ప్రతీకాత్మక చిత్రం
ముంబై : చదువుమీద ఉన్న శ్రద్ధ ఓ బాలికను ఆసుపత్రి బెడ్‌మీద నుంచి ఎగ్జామ్ హాల్‌కు నడిపించింది. ప్రాణం తీసే రోగాన్ని లెక్కచేయకుండా పదవ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్లింది. అయితే బాలిక పరిస్థితిని గుర్తించిన ఎగ్జామ్ సెంటర్ అధికారుల చొరవతో ఆసుపత్రి బెడ్‌మీదనుంచే ఎగ్జామ్స్ రాసే అవకాశం దొరికింది. ఈ సంఘటన ముంబైలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. పరేల్‌లోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. అయితే తను ఎగ్జామ్స్ రాయటానికి దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్, ఎక్కువ సమయం కేటాయించాలని స్టేట్ బోర్డుకు విన్నవించుకుంది.
దీంతో దగ్గరలోని కన్నోసా హైస్కూల్‌లో ఎగ్జామ్స్ రాసేందుకు ఆమెకు ఏర్పాటుచేయబడింది. మొదటి నాలుగిటి కోసం బాలిక సెంటర్ దగ్గరకు వెళ్లింది. ఆమె పరిస్థితిని గుర్తించిన సెంటర్ అధికారులు బోర్డుకు ఓ విన్నపం చేశారు. ఆసుపత్రి బెడ్‌మీద నుంచే తను ఎగ్జామ్స్ రాసేలా చూడాలని కోరారు. ఇందుకు స్టేట్‌బోర్డు ఒప్పుకోవటంతో శనివారం ఆసుపత్రి బెడ్‌మీదనుంచే జియోమెట్రీ ఎగ్జామ్ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment