
ఈనెల 22న ఉదయ్‌పూర్‌లో వివాహం
24న హైదరాబాద్‌లో రిసెప్షన్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పారాణితో ముస్తాబుకానుంది. ఆమె పెళ్లి బాజాకు మూహూర్తం కూడా ఖారారైంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్ (రాజస్తాన్)లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరుగనుంది. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె నవ వధువుగా పెళ్లి పీటలెక్కబోతోంది.
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది. తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు.
‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తాం. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయి’ అని రమణ వెల్లడించారు.
భారత బ్యాడ్మింటన్‌లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలు, రెండు వరుస ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధు... 2017, 2018లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పతకాలు గెలుచుకుంది.

Comments
Please login to add a commentAdd a comment