అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం ఓ క్యాన్సర్ పేషెంట్ సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు.
అర్ధవీడు మండలం నాగులవరం గ్రామంలో మంగళవారం ఓ క్యాన్సర్ పేషెంట్ సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గ్రామానికి చెందిన నాగరాజు(37) అనే వ్యక్తి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోన్నాడు. క్యాన్సర్ వచ్చినా కుటుంబసభ్యులూ, బంధువులూ పట్టించుకోవటం లేదని మనస్తాపం చెందిన నాగరాజు మంగళవారం టవర్ పైకి ఎక్కి దూకుతానని బెదిరిస్తోన్నాడు. నాగరాజును కిందదించే ప్రయత్నం గ్రామస్తులు చేస్తోన్నారు.