
ఉదయ్‌పూర్: కోర్టుల్లో రాకెట్ పట్టి ప్రత్యర్థులతో పోటీపడి సెమీస్, ఫైనల్స్ ప్రవేశించే తెలుగింటి ఆడపడుచు సింధు ఇప్పుడు నవవధువుగా ముస్తాబై మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాజమహల్‌లాంటి వేదికపై ఆదివారం రాత్రి జరిగిన వివాహ వేడుకలో ఆమె తమ ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకట దత్తసాయిని వివాహమాడింది.
పెద్దలు కుదిర్చిన ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 24న (మంగళవారం) హైదరాబాద్‌లో వీరి వివాహా రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, ప్రభుత్వ పెద్దలు
హాజరయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment