైనాలోని హార్బిన్ పట్టణంలో సోమవారం హార్బిన్ యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రిలో దురదృష్ణకర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ 20 ఏళ్ల యువతి ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోంది. క్యాన్సర్ బాగా ముదురిపోయిందని, బతికే అవకాశాలు పెద్దగా లేవని డాక్టర్లు ఆమెకు తేల్చి చెప్పారు. దాంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురయింది. ఆత్మహత్య చేసుకునేందుకు తానుంటున్న వార్డు నుంచి కిందకు దూకేసింది.
అప్పుడే ఓ రోగిని పరామర్శించడం కోసం వచ్చి ఆస్పత్రి లాంజ్‌లో పచార్లు చేస్తున్న ఓ యువకుడిపై క్యాన్సర్ రోగి అనూహ్యంగా పడిపోయింది. ఆమె బరువు, వేగానికి ఆ యువకుడు నేలకు ఢీకొని ఎగిరి పక్కన పడిపోయాడు. ఆ యువకుడిని ఢీకొని పక్కకు పడిపోయిన క్యాన్సర్ రోగి అక్కడికక్కడే మరణించింది. యువకుడు మాత్రం వెన్నుముక విరిగి ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చైనా పోలీసులు తెలిపారు. అంతకుమించి వివరాలు తెలియజేసేందుకు వారు తిరస్కరించారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆస్పత్రి లాంజ్‌లో పది మంది సాక్షులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment