
17 ఏళ్ల హేమంత్ కోరిక 'అలా తీరింది'
ఉదయ్పూర్: కేన్సర్ వ్యాధితో మరణానికి చేరువవుతున్న చిన్న బాలుడు చివరి కోరిక...పోలీసు కమిషనర్గా విధులు నిర్వహించాలి. ఆ విషయాన్ని బాలుడు తల్లిదండ్రులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు వెల్లడిస్తే... వారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతారు. దాంతో సదరు బాలుడు ఓ రోజు పోలీసు కమిషనర్గా విధులు నిర్వహిస్తాడు. ఈ సంఘటన అలా మొదలైంది చిత్రంలో చూశాం. అచ్చు గుద్దినట్లు ఇలాంటి సంఘటనే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటు చేసుకుంది.
17 ఏళ్ల యువకుడి హేమంత్ లోహర్కు క్యాన్సర్ సోకింది. దీంతో అతడు ఉదయ్పూర్లోని పసిఫిక్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. తాను సదరు కాలేజీ ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నట్లు అతడి మనసులోని మాటను కుటుంబ సభ్యులకు వివరించాడు. దాంతో ఆ విషయాన్ని మెడికల్ కాలేజీ యాజమాన్యానికి తెలిపడంతో... అందుకు వారు అంగీకరించారు. దీంతో బుధవారం ఓ రోజు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్గా హేమంత్ వ్యవహారించారు. మెడికల్ కాలేజి యాజమాన్యం హేమంత్కు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తుంది.